ఒక రోజు శ్రీను ఒక కేసు విషయంలో తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటే వాళ్ల బాస్ లోపలికి పిలిచాడు, దాంతో శ్రీను లోపలికి వెళ్ళాడు అక్కడ ఒక అమ్మాయి నీ చూశాడు శ్రీను తనని చూడగానే ఏదో తెలియని ఆకర్షణ ఎక్కడో చూసినట్లు అనిపించింది, అప్పుడు శ్రీను బాస్ “శ్రీను ఈమె పేరు లీలా తన అన్నయ్య రామ్ నాలుగు రోజుల నుంచి కనిపించడం లేదు అంట సో ఈ కేసు నీ నువ్వే హ్యాండిల్ చెయ్యి” అని చెప్పాడు దాంతో కేసు ఫైల్ చూస్తూ బయటికి వచ్చాడు శ్రీను అప్పుడు లీలా ఒక చిన్న packet శ్రీను కీ ఇచ్చి “నేను నీ కార్ దెగ్గర వెయిట్ చేస్తూ ఉంటా అన్నయ్య” అని చెప్పి వెళ్లిపోయింది లీలా “అన్నయ్య” ఏంటి అని packet తెరిచి చూశాడు అందులో ఒక coin ఉంది అది సూర్యకాంతి వచ్చే లాగా ఉన్న coin లాగే ఉంది కానీ అది కొంచెం వేరుగా ఉంది, దాని తాకగానే శ్రీను కీ కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది దాంతో పాటు విపరీతంగా తల నొప్పి వచ్చింది దాంతో తన మెదడు లో ఎన్నో గొంతులు వినిపిస్తున్నాయి అందులో ఒక గొంతు శ్రీను కీ స్పష్ఠం గా వినిపించింది ఆ గొంతు ఎవరిదో అతని రూపం కూడా కనిపించింది శ్రీను కీ ఆ వ్యక్తిని ఎవరో ఒక ల్యాబ్ లో కట్టి పెట్టి ఒక oxygen పైప్ పెట్టి ఎన్నో cables తగిలించి ఉంచారు “హలో బిగ్ బ్రదర్ నేను రామ్ నీ తమ్ముడి నీ save me brother” అని telepathy ద్వారా శ్రీను కీ చెప్పాడు అది అంత విన్న శ్రీను బయటికి వచ్చి కార్ ఎక్కాడు అప్పటికే లీలా లోపల ఉంది “ఎక్కడికి వెళ్లాలి” అని అడిగాడు శ్రీను దానికి లీలా “ఈ కథ ఎక్కడ మొదలు అయిందో అక్కడికి మైసూర్ కీ” అని చెప్పి గట్టిగా ఊళ వేసింది.
TO BE CONTINUED….?
