నాలో సగం 532

నోరు మూసుకుని అవి తిని చేతులు కడుక్కునే వరకు కాఫి టేబుల్ పై ఉంది, ప్రశాంతంగా కాఫీ తాగి టి వి చూస్తూ ఉన్నాను.

7 కి పల్లవి వచ్చి కిచెన్ లోకి వెళ్లింది రాత్రి భోజనం తయారు చేసి 8.30 వరకు అన్ని డైనింగ్ టేబుల్ పైన పెట్టి, నా దగ్గరకు వచ్చి, సారి అన్నయ్య ఉదయం కాస్త గట్టిగా మాట్లాడాను, ఏమి అనుకోవద్దు, వదిన మీ గురించి చాల జాగ్రత్తలు చెప్పింది, అందుకే అలా…

ఫర్వాలేదు నేను ఏమి అనుకోను, మా ఆవిడ సంగతి నాకు తెలుసు, మీరు ఫీల్ కాకండి అన్నాను.

భోజనం రెడీ చేసి హాట్ బాక్స్ లో పెట్టాను తినండి అంది పల్లవి.

గంగిరెద్దులా తల ఊపాను.

తను నా వైపు చూసుకుంటూ మెల్లిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.

9.00 కి లేచి భోజనం చేసాను, ఆహా… ఏమి రుచి అద్భుతం మొత్తం వండింది అంత తినేసాను.

భుక్తాయాసం తో సిగరెట్ వెలిగించి టి వి చూసుకుంటూ కూర్చున్నాను.
10.00 కు కృష్ణ వచ్చాడు, పలకరింపులు అయ్యాక మాటలాల్లో తనకు డ్యూటీ మధ్యాహ్నం 12.00 కు వెళ్లి రాత్రి 10.00 వరకు వస్తాను అని చెప్పాడు. అతని జాబ్ గురించి, ఫామిలీ గురించి, నా జాబ్ వివరాలు మాట్లాడుతూ10.30 అయ్యింది, పల్లవి వచ్చి కృష్ణ ను పిలిచింది. కృష్ణ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.

డోర్ వేసుకుని కడుపునిండా తినడం వల్ల వెంటనే నిద్రపోయాను.
ఉదయం మళ్ళీ అద్భుతమైన కాఫి తో మొదలైంది…

రోజులు గడుస్తున్నాయి, చూస్తుండగానే 20 రోజులు గడిచిపోయాయి, నేను ఊరికి వెళ్లలేక పోయాను, నాకు ఆఫీస్ లో ఆడిటింగ్ వల్ల, నా భార్య పిల్లలకు ఎగ్జాంస్ అని రాలేకపోయింది.

పల్లవి మీద నేను ఎంతగా ఆధారపడ్డాను అంటే తను లేనిది నాకు ఒక్క పని కూడా చేయలేకపోయేవాడిని, మెల్లిగా పల్లవి ఇల్లు,నన్ను తన కంట్రోల్ లోకి తీసుకుంది, ఈ విషయం నాకు తెలియకుండానే తన కంట్రోల్ లోకి వెళ్లిపోయాను.

మా ఇద్దరికీ సరిపోయే కూరగాయలు, గుడ్లు, వారానికి రెండు సార్లు మటన్ కానీ, చికెన్ కానీ తప్పని సరిగా తెచ్చేవాడిని, మొదట్లో వద్దని చెప్పింది, నేను కోపంగా ఇవి వద్దంటే నువ్వుకుడా నాకు వంట చేయవద్దు అన్నాను, పల్లవి కామ్ అయిపోయింది.

కృష్ణ తన జాబ్ లో కొంత ఇబ్బంది ఉంది అని చెప్పాడు, నేను తనకి, మా ఆఫీస్ లో కాంట్రాక్టర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర సబ్ కాంట్రాక్ట్ నీకు ఇప్పిస్తాను, మంచిగా చేసుకుంటే పైకి రావచ్చు అని చెప్పాను, తను పల్లవి ని అడిగి చెపుతాను అన్నాడు.

ఉదయం పల్లవి వచ్చి కాఫి ఇచ్చి నా ఎదురుగా కూర్చుని మా ఆయనకు రాత్రి కాంట్రాక్ట్ గురించి చెప్పారట అన్నయ్య అంది.

అవును అంటూ అన్ని విషయాలు తనకు అర్ధం అయ్యేలా చెప్పాను, అన్ని శ్రద్ధగా విని మీ ఇష్టం అన్నయ్య, మీరు ఎలా చెపితే అలాగే చేస్తాం అంది.
నేను సంతోషపడ్డాను, ఏ స్వార్ధం లేకుండా నాకు సేవ చేస్తున్న వీళ్లకు నాకు చేతనైన సహాయం చేయగలిగాను అని.

మరునాడు ఆఫీస్ కి వెళ్లి ఒక పెద్ద కాంట్రాక్టర్ ను పిలిపించి తనకు సంబంధించిన ఒక చిన్న కాంట్రాక్ట్ కృష్ణ కు వచ్చేలా ఏర్పాటుచేసాను. కాంట్రాక్టర్ల బిల్లులు నా ద్వారానే మంజూరు అవుతాయి కాబట్టి నా మాట కాదు అనరు.

ఈ వర్క్ మంచిగా చేస్తే వేరే వర్క్ కూడా ఇస్తాను అన్నాడు అతను.
నేను కృష్ణను ఆఫీసుకు పిలిపించి అతనికి పరిచయం చేశాను, అతను కృష్ణను తీసుకుని వెళ్ళిపోయాడు.