ఓ భార్యాభర్తలు కొన్ని కారణాల వల్ల ఇబ్బందుల్లో పడుతారు 611

మా టేస్ట్ కు తగ్గట్టు కట్టించాం. నెల నెల బ్యాంక్ కు 50వేలు కట్టాలి. అందులో మేము హ్యాపీగా ఎంజాయ్ చేయడమే కాకుండా ఈమధ్యే 15లక్షల కార్ కూడా కొన్నాం. దానికి కూడా నెల నెల 25వేలు బ్యాంకులో కట్టాలి. అప్పుడప్పుడు మేమిద్దరం పబ్ వెళ్లడం కూడా చేసేవాళ్ళం. నాకూ కాలేజీ రోజుల్లో ఫ్రెండ్ ద్వారా కొద్దిగా మందు అలవాటు అయింది. ఆ అలవాటే అప్పుడప్పుడు అమూల్య నేను కలిసి తాగేవాళ్ళం. అలాఅని అమూల్య ఎక్కువ తాగేది కాదు. అతి కష్టంగా రెండు పెగ్గులు మాత్రమే. అలా అని మేము రోజు తాగేవాళ్ళం కాదు. నెలలకోసారి మాత్రమే తాగేవాళ్ళం. అదికూడా ఇంట్లోనే.

చూస్తూ చూస్తూనే మా ప్రేమ పెళ్ళికి రెండు సంవత్సరాలు నిండిపోయాయి. ఇప్పుడే పిల్లలు వద్దనుకున్నాం. నేనంటే అమూల్య కు చాలా ఇష్టం. అలాగే అమూల్య అంటే నాకూ చాలా ఇష్టం. ఇప్పుడు నాకున్న, నా అనుకునే ఒకేఒక మనిషి అమూల్య. నాకూ ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటుంది. అలా హ్యాపీగా సాగిపోతున్న మా జీవితంలో అనుకోని మలుపు తిరిగింది.

ఐ.టి ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ లేకపోవడంతో సీనియర్స్ ఎంప్లాయిస్ని, బెంచ్ మీద ఉన్న ఎంప్లాయిస్ని, జీతం ఎక్కువ ఉన్న ఎంప్లొయీస్ని టార్గెట్ చేసి వాళ్ళను తీసేయ్యాలని నిర్ణయించుకున్నారు. మా కంపెనీ ముందునుండే కొద్దిగా లాస్ లో నడవడం, షేర్స్ తగ్గిపోవడం, దాంతో మా సీఈవో వేరేవాళ్లకు కంపెనీ అమ్మేయడంతో పాత స్టాఫ్ అందరికి మూడు నెలల జీతం ఇచ్చేసి జాబ్ నుండి తీసేసారు. అలా అర్ధాంతరంగా జరిగిన పరిణామం, కంపెనీ బ్యాడ్ రిమార్క్ రావడంతో బయట జాబ్ వెతికిన ఎక్కడ కూడా దొరకలేదు.

అలా చూస్తుండగానే 8నెలలు గడిచిపోయాయి. బ్యాంక్ వాళ్లకు, కార్ లోన్స్ కట్టాల్సిన డబ్బులు ఉన్నదానిలో 3నెలల EMI కట్టేసాం. ఇప్పుడు 5నెలల నుండి అటు బ్యాంక్ లోన్, ఇటు కార్ లోన్ కట్టక పోవడంతో కాల్స్ చేసి డబ్బులు కట్టక పోతే కార్, ఫ్లాట్ రెండు కూడా వాళ్ళ ఆధీనంలో తీసేసుకుంటారని చెప్పారు. ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్ లో బయట కూడా ఎలాంటి వేకెన్సీలు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

అమూల్య: ఏంటండీ ఎక్కడైనా అప్పుగా అయినా దొరికాయ డబ్బులు.

అభి: లేదు అమ్ము. చాలా చోట ట్రై చేశాను. నాతో పాటు జాబ్ చేసిన వాళ్ళ పరిస్థితి కూడా నా లాగే ఉంది. వాళ్ళదగ్గర కూడా డబ్బులు లేవని చెప్పారు.

అమూల్య: అందుకే మీకు ముందు నుండి చెబుతూనే వచ్చాను. డబ్బులు వేస్ట్ ఖర్చులు చేయకుండా వేనేకేసుకుందామని. మీరు వింటే కదా నా మాటలు. ఇప్పుడు చుడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో.
అభి: అబ్బా అమ్ము… నేనేమైన ఇలాంటి పరిస్థితి వస్తుంది అని కలగన్నానా?

అమూల్య: అలా అవుతుంది అని ఎవరు అనుకోరు. కాని ఇప్పుడు అయింది కదా. అలా అవ్వకుండా ఉండాలనే జాగ్రత్త పడతారు.

అభి: నాకూ తెలిసిన ఓ ఫ్రెండ్ వాళ్ళ కంపెనీ లో రెస్యూమ్ ఫార్వర్డ్ చేసాడంట. రెండు నెలల్లో వాళ్లకు కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయని చెప్పాడు. అప్పుడు కచ్చితంగా నన్ను రికమెండ్ చేస్తాడని చెప్పాడు.

అమూల్య: ఇంకా రెండు నెలల వరకు లోన్స్ ఇచ్చిన వాళ్ళు ఆగారు కదా మనకోసం. మా అమ్మ వాళ్ళ దగ్గర అడుగుదామంటే నెల జీతం అంతంత మాత్రంగా వాడితే వాళ్ళకే సరిపోతుంది. ఇప్పుడు నేను జాబ్ చేద్దామనుకుంటే నాకూ 20-25వేలు కంటే ఎక్కువ ఇవ్వలేరు. ఉన్న బంగారం అమ్మేసి ప్లాట్ డౌన్పేమెంట్ చేశాం. ఇప్పుడు మిగిలింది ఈ మెడలో మీరు కట్టిన తాళి, ముక్కుపుడక తప్ప ఇంకేమి లేనంతగా అయిపోయింది మన పరిస్థితి.

అభి: (ఇంతలో ఫోన్ మోగింది) హలో! సార్ చెప్పండి. నేను మేనేజర్ తో మాట్లాడుతాను వచ్చి. ఇంకోసారి ఒకనెల రోజులు టైం ఇవ్వండి సార్ ప్లీజ్. హలో… హలో. (ఫోన్ కట్ అయిపోయింది)

అమూల్య: ఎవరిది కాల్.

అభి: బ్యాంక్ నుండి చేశారు.

అమూల్య: ఏమన్నారు.

అభి: 10-15రోజుల్లో డబ్బులు కట్టకపోతే ఈ ఫ్లాట్ ను వేలానికి వేస్తారని చెప్పారు. ఒకనెల గడువు ఇవ్వమని చెప్పాను. కావాలంటే మేనేజర్ తో మాట్లాడుతాను వచ్చి అన్నాను. కానీ మేనేజరే కాల్ చేసి చెప్పమని చెప్పాడంట.

అమూల్య: ఇప్పుడు ఎలా అండి మన పరిస్థితి. ఈ ఫ్లాట్ పోయినట్టేనా. ఎంతో ఇష్టంగా కట్టించుకున్నాం కదండీ. మీకు ఇదంటే చాలా ఇష్టం కదా.

అభి: అదే అర్ధం అవడం లేదు అమ్ము. చూడాలి ఎవరైనా అప్పు ఇస్తారేమో ట్రై చేయాలి. (ఇంతలో ఇంకోసారి ఫోన్ మోగింది) హలో! ఎవరు. నేను నీ ఫ్రెండ్ సహాయ్ మాట్లాడుతున్నాను. రేపు ముంబయి వస్తున్నాను. వారం రోజులు నీదగ్గరే ఉంటాను. వచ్చి పికప్ చేసుకో. ఉంటాను. బాయ్. అరె హలో… హలో (కాల్ కట్ అయిపొయింది)

అమూల్య: ఇప్పుడు ఎవరు కాల్ చేసారు.

3 Comments

  1. ఆకాంక్ష.. సుపర్ స్టొరీ చాల అందంగా ముగించారు..విలువలు బంధాలు అనుబంధాలు చక్కటి ప్రేమ కథ

  2. Eti vantivibperti mansu marchunanuduku thanks

  3. hi friend story super .mugempu kuda chala bagundi super.

Comments are closed.