నేను రాను – Part 4 185

“అదే మరి,వాడు స్వేచ్చగా తిరుగుతూ చేయాల్సినవి చేస్తూ ఉంటాడు అని ఇన్ఫో ఉంది”చెప్పింది వసు.
“మేడం ఇలాంటి వాడిని ఎందుకు చంపలేదు ,నా హస్బెండ్ వీడి వల్లే చనిపోయాడు”అంది వైశాలి బాధతో.
“అసలు వీడి వరకు ఎవరు వెళ్ళలేదు, వీడి కి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న gangs కి ఫ్రెండ్షిప్ ఎక్కువ అని తెలిసింది.”
“ఎందుకు”
“వాడికి కాశ్మీర్ ను పాక్ లో కలపాలని ఆశయం”అంది వసుంధర.
ఢిల్లీ లో చలి పెరుగుతోంది,వైశాలి ఆ మంచు లో ఢిల్లీ ను చూస్తూ మౌనంగా కూర్చుంది.

“ఎందుకు మాడం వాళ్ళు కాశ్మీర్ అంటూ విసిగిస్తారు”అడిగింది వైశాలి.
“మత ప్రాతపదికన దేశం విడి పోయాక పాక్ ” జన సంఖ్య ఎక్కువ ఉన్న హైద్రాబాద్,కాశ్మీర్ జునగడ్ లు తనకి కావాలి అంది.
అప్పుడు జరిగిన రాజకీయాల్లో వాళ్ళు కాశ్మీర్ మీద దాడి చేశారు”ఆగింది వసుందర.
“ఇప్పుడు ఎందుకు అప్పటి విషయాలు పట్టుకు వ్రేలాడుతు ఉంది పాక్”అడిగింది వైశాలి.
“సింపుల్ 370″అంది వసుంధర.
“అంటే”
“ఇండియా లో కాశ్మీర్ ను కలిపాక 370 ప్రకారం దాదాపు ఇంకో దేశం లాగ ఉండేలా చట్టం చేశారు అప్పటి పెద్దలు,పాక్ ఆజాద్ ఇమ్మంటోంది కాశ్మీర్ కి”అంది వసుంధర.
“అయితే 370 లేపెస్తే పోతుంది కదా తల నొప్పి”అంది వైశాలి.
“నిజమే కానీ ఏమి జరగదు అని ధైర్యం చేసే పొలిటికల్ విల్ ఉంటే జరుగుతుంది.”అంది వసుంధర.
“మేడం ఖాన్ లాంటి వాళ్ళ సంగతి ib లో నా లాంటి వారు చూసుకుంటారు,మీరు 370 లేపేసే పొలిటికల్ గ్రూప్ ల కి హెల్ప్ చెయ్యండి”అంది వైశాలి.
వసుందర కూడా మనసులో అదే అనుకుంది.
తర్వాత రోజు నుండి మీడియా లో ,పొలిటికల్ గ్రూప్స్ లో తనకున్న పరిచయాల ద్వారా ఈ విషయా న్ని లైవ్ లో ఉండేలా చేసింది వసుందర.

ఖాన్ ఖాళీగా లేడు,,కొన్ని గ్రూప్స్ ని ఆక్టివేట్ చేయటం తో వాళ్ళు కాల్పులు బ్లాస్టింగ్స్ చేసారు .

వైశాలి ట్రైన్ లో జమ్మూ బయలుదేరింది , ఆమె అక్కడ దిగే టైం కి కొంత ప్రశాంతం గానే ఉంది .
హోటల్ లో రూమ్ తీసుకుని సెట్ అయ్యాక బయటకి వస్తుంటే “హాయ్ “అని వినబడి చూసింది .హైదరాబాద్ హాస్పిటల్ లో కనబడిన మోహన్ .
“మీరు ఇక్కడ ఏమిటి “అన్నాడు
“ఎదో న్యూస్ కోసం “అంది వైశాలి
“నాకు ఇక్కడ బిజినెస్ ఉంది “అన్నాడు
ఇద్దరు హోటల్ లోకి వెళ్లి ఫుడ్ తిన్నారు ..
“ఇక్కడ ఏమి బిసినెస్ ”
“క్లోత్స్ ,ఫ్రూట్స్ ఇలా కాశ్మీర్ నుండి ఇక్కడికి తెచ్చి ఇక్కడి నుండి దేశం లో మిగతా ఏరియా ల కి పంపుతాను “అన్నాడు
తన పార్ట్నర్ అని కాశ్మీర్ అమ్మాయిని ఆమె హస్బెండ్ ని పరిచయం చేసాడు మోహన్ .
ఆ అమ్మాయితో కలిసి జమ్మూ చూసి కార్ లో కాశ్మీర్ వచ్చింది వైశాలి .
“మా ఇంట్లో ఉండండి , నేను ఒక్కదాన్నే కదా “అంటే కాశ్మీర్ అమ్మాయితో ఆమె ఇంట్లో దిగింది వైశాలి .

మీడియా లో 370 గురించి వస్తున్నా న్యూస్ కి కొన్ని పార్టీ లు రియాక్షన్ ఇస్తున్నాయి .

అవును అని కొన్ని వద్దు అని కొన్ని .
@@@@
జలంధర్ లో సినిమా షూటింగ్ కోసం వచ్చిన కియారా ను చూడటానికి జనం రాలేదు
“నేను పాపులర్ అవలేదా”అంది అసిస్టెంట్ తో .