నేను రాను – Part 4 185

గంట తర్వాత నెట్,ఫోన్ ,టీవీ నెట్వర్క్స్ జమ్ము లో కాశ్మీర్ లో ఆగిపోయాయి.
వైశాలి కి వసుందర తో లింక్ పోయింది.
జాని కి అతని ఫ్యామిలీ తో లింక్ పోయింది.
మూవీ టీమ్ కి అందరితో లింక్ పోయింది.
జానీ నిర్లిప్తంగా డ్యూటీ లో ఉన్నాడు.అతని చేతిలో ఫోన్ ఇప్పుడు నిర్జీవంగా మారింది.

ఖాన్ తనకు పాక్ ఆర్మీ సపోర్ట్ ఉండటం వల్ల పాక్ కాశ్మీర్ లో ముష్కర మూకలు ఉన్న చోట మీటింగ్ కి వెళ్ళాడు.
“ఇది అన్యాయం మా జాతి ఎప్పుడూ అధికారం లో ఉండటం కోసం370 పెట్టారు ,ఇప్పుడు లేపెస్తే ఎలా”అన్నాడు ఒకడు.
“అసలు ఇండియా లో రియాక్షన్ ఏమిటి”అడిగాడు ఇంకోడు.
“ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు,రోజు వారి బతుకులు కష్టం గా ఉన్న ఈ రోజుల్లో 370 గురించి దాని ఫలితాలు పట్టించుకోవాల్సిన అవసరం జనానికి లేదు”చెప్పింది రుక్సన.
రుక్సన పాక్ ఇంటిలిజెన్స్ లో డైనమిక్ ఆఫీసర.
“కానీ మనం చూస్తూ కుర్చోలేము,pm అరుస్తున్నాడు”చెప్పాడు ఖాన్.
రుక్సన “అయితే ఏమి చేస్తారు”అంది.
“Reaction ఇద్దాం.”అరిచారు ముష్కరులు.
తర్వాత తీరిగ్గా కూర్చుని ప్లాన్ చేయడం మొదలు పెట్టారు.
రుక్సన అన్ని చూస్తోంది,వింటోంది.
కానీ ఆమెకి ఇది ఇష్టం లేదు.
భారత్ అంతర్గత వ్యవహారం లో ఎందుకు కల్పించుకోవాలి అని ఆమె అలోచన.
అదీకాక భారతీయులే పట్టించుకోవడం లేదు ఈ విషయాన్ని.
++++
“నిజానికి జనం రియాక్షన్ లేకపోవడం మన అదృష్టం”అంది స్మిత.
“కావచ్చు,వైశాలి ఇప్పుడు కాశ్మీర్ లో ఉంది.
పాక్ ఆర్మీ ఏదో ఒకటి చేయచు,నాకు గందరగోళం గా ఉంది.”అంది వసుంధర.
“Bill ఎప్పుడూ పాస్ అయిన ప్రోబ్లం లేదు”అంది స్మిత.
దేశం లో అన్ని జిల్లా ల రిపోర్ట్స్ చూసి చెప్పింది స్మిత.
“అంటే నెట్,ఫోన్ ,టీవీ ఆపేసిన దానికి కూడా మిగతా దేశం రియాక్టు అవ్వడం లేదా”అంది వసుంధర.
“లేదు అందరూ సిమ్లా వెళ్తున్నారు షికారుకు”అంది స్మిత

“అరే మాడం నా ఫోన్ పని చేయడం లేదు”అంది కాశ్మీర్ అమ్మాయి.
“నా ఫోన్ కూడా”అంది వైశాలి.
ఆమె రోడ్డు మీదకు వచ్చి దగ్గర్లో ఉన్న షాప్ లో సరుకులు కొంటు అక్కడే ఉన్న కొందరు జవాన్ ల నీ వాళ్ళ ఆఫీసర్స్ ను చూసింది.
కొంచెం సౌత్ వాడిలా ఉన్న వాడి వద్దకు వెళ్ళింది.
షర్ట్ మీద name badge చూసింది.
“Mr జాని”అంది.
“ఎస్”
“I am from Hyderabad.”
“ఓహ్ చెప్పండి”అన్నాడు.
“నేను విలేఖరి ను.ఫోన్ పనిచేయటం లేదు.”అంది వైశాలి.
“అద నెట్ వర్క్ ఆపేశారు”అన్నాడు జాని.
“అదేమిటి”
“370 రద్దు చేస్తున్నారు,అందుకు”
“అరె దానికి ఫోన్ ఎందుకు అపటం”అంది వైశాలి.
“తెలియదు”అన్నాడు.
“జమ్ము హై వే “అడిగింది.
“అది తెరిచే ఉంది”అన్నాడు జాని.
“అదేమిటి,ఇదేమిటి”అంది నిజంగానే అర్థం కాక.
జాని ఏమి మాట్లాడలేదు,అతనికి అర్థం కాలేదు.
“సరే పొలిటికల్ లీడర్స్”అడిగింది వైశాలి.
“హౌస్ అరెస్ట్”అన్నాడు.
“Communication ఎలా,నేను ఎవరితో అయినా మాట్లాడాలంటే”అడిగింది వైశాలి.
జాని ఏమి చెప్పలేదు.

“మీరు ఏదో ఇబ్బందిలో ఉన్నారు అనుకుంట”అంది వైశాలి.
“అబ్బే ఏమీ లేదు”
ఇద్దరు నడుస్తూ కొంతదూరం వెళ్లేసరికి పోస్ట్ బాక్స్ కనపడింది.
“పోస్ట్ ఆఫీస్ లు పని చేస్తున్నాయి”అంది.
“కరెక్ట్ ఈ ఫోన్ లు WhatsApp వచ్చాక వీటిని మర్చిపోయాను.మా వాళ్ళకి లెట్టర్స్ రాయవచ్చు “అంటూ పోస్ట్ ఆఫీస్ వైపు అడుగులు వేశాడు.
“మీరు ఇక్కడ ఏ పని మీద ఉన్నారు”అన్నాడు.వైశాలి ఏదో ఆలోచిస్తూ “ఖాన్”అంది.
“ఏమిటి”అన్నాడు పెళ్ళానికి లెట్టర్ రాస్తూ.
ఆమె మాట్లాడలేదు.
బయటకు వచ్చాక”ఎవరు ఖాన్”అడిగాడు.
ఆమె కు ఎందుకో చెప్పాలనిపించింది.
“పాక్ ఏజెంట్ చాలా వెదవ పనులు ఇంకా చెప్పాలంటే 40 మంది ప్రయాణిస్తున్న వాన్ ను పేల్చింది వాడే”అంది.
“ఓహో వీడి పేరు నేను కూడా విన్నాను,ఎలా ఉంటాడో,ఎక్కడ ఉంటాడో తెలియదు”అంటూ ఆలోచనలో పడ్డాడు.
“దొరికితే ఇంటర్వ్యూ చేస్తారా”అడిగాడు.
“చంపుతాను”చెప్పింది వైశాలి.
“నిజం చెప్పండి ఎవరు మీరు”