భ్రాంతి 646

దుర్యోధనుడి మేకప్పు పూర్తి అయిపోయి ఆయన కంగారుగా తిరుగుతుంటే కిట్టి వెళ్ళి ఆయనకు దండలు ఇచ్చి వచ్చాడు. ‘ఒరేయ్ మామా కనీసం బాబాయి పాత్ర ఒక్కటి ఐనా చూడాలిరా రేత్తిరికి’ అంటూ సంత మిగతా మొత్తం కలియదిరిగారు. సునయన షాపు దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. బల్ల, కుర్చీ, ఖాళీ షెల్ఫ్ తప్ప ఆదివరకు అక్కడ వున్న నల్లబోర్డ్ కూడా లేదు. మళ్ళీ రేపు వస్తే కనిపిస్తుందో లేదో అన్న ఆలోచనలో పడి ఒక రోబోట్ లాగా మిగతా ముగ్గురితో కలిసి వెళ్తున్నాడు కిరీటి. ఎలాగూ ఎక్కువ మాట్లాడడు కాబట్టి మిగతా ముగ్గురు కూడా కిరీటి కొంచెం తేడాగా వున్నాడు అన్న విషయాన్ని పట్టించుకోలేదు.

సంతలో దొరికే తినుబండారాలన్నీ మెక్కి భుక్తాయాసంతో స్టేజ్ దగ్గరకు చేరుకున్నారు నలుగురూ. మంచి రంజైన నాటకాలు పడ్డాయి ఈ సంవత్సరం. నైటుకి హైలైట్ మటుకు దుర్యోధన ఏకపాత్రాభినయం. అప్పటివరకూ ఏవో వూహాల్లో తిరుగాడుతున్న కిరీటి సైతం ఆ నటకుడి గొంతుకీ, స్టేజ్ presenceకి అబ్బురపడి ఈ లోకంలోకి వచ్చిపడ్డాడు. ఆ ఒక్క కార్యక్రమం పూర్తి అయ్యాక ఇంటి బాట పట్టారు నలుగురూ.

మంచంపై పడుకొని ఆ రోజు జరిగిన విషయాలన్నీ నెమరేసుకుంటున్నాడు కిరీటి. కళ్ళు మూసుకుంటే సునయన కళ్ళముందు కనిపిస్తోంది. ఇంతలోనే నిక్కీ ఆలోచనల్లో చొరబడుతోంది. సునయన ముఖం, నిక్కీ ఒళ్ళు కలగలిసిపోయి చిత్ర విచిత్రమైన కలలన్నీ వచ్చి అది ఇది అని చెప్పలేని ఒక బాధ మనసును మాయ చేస్తోంది. ముందే చెప్పుకున్నాంగా, ఈ కథ అనుకోకుండా ఈ కుర్రాళ్ళ జీవితంలో ప్రవేశించిన వారి వల్ల జరిగిన మార్పుల గురించి అని… ఈ రోజు కిట్టి, కిరీటి జీవితాల్లో చెరగని ముద్ర వేసింది.

మర్నాడు, ఆ తరువాతి రోజు కలిసి సంతకి పోవటం కుదర్లేదు స్నేహితులకి. కిట్టి మాత్రం ప్రతిరోజూ వెళ్ళి తన ఫేవరెట్ నటుడి ఏకపాత్రాభినయం చూసి వస్తున్నాడు. ఇంకా సంత ఒక్క రోజే వుంది. ఆ రోజు రాత్రికి ఎలాగైనా వెళ్ళి తీరాలని అనుకున్నారు నలుగురూ. చివరకు జరిగింది వేరు.

సంతకి పోవడానికి అందరూ ఒక చోట చేరాక ‘రే మామా, సచ్చిందిరా గొర్రె. Chemistry records ఇస్తానికి రేపేరా ఆకరి రోజు’ అంటూ గోరు గుర్తుచేశాడు. ‘మీరింకా రాయలేదారా?’ అన్న కిరీటిని తినేసాలా చూశారు ముగ్గురూ. ‘రాసేవోడివి ఓ మాట సెప్పాల గందా’ అంటూ ఫైర్ అయ్యాడు గోరు. చిన్నగా నవ్వి ‘నా రికార్డ్ ఇస్తానురా. చూసి జాగ్రత్తగా రాయండి. వున్నది వున్నట్టు దించేశారో ఒక్కొక్కడిని మక్కెలిరగ్గొడతా. కాపీ కొట్టామని అందర్నీ fail చేస్తారు.’ అని వార్నింగ్ ఇచ్చాడు.

‘నువ్వు దేవుడు సామీ’ అంటూ రంగా, గోరు కిరీటిని వాటేసుకున్నారు. కిట్టి మటుకు కొంచెం unhappyగా వున్నాడు. ‘నీకేటైనాదిరా, రికార్డ్ రాయాలని మాకూ లేదు. టైమ్ కి ఇయ్యకపోతే సాయిబు (chemistry లెక్చరర్) fail చేస్తాడని చెప్పినారు గంద సీనియర్లు’ అన్న గోరుతో ‘ఔ … నాకూ గుర్తుందిరా. నైటుకి రాములు బాబాయి, అదే, దుర్యోధన పాత్ర ఆయన ఒకసారి కల్వమని చెప్పుండే. రేపుట్నుంచి మళ్ళా కనబడ్డు గందా’ అన్న కిట్టిని ఒక ఊపు ఊపి ‘ఒరేయ్, ముందు దీని సంగతి సూడ్రా సామీ. సంకురేత్తిరికి మళ్ళా సంతెడతారు. రాములు కాదు ఈ సారి ఆయబ్బ అమ్మ మొగుడొస్తాడు’ అని గోరు అందర్నీ కిరీటి ఇంటి వైపు బయల్దేరదీశాడు.

రికార్డ్ మిత్రుల చేతిలో పెట్టి కిరీటి ఒక్కడే ఖాళీగా మిగిలాడు. కొంతసేపు ఊగిసలాడాడు కానీ చివరకు తన సైకిలుపై ఒక్కడే వెళ్ళాడు సంతకి. సంత మొత్తం తిరిగాడు కానీ ఎక్కడా సునయన కానీ ఆమె షాపుకానీ కనిపించలేదు. ఉసూరని ఇంక ఇంటికి పోదామని సైకిల్ స్టాండు వైపుకి బయల్దేరాడు.

‘ఏం హీరో, మమ్మల్ని చూడ్డానికి మళ్ళీ టైమ్ కుదర్లేదా అబ్బాయిగారికి’ అంటూ ఎవరో భుజంపై చెయ్యి వేశారు. వెనక్కు తిరగకముందే కిరీటి మైండ్ లో ఒక రకమైన విస్ఫోటనం సంభవించింది. ఆ గొంతు ఒకేఒక్కసారి విన్నాడు కానీ ఇక జీవితంలో మర్చిపోలేడు. వెనక్కు తిరిగి చూస్తే సునయన, ఆమెతోపాటు ఆజానుబాహుడైన ఒక వ్యక్తి వున్నారు.

‘hi సునయన గారూ, అదేం లేదండీ. ఏదో కాలేజీ క్లాసుల్లో కొంచెం బిజీ. ఇవ్వాళ మిమ్మల్ని… అదే మీ షాపు చూద్దామని వచ్చాను. కానీ మీరెక్కడా కనబడలేదు’ అంటూ తడబడుతూ చెప్పాడు. బుగ్గ సొట్ట పడేలా నవ్వి తన పక్కనున్న వ్యక్తి చేతిలోని పెద్ద పెట్టెని చూపించి ‘మేము అందరికంటే ముందే దుకాణం సర్దేశాము. ఇకనో ఇంకాసేపట్లోనో బస్సు వస్తే వెళ్లిపోతాము’ అని చెప్పింది.

చేతికున్న వాచ్ చూసి కిరీటి ‘సాయంత్రం బస్సు వెళ్లిపోయిందండి. మళ్ళీ పట్నం వెళ్ళే బస్సు పదిగంటలకే’ అని చెప్పాడు. సునయన తన పక్కనున్న వ్యక్తి వైపుకి తిరిగి ‘అబ్బా, ఇంకా రెండు గంటలు wait చెయ్యాలా. నాకు ఆల్రెడీ మెంటల్ ఎక్కుతోంది’ అని ‘by the way, ఈయన పేరు ధనుంజయ్, ఇతని పేరు కిరీటి’ అంటూ ఒకరికి ఒకరిని పరిచయం చేసింది.
ధనుంజయ్ కిరీటికి షేక్ హ్యాండ్ ఇచ్చి ‘నువ్వు కొంచెం మా సునయనకి కంపెనీ ఇవ్వగలవా కిరీటీ, నేను నైటు పట్నం చేరేదాకా ఆకలికి ఆగలేను. అలా వెళ్ళి ఏమన్నా తినేసి వస్తాను’ అని అడిగాడు. కిరీటికి కూడా సునయనతో ఒంటరిగా వుండాలి అని వుంది కానీ బయటపడలేక పోతున్నాడు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని question చేసే పరిస్థితిలో లేడు. ‘సరేనండి. మేము అలా బ్రిడ్జి పక్కన కాల్వ గట్టున వుంటాము. పెట్టె మా దగ్గర పెట్టి వెళ్తారా’ అని అడిగాడు.

పెట్టె చేతికి అందించబోతుంటే సునయన ఆపి ‘ఓయ్, ఒకసారి పక్కకి తిరిగితేనే card తీసుకొని వెళ్లిపోయాడు. ఇప్పుడు పెట్టె మొత్తం అయ్యగారి చేతిలో పెడతావా? నో, నువ్వే తీసుకెళ్లు’ అన్నది. తనకదేమీ పెద్ద భారం కాదన్నట్టు ధనుంజయ్ అవలీలగా పెట్టె మోసుకొని ఫుడ్ వెతుక్కుంటూ వెళ్ళాడు.

1 Comment

  1. The site itself is related sex stories when sex content is not in the stories then readers will not show much interest. Pl post sex related stories.

Comments are closed.