ఊహిం 727

కానీ.పార్టీ ఎమ్మెల్యేలో మెజారిటీ వర్గం ఉప ముఖ్యమంత్రి… హోమ్ మంత్రి ఇలా .. ఒక్కొక్కరిగా లేచి..రాజా రామ్ వర్మకి మద్దతు తెలుపుతున్నారు..
ఆలా మద్దతు తెలపడానికి కారణం రాజా రామ్ వర్మ అంతకు ముందే తన కున్న నెట్ వర్క్ ద్వారా..
తనకున్న తెలివి తేటల ద్వారా ఏ మీడియా కంట పడకుండా అధికార పార్టీ లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ని ఆ ఎమ్మెల్యే అనుచర వర్గాన్ని కలిసి..వాళ్లలో తన తండ్రి సెంటిమెంట్ రాజేసి..ఒక్కొక్కడికి ఏమేమి కావాలో కనుక్కుని మొత్తం ఏర్పాట్లు చేసి కాబోయే ముఖ్యమంత్రిగా తనకి మద్దతు తెలిపేలా .వాతావరణం కలిపించుకున్నాడు..

కానీ..సమావేశం లో ఒక పక్క కూర్చున్న అనసూయ వర్గం ఆమెతో పాటు 25 మంది ఎమ్మెల్యేలు మాత్రం మద్దతు తెలపకుండా…
తీవ్రం గా వ్యతిరేకించారు..అక్కడ కుర్చీలుఅన్ని విరగొట్టి నానా రభస చేసారు..
అనసూయ కోపంగా కుర్చీన్న కుర్చీలో నుండి లేచి ..”ఇన్నాళ్లు పార్టీ కోసం పని చేస్తే మీరు వారసత్వానికి విలువ ఇస్తారా..నేను నా తరుపు ఎమ్మెల్యేలు..రాజా రామ్ ఏ మాత్రం సపోర్ట్ ఇవ్వము రాజీనామా కి అయిన సిద్ధమే” అని. వెళ్ళిపోయింది. .
ఆమె వెనకే 20 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్లిపోయారు ఒక 5 గురు మాత్రం వెళ్లకుండా గమ్మున వున్నారు..

రఘునాథయ్య ఈ పరిణామాన్ని ఊహించలేదు.
ఒకవేళ..ఆ 20 మంది ఎమ్మెల్యే లని పార్టీ నుండి బహిష్కరిద్దాం అంటే ఇన్నాళ్లు కాపాడుకుంటున్న పార్టీ..అతలాకుతలం అయిపోతుంది..అన్న భయం తో ఆలోచిస్తున్నాడు

ఇలా మీటింగ్ జరుగుతుండగానే ఇంకో పక్క అన్ని మీడియా ఛానల్స్ లో రాష్ట్ర రాజకీయాలలో కొత్త పేరు..కాబోయే ముఖ్యమంత్రి గా రాజా రామ్ వర్మ ..
అసలు ఎవరు ఈ రాజా రామ్ వర్మ ఆస్ట్రేలియా ఏం చేసే వాడు . అసలు ముఖ్యమంత్రి పదవికి అర్హుడేనా …

అసలు పార్టీ లో అందరూ అతన్ని సపోర్ట్ చేస్తున్నారా..కొన్ని వర్గాలు తీవ్రం గ వ్యతిరేకిస్తిన్నాయి అంటూ రక రకాల కథనాలతో హోరెత్తించాయి…
తదుపరి ముఖ్యమంత్రి అవుతాడా అవ్వడం అన్న చర్చ జోరుగా నడుస్తుంది..

పార్టీ కార్యాలయం అంత గందర గోళం గా వుంది.

అనసూయ వర్గం ఎమ్మెల్యేలు అందరూ సిటీ చివరన ఉన్న అనసూయ గెస్ట్ హౌస్ లో సమావేశ మయ్యారు…తరువాత తీసుకోబోయే నిర్ణయాల గురించి చర్చిస్తున్నారు..

“కొత్త ముఖ్యమంత్రిగా రాజా రామ్ వర్మ అవ్వడానికి వీలు లేదు . అనసూయ ని ముఖ్యమంత్రిగా ఉండాలి” అని తీర్మానించారు..

ప్రతి పక్ష నేత వీరేంద్ర అనసూయ వర్గం ఎమ్మెల్యేలకు గాలం వెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు.

అనసూయ వర్గం వాళ్ళు ప్రతిపక్షం నేత వీరేంద్ర కలిసి..గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు అన్న ప్రచారం జోరుగా సాగుతుంది..

సాయంత్రం అయ్యింది..కాలానికి తగ్గట్లు జోరుగా వర్షం పడుతుంది..

అనసూయ గెస్ట్ హౌస్ లో తన వర్గ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యింది.
తరువాత రోజు నుండి ఎలా నడుచుకోవాలో..చెపుతూ ..”అందివచ్చిన అవకాశం వదులుకోకూడదు మనకి..ప్రతిపక్ష నాయకుడు..వీరేంద్ర కూడా సపోర్ట్ ఇస్తా అంటున్నాడు.. ఎవరూ ఏ వత్తిళ్ళకి తలొగ్గొద్దు” అని..హితబోధ చేస్తుంది..

ఇంతలో అనసూయ పీఏ వచ్చి..”మాడం మిమ్మల్ని కలవడానికి రాజా రామ్ వర్మ వచ్చారు..మీతో ఏదో మాట్లాడాలి అంట” అన్నాడు

“పీఏ వంక కోపం గా చూసి ఈ టైం లో నేను లేను అని చెప్పాలి కదా” అని కటువుగా చెప్పి..”లోపలకి రమ్మను” అంది..

రాజా తెల్లని ఖద్దరు చొక్కా..తెల్లని ఖద్దరు పంచె మీద అంతటి జోరు వర్షం లో అనసూయ గెస్ట్ హౌస్ లోకి వచ్చి..
కుర్చీల్లో కూర్చున్న ఎమ్మెల్యేలకు నమస్కారం పెట్టి..అనసూయ ముందు చేతులు కట్టుకుని “మీతో మాట్లాడాలి” అన్నాడు..

ఇంత వర్షం లో కూడా ఇక్కడికి వచ్చాడు అంటే వీడిలో ముఖ్యమంత్రి కావాలని కుతూహలం బలం గా వుంది అనుకుని..
“హ మాట్లాడు..ఏం చెపుతావ్ ఆ” అంది గర్వం గ కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని.

రాజా వినయం గా చూస్తూ.చాల పద్దతిగా అనసూయ కి నమస్కారం పెట్టి…

“అనసూయ గారు మీతో ఒక విషయం మాట్లాడాలి..అది మన పార్టీ దాని భవిష్యత్తు గురించి. ఇక్కడ ఉన్న పెద్దలు అందరి రాజకీయ జీవితం ఈ పార్టీ లోనే మొదలయ్యింది..ఇప్పుడు అందరూ వేరే పార్టీ తో..కలిస్తే.. ఇక్కడ రాజు లాగా బ్రతికినోళ్లే ఒకడి చెప్పు చేతల్లో బ్రతకాల్సి ఉంటుంది..ఆలోచించుకోండి “.అన్నాడు.

అనసూయ ముక్కు నులుముకుని..”చూడు బాబు పార్టీ భవిష్యత్తుకేమి బాధ లేదు..నువ్వు ఎంటర్ అయ్యాకే ఈ రొచ్చు మొదలయ్యింది..నిన్న మొన్నటి వరకు బాగానే వుంది..నువ్వు పార్టీ భవిష్యత్తు ఆలోచించడం మాని నీ భవిష్యత్తు సంగతి చూసుకుని ఇంతకు ముందు లా ఆస్ట్రేలియా వెళ్లి పోతే మంచిది..నేను కానీ ఉపముఖ్యమంత్రి కానీ..తదుపరి నాయకత్వం తీసుకుని..మీ పార్టీ లోనే కొనసాగుతాం” అంది..