మాలతి 702

నేను : ఓకే
తనను నిన్న దూరంనుండి కంటే ఇప్పుడు దగ్గరగా చూస్తే ఇంకా బాగునాడు అని మనసులో అనుకున్నాను చాలా నీట్ గా రెడి అయ్యాడు నాకు తెలియకుండానే అతని మీద ఇష్టం, ప్రేమ పెరుగుతుంది మరీ! ఇది వ్యామోహమో మరీ నిజమైన ప్రేమనో తెలియదు, చాలామంది మగవారు అమ్మాయిలను చూడగానే తినేసాల చూస్తారు కానీ! అతను నన్ను చూడకుండానే అటు ఇటు చూస్తు నాతో మాట్లాడుతున్నాడు చాలా పద్దతి గలవాడు అనుకున్నాను దానితో అతనంటే నాకు ఇంకా ఇంప్రెస్ పెరిగింది కానీ! అతనంటే ఇష్టం అని అంత తోందరగా బయటపడకూడదు చాలా చులకన అవుతాను,నా గురించి తప్పుగా కూడ అనుకుంటాడు కొంచెము బెట్టు చేయాలి అని మనసులో అనుకున్నాను ఇంతలో అతను సరే నేను మళ్లీ వస్తాను
నేను : ఓకే ..(ఇంకా ఎదైన మాట్లాడురా బాబు అని మనసులో)
అతను : వెల్తు వెల్తు ఎదో మరిచిపోయినట్టు సడన్ గా వెనక్కి తిరిగి నన్ను పరీశీలనగా చూసి ఆ… మీ పేరు అని అడిగాడు
నేను : నా పేరుతో నీకేం పని ( చీ..ఎమిటి అలా అనెసాను అని మనసులో తనను తాను తిట్టుకుంది)

అతను : స్వారీ ఊరికే క్యాజువల్ గా తెలుసుకుందామని
తిరిగి వెళ్ళబోతుంటే
నేను : మీ పేరు అని అడిగాను
అతను : నీ పేరుతో నాకు అవసరం లేదు అనుకుంటే నా పేరుతో కూడ నీకు అవసరం లేదు అనుకుంటా అని తెలివిగా సమాదానం చెప్పాడు
నేను : మా పిన్ని వస్తే చెపుదామని
అతను : పక్కింటి అతను వచ్చాడని చెప్పు అని వెల్లిపోయాడు
నేను చీ… అని మనసులో నన్ను నేను తిట్టుకోని డోర్ లాక్ చెసుకొని TV చూస్తూ చా..ఎందుకు అలా ప్రవర్తించాను అయినా ఆ మాత్రం బెట్ చెయాలిలే లేకపోతే తన దృష్టిలో లోకువ అవుతాను అని తనను తను సమర్దించుకొని TV చూస్తుంది
మరో వైపు అతను వెల్తు వెల్తు తనని పరిశీలనగ చూసి వచ్చినప్పటి నుండి మనసు మనసులో లేదు అబ్బా ఎముందిరా! ఫిగర్ అప్సరసలా ఉంది కానీ కాస్త పొగరుంది అయిన అంత అందంగా ఉన్నాక ఆ మాత్రం పొగరుండాలి అని తనకు కూడ ఆమే మీద ఇష్టం ఎర్పడింది అలా రోజు ఒకరిని ఒకరు చూసుకునే వారు కాని ఎప్పుడు మాట్లాడుకోలేదు ఒకరంటే ఒకరికి ఇష్టం ఎర్పడింది కాని చెప్పుకోలేదు ఆ రోజు అతను మా పిన్ని ఇంటినుండి వెల్లినప్పటి నుండి మళ్ళీ మా పిన్ని ఇంటికి రాలేదు మా పిన్నినే వాల్ల ఇంటికి వెల్లి వచ్చెది నేను ఎప్పుడు తన గురించి అడగలేదు మా పిన్ని కూడ తన గురించి నాతో ఎమి మాట్లాడలేదు రోజు నేను టెర్రస్ పైన అతను తన ఇంటిముందు పెరట్లో కూర్చొని కళ్ళతోనే మాటలు కళ్శ తోనే పలకరింపులు జరిగేవి అలా! వారు ఇద్దరు ఒకరికి ఒకరు ప్రేమలో పడ్డారు కానీ చెప్పుకోలేదు కొన్ని రోజులకి మా పిన్ని ఆరోగ్యం బాగయింది మా అమ్మ కూడ పోన్ చేసి లలితని పంపించు తనకి ఒక సంబందం వచ్చింది రేపు వారంలో చూసుకోడానికి వస్తామన్నారు అని పోన్ చేసి మా పిన్నికి చెప్పింది మా పిన్ని సరే పంపిస్తాను అనింది నాకు మాత్రం చాలా బాదగ ఉంది ఆ రోజు నైట్ చాలా ఎడ్చాను ఉదయం మా పిన్ని లేపి రెడి అవమని చెప్పి వెల్లింది నేను లేసి రెడి అయి బయటికి వచ్చాను మా పిన్ని లలిత జాగ్రత్తగా వెళ్ళు అలాగే మీ బాబాయ్ పని మీద బయటికి వెల్లాడు నిన్ను బస్టాండ్ వరకు పక్కింటి అబ్బాయి డ్రాప్ చెస్తాడు అని చెప్పింది నేను మనసులో సంతోషంగా పీల్ అయ్యాను కానీ బయటీక మాత్రం పర్వాలేదు పిన్ని నేను ఆటోలో వెల్తాను అన్నాను అప్పుడు. మా పిన్ని ఎమీ అవసరం లేదులే ఆ అబ్బాయి చాలా మంచివాడు అడిగో మాట్టలోనే వస్తునాడు అనింది అతను బైకు తీసుకొని వచ్చాడు నేను మనసులో మా పిన్నికి థాంక్స్ చెప్పుకొని అతని బైక్ ఎక్కాను మా పిన్ని జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పింది

అతను బైక్ కదిలించాడు దొంగ సచ్చినోడ ఒక్క మాటైన మాట్లాడురా అని మనసులో అతనిని తిట్టుకునాను ఇంతలో అతను : ఎమిటి ఇంత సడన్ గా వెల్తునావు
నేను : మా ఇంట్లో సంబందం చూసారు రేపు వారంలో చూసుకోడానికి వస్తున్నారు ఆ విషయం చెప్పగానే అతను చాలా బాదపడ్డాడు తను వెనక ఉండటం వలన అతని బాద ఆమెకు కనపడలేదు ఒకరికి తెలియకుండా ఒకరు బాదపడ్డారుఇంతలో బస్టాండ్ వచ్చింది ఎంక్వైరీ కౌంటర్ లో కనుకుంటే అర్దగంటలో బస్ వస్తుంది అని చెప్పారు ఈ అర్దగంటలో ఎవరితో ఎవరు మాట్లాడుకోలేదు ఎవరికి వారు మనసులో బాదపడుతున్నారు ఇంతలో బస్ వచ్చింది
లలిత : వెళ్ళోస్తాను
తను : ఒకే జాగ్రత్త
నాకు ఎడుపు వస్తుంది అలాగే దిగమింగుకున్నాను
తనకు అలాగే ఉంది
లలిత : స్వారీ
తను ‘: ఎందుకు స్వారీ
లలిత : ఆ రోజు నువ్వు పేరు అడిగితే చెప్పనందుకు
తను : పర్వాలేదులే
లలిత : నా పేరు లలిత