మెమోరీస్ 9 200

ఏప్రిల్ నెల మొదటి వారాలు. చానా వరకు చెట్లు మీద పూత కాస్త పిందులుగా మారుతొంది. వాడిన పూత చెట్ల మీద నుండి వీచే గాలికి రాలి కిందపడుతొంది. ఆ రోడ్లను వూడ్చే వాళ్లు పొద్దున్నే ఎవరూ నిద్రలేవకనే రాలిన పూతను శుభ్రంగా వూడ్చేసినా మళ్లీ రాలింది. ఆ వాడిపోయి రాలిన పూతమీద నడుచుకుంటూ వెళ్తున్నారు టీనా, సూరీలు. ఆమె తలుచుకుంటే కారులో వెళ్లుండేది. కానీ ఎందుకో నడవాలనిపించింది. హేమంత్ వారి వెనక రాబోతే వారించింది.
“సో నేను మీ గురించి విన్నదంతా చెత్తేనా” అన్నాడు.
“ఏమ్ విన్నావ్”
“అదే మీరు మీ కాడికి ఎవరొచ్చినా కాదనరని. . . ”
“ఎందుకు కాదనను కాదంటాను. . . మనం చేసే ప్రతి పనికి చాయిస్ వుంటుంది. తప్పా? ఒప్పా? చెయ్యాలా? వద్దా?. నేను చేసే పనికి తప్పొప్పులతో పని లేదు కాబట్టి చెయ్యాలా? వద్దా? అనే చాయిస్ లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. ఇష్టమైతే చేస్తాను లేకపోతే లేదు.”
“ఎవరైనా బలవంత పెడితే”
“చెప్పానుకదా అది నా చాయిస్ అని ఈ కంపెనీలో చేరిన తరవాత నేను చెయ్యను అన్న పనిని చెయ్యి అని ఎవరూ బలవంత పెట్టలేదు”
“ఒక వేళ పెడితే”
“నేను ఈ పనైనా మానేస్తాను కానీ ఒకరి బలవంతం మీద మాత్రం పని చేయను”
“అదంత సులువా”
“అవును . . ఎందుకంటే అది కూడా నా చాయిసే. . నాకిష్టం వచ్చినప్పుడు ఈ పని మానేసి వెళ్లిపోవచ్చు. నేను జాయిన్ అయినప్పుడు రాసిన అగ్రిమెంట్ ఇది”అనింది.
“సో ఒక డబ్బున్న ముసలాడు . . . ఒక వయసులో వున్న కుర్రాడు ఎదురైతే ఎవరిని ఎంచుకుంటావు”
“ముసలాడైలా దృడంగా వుంటే డబ్బున్న వాన్నే ఎంచుకుంటాను. ఎందుకంటే మాలాంటి వారికి సుఖం కంటే డబ్బే ముఖ్యం. ఎందుకంటే ఎక్కువ మంది ఈ వృత్తికి ధనం కోసమే వస్తారు. అలాంటి వారు మనిషి ఎవరైనా డబ్బునే చూస్తారు. ప్రస్తుతం నా పొజిషన్ వేరు నేను కుర్రాడినే ఎంచుకుంటాను” అని సూరిగాడి పిర్రల మీద చేతులు వేసింది. పదహారేళ్ల పడుచువాడు. పైగా పల్లెటూరి మొరటోడు. కనీసం వారంలో ఒకసారైనా వాళ్లూరికి దగ్గరలో వుండే కోనాపురం కొండలలో ఒకదాన్ని ఎక్కి దిగుతూ వుంటాడు. అందువల్లనేమో వాడి పిక్క, పిర్రలు కండలు కొండల్లా తేలి వుంటాయి. ఆమె వాటి దృడత్వాన్ని
పరీక్షించింది. సూరి కొంచెం సిగ్గు పడ్డాడు.
“అంటే మీరు ఈ వృత్తిలోకి డబ్బు కోసమని బలవంతంగా దించబడ్డారా? ఇప్పుడు బాగా సంపాదించి నట్టున్నారు.” అడిగాడు.
“లేదు నన్నెవరూ బలవంత పెట్టలేదు నా అంతకు నేనే ఈ వృత్తిలోకి వచ్చాను.” అని తన కథ చెప్పడం ప్రారంభించింది. తను చెప్పడం ముగించే పాటికి చెరువును చేరుకున్నారు. ఆ చెరువు మరవ ఉత్తరం వైపు ప్రయానిస్తూ వుంటుంది. ఆ మరవ అడ్డంగా పెద్ద కట్ట కట్టబడి వుంది. ఆ కట్ట కింద పచ్చటి వరి మళ్లు, రాగి మళ్లు. ఆ వరిమళ్లకు దూరంగా జొన్న, సజ్జ చేనులు. ఆ చెరువు చూడటానికి చిన్న సరస్సులాగా కనిపిస్తొంది. వైశాల్యంలో బుక్కపట్టణం
చెరువంత వుంటుంది. ట్రస్టు భవన సముదాయాలకి సుమారు అర్దకిలోమీటరు దూరంలో వుంటుందా చెరువు. ఆ చెరువుకి పడమర వైపున వున్నచిన్న గుట్టమీద వుంది ఒక మారెమ్మ గుడి. చిన్న రాతి కట్టడం. అయినా పురాతనమైనది. ఒక గర్బగుడి మాత్రమే వున్నది. ముందర కానగాకుల పందిరి వేసి వున్నది. ఆ పందికి కింద ఒక త్రిశూలం. దానికి కొంచెం దూరంలో ఒక పంగల గుంజ పాతబడి వుంది. అది బలి పీఠం. ముందు రోజే ఎదో యేటని నరికి నట్టున్నారు. ఆ యాట రక్తం ఇంకా పచ్చబడలేదు. ఆ గుడికి ఎటువంటి రక్షణా లేదు. ఎక్కడ చూసినా రాతి గుట్టలు. దాని బాగోగులు చూడటానికి
మాత్రం ఒక పూజారి వున్నాడు.
సూరి ఆ గుడిని నలువైపులా తిరిగి జాగ్రత్తగా పరిశీలించాడు. అది దృడమైన రాతి కట్టడం. ఒక ఎత్తైన రాతి పీఠం మిద నిర్మించబడిన కట్టడం. గర్బగుడికి పైన ఒక గోపురం వుంది. దాని మీద అనేకమైన అందమైన శిల్పాలు చెక్కబడి వున్నాయి. మామూలుగా మారెమ్మ గుడికి ఎటువంటి శిల్పాలు వుండవు. వుంటే గింటే శివపార్వతుల శిల్పాలకు వివిధ రకాలైన పేర్లు పెట్టి వుంటారు. ఇంక పాత అమ్మవారి గుడులకైతే దగ్గరలో ఎక్కడో ఒక చోట వీరభద్రుని గుడి వుండే తీరాలి. చుట్టూ చూశాడు. ఎక్కడా కనబడలేదు గానీ దూరంగా చెరువు మద్యలో చిన్న మట్టి గుట్టలాంటిది కనపడింది.
పూజారిని ఆ మట్టి గుట్ట గురించి అడిగాడు. ఆయన “ఆడ కూడ ఒగప్పుడు గుడే వుండేది నాయనా. . . అప్పుడు ఈ చెరువు అంత పెద్దగా వుండేది కాదు. రామలింగా రెడ్డిగారు ఈ స్థలాన్ని కొన్నాక చెరువుని పెద్దగా తవ్వించాడు. ఆ గుడి మునిగిపోతుందని కాస్త మట్టిని వేయించి ఎత్తు చేశాడు. కానీ నీళ్లలో వుండిపోయింది కదా ఎవరూ పట్టించుకోక అలా పాడుబడిపోయింది.” అన్నాడాయన.
“ఇది అమ్మవారి గుడేనా తాత”
“అవును నాయనా”
“మరి పైన విష్ణుమూర్తి శిల్పాలు వున్నాయి”
“ఆయప్ప చెల్లేలే కదా యీయమ్మ”
“మల్ల ఈ గుట్ట మిందున్న రాళ్ల కుప్పల్లో చానా వరకు రాళ్లు ఎవరో మలిచినట్టున్నారు. ఎక్కడ చూసినా బొమ్మలు చెక్కబడి వున్నాయి.. . .” అని ఎదో అడగబోతుంటే పూజారి అతని మద్యలోనే ఆపి “చూడు బాబు యీడకు వచ్చిన వాళ్లు అమ్మవారికి మొక్కొని వెళ్లిపోతారు నీ మాదిరి ప్రశ్నలు వేయరు. నువ్వు కూడా మొక్కొని యెళ్లిపో” అన్నాడు.
అంతవరకు దూరంగా వున్న టీనా అక్కడకి వచ్చింది.
“రా చెరువులోనికి పోవడానికి బోటింగ్ వుంది పోదాం” అని లాక్కుని పోయింది.
సూరిగానికి కూడా చానా ఆత్రంగా వుంది. ఆ మట్టి గుట్టమీదికి పోవడానికి. హేమంతు గాడి మారెమ్మ గుళ్లో ఆడపిల్లలని దాచారన్నాడు. ఇక్కడ దాయడానికి ఎటువంటి అవకాశమూ లేదు. మరి వాళ్లని ఎక్కడ దాచి వుంచినట్టు. చెరువు మద్యలో నున్న ఆ ద్వీపం లాంటి గుట్టలో ఏమైనా దాచారా?

సాయంకాలమయింది. పగలంతా చండ ప్రచండంగా నిప్పులు గక్కిన సూర్యుడు చల్లబడి పశ్చిమాన అస్తమించడానికి సిద్దపడి అరుణవర్ణంలో వెలిగి పోతున్నాడు. మేగాల నిండా ఎవరో రక్తం వెదజల్లినట్టు ఎర్రగా అగుపిస్తున్నాయి. రామలింగా రెడ్డి ట్రస్టు ప్రధాన భవనం ముందు రాత్రి డిన్నర్ కి కావలసిన ఫూడ్ ఇటెమ్స్ ని ఒక పెద్ద లారీలో నుండి అన్ లోడ్ చేస్తున్నారు. ఒక సెక్యూరిటి గార్డు ఆ ప్రాసెస్ ని సూపర్ వైజ్ చేస్తున్నాడు. అతని కదలికలను మరో ఇద్దరు వ్యక్తులు దూరం నుండి గమనిస్తున్నారు.
“అతని గురించి ఇంకేమి తెలుసు” సూరి అడిగాడు.

1 Comment

  1. Next story post chey

Comments are closed.