రతీ 1 1148

అది చెక్ రిపబ్లిక్ దేశం లోని ప్రాగ్ నగరం.ఒక రద్దీ ప్రాంతపు వీధి లో 20 అంతస్థుల ఎత్తైన భవనం ముందు నల్లటి కారు ఆగింది.ఆ కారు నుండి ఒక మధ్య వయసులో వున్న ఆడమే దిగింది ఆమెతోపాటు ఇద్దరు నల్లటి సెక్యూరిటీ గార్డులు మరియు ఒక మధ్య వయసులో వున్న అతను వున్నారు ఆమె నేరుగా భవనం లోనికి వెళ్లి లిఫ్ట్ తీసుకొని ఆ నలుగురు లిఫ్ట్ లో వుండగా సెక్యూరిటీ లో ఒకతను మాడం ఏ ఫ్లోర్ కు వెళ్ళాలి అని అడిగాడు దానికి ఆమె 20 అని సమాధానం చెప్పి చేతికి వున్న వాచ్ ని చూసింది.లిఫ్ట్ లో జరిగినది జరుగుతున్నది అంతా ఒక కెమెరా లో నుంచి 20వ ఫ్లోర్ లో వున్న ఒకతను టీవీ లో చూస్తున్నాడు,అతను వెళ్లి ఆ ఫ్లోర్ లో వున్న ఒక పెద్దాయన(ఫ్లోర్ మెనేజేర్) తో చెప్పాడు.ఆ పెద్దాయన కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ ఫ్లోర్ లో వున్న ఒక హల్ లాంటి గది లో వున్న జనానికి ఆమె వస్తున్న సంగతి చెప్పాడు ఇంతకి అక్కడ ఒక 25 మంది గుమిగూడి వున్నారు.

ఇక్కడ ఆమె అంటే నేను

నేను లిఫ్ట్ లో నుంచి బయటకు రాగానే నాకు ఒకామె అక్కడ నాకోసం వెయిట్ చేస్తూ కనిపించింది తను ఆ ఫ్లోర్ కి రిసెప్షనిస్ట్ నాకు ఎదురు వచ్చి హై మడం అని నన్ను తీసుకొని ఒక గది లోకి తీసుకు వెళ్లి కూర్చోమని చెప్పి వెళ్ళిపోయింది ఆ గది అంతా నిశబ్దంతో నిండిపోయివుంది.

నాతోపాటు వచ్చిన అతను సెక్యూరిటీ ని తీసుకొని ఆ 25 మంది వున్నహాల్లోకి వెళ్లి వాళ్ళ డిటైల్స్ తీసుకుంటున్నాడు. ఇంకొకపక్క నేను వున్న గది లోకి ఒకామె వచ్చింది ఆమె,మేడం మీరు రెడీగా వున్నారా అని అడిగింది సమాధానంగా కూర్చున్న నేను హ అని చెప్పాను.గదిలోకి వచ్చిన ఆమెను నీపేరు ఎంటి అని అడిగింది నా పేరు సార అని చెప్పింది ఆమె బదులుగా మీ పేరు ఎంటి మేడం అని అడిగింది ఆ ప్రశ్నకి నా మనసు ఆలోచనలో పడింది అద్దంలో చూస్కుంటూ.

గతంలో జరిగిన సంఘటనలు.

అలా ఆలోచిస్తూ గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకొస్తున్నాయి ఒక్కసారిగా నాయనమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి . అది భారతదేశం లో వున్న మారుమూల గ్రామం ఆ గ్రామం లో ఒక పెద్ద కుటుంబం వుంది.ఇంటి పెద్ద అయిన జయేంద్ర కంగారుగా అటు ఇటు తన ఇంటి గుమ్మం ముందు తిరుగుతున్నాడు.ఇంట్లో అంతా హడావిడిగా ఉంది ఆ ఇంటికి ఒకవైపు నుంచి ఆడ అరుపులు వినిపిస్తున్నాయి ఆ అరుపుల విన్న ప్రతిసారి జయేంద్ర కి కంగారు ఇంకా పెరుగుతుంది.ఒక్కసారిగా పెద్ద అరుపు వచ్చి ఇంకా అరుపులు ఆగిపోయాయి జయేంద్ర అలాగే నిల్చుని ఇంటిలోకి చూస్తున్నాడు. ఒక్కసారిగా సన్నటి నులుపైన గొంతులో ఒక ఏడుపు వినిపించింది జయేంద్ర మొకంలో సంతోషపు చిరునవ్వు వచ్చింది.ఇంతలో ఇంటి లోపలి నుంచి ఒకామె వచ్చి తమ్ముడు అని జయేంద్రని తీసుకొని లోపలికి వెళ్ళింది.లోపల జయేంద్ర భార్య సరిత ఆనందంగా జయేంద్రని చూసి చిన్నగా నవ్వింది ఆమె పక్కన వున్న చిన్న పాపని చూసి జయేంద్ర ఒక్కసారిగా సరిత దగ్గరికి వెళ్లి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి పాపకి నీపోలికే వచ్చింది మహాలక్ష్మి లా వుంది అన్నాడు.జయేంద్ర సరితలకు పెళ్లి జరిగి 10 యేళ్లు అయింది ఇప్పటివరకు వారికి సంతానం లేదు వాళ్ళు తిరగని గుడి లేదు చెయ్యని నోము లేదు ఇంకా ఆశ కోల్పోతున్న సమయంలో సరిత గర్భవతి అయింది.ఇంకా జయేంద్ర చాలా జాగ్రత్తగా సరిత పక్కనే వుండి చూసుకునేవాడు.జయేంద్ర తను పడ్డ బాధ అంతా తీరిపోయి సంతోషంతో తన మనసు నుండి పోయింది,ఊరందరికీ ఈ విషయం తెలిసేలా ఘనంగా సంబరాలు చేసుకున్నాడు. పాపకి మనోరతి అని పేరు పెట్టారు చిన్నప్పటి నుంచి మనోరతిని చాలా గారాబంగా పెంచాడు జయేంద్ర ఆమె పుట్టటం ఒక వరంగా భావించేవాడు. ఆమెపై వున్న ప్రేమ ఎంత అంటే తను ఎదిగిన తర్వాత బడికి పంపించటం అంటే కూడా జయేంద్ర కి ఇష్టం వుండేది కాదు.ఇలా వుంటే మనోరతికి విద్య అవసరం అని సరిత భావించి జయేంద్ర తోచెప్పి ఒక టీచరు ని ప్రైవేట్ గా తన ఇంటికి వచ్చి పాఠాలు చెప్పే విధంగా నియమించింది సరిత కానీ జయేంద్ర కు రతి తన ముందు వుండటం కావాలి అనే వాడు. అలా ఇంట్లో నేవుండటం వలన పాఠాలు నేర్పించటం టీచర్ కి సులువు అయ్యింది రతి కూడా చాలా చురుకుగా చలాకీ తనంతో వుండేది టీచర్ (చంచల) నేర్పే ఏ పాఠం అయన త్వరగా నేర్చుకునేది దానితో రతి తన 12వ యేటనే 10వ తరగతి పాఠాలు నేర్చుకోవటం మొదలు పెట్టింది. రతి చదువులోనే కాదు ఆట పాటల లోను అదే చురుకుతనం చూపేది.

ప్రస్తుతం

అలా చెప్పిన నాయనమ్మ మాటలు గుర్తు చేసుకుంటూ నా కంటి నుండి రెండు కన్నీటి చుక్కలు కంటి నుంచి రాలాయి అది చూసిన సార మేడం మేడం అని తడుతుంది అప్పుడు తేరుకొని సార ని చూస్తున్న

ఇంత లో నాతో పాటు వచ్చిన అతను మేడం లోపల ఒక ప్రోబ్లం వుంది 25 మంది మనుషులలో ముగ్గురు మనం అనుకున్న రీతిలో లేరు అని అన్నాడు.ఆ మాట విన్న తర్వాత ఫ్లోర్ మెనేజెర్ ని తీసుకునిరా అని చెప్పాను మేనేజెర్ వచ్చి మేడం ఏదైనా ప్రోబ్లం వచ్చిందా అని అడిగాడు అతనితో చూడండి మనం మాట్లాడుకున్న డీల్ ప్రకారం 25 మంది మనం అనుకున్నట్టు వుండాలి అని చెప్పాను కానీ ముగ్గురు సరితూగలేదు,మీరు అందర్నీ చెక్ చేసి కరెక్ట్ గా వుంటే చెప్పండి అప్పుడు మనం అనుకున్న పని మొదలు పెడదాం అని, నేను రేపు వస్తాను అని అక్కడి నుంచి వచ్చిన దారిలోనే తెరుగు ప్రయాణం కారు లో మొదలుపెట్టాను.

అలా కారులో ప్రయాణిస్తూ అందమైన ఆ నగరాన్ని చూస్తూ కారు లోనుంచి వచ్చే చల్లటి గాలిని ఆస్వాదిస్తూ మళ్లీ ఆలోచన లో పడిపోయాను.అది నా 12వ ఏట అడుగుపెట్టిన మొదటి రోజు ఇంట్లో అంతా హడావిడిగా ఉంది కారణం నాపుట్టిన రోజు,నాన్న నన్ను తీసుకొని గుడికి అమ్మతో పాటు బయల్దేరారు. నాన్న అత్త తో మేము గుడికి వెళ్ళి వస్తాము అని చెప్పి కారు లో బయల్దేరాము కారు వేగం కూడా మాకు తెలియట్లేదు అంతలా మాలో మేము మాట్లాడుకుంటున్నాం అమ్మని అడిగాను అమ్మ మీఇద్దరికి నేను పెద్దయ్యాక ఎమవ్వాలి అనుకుంటున్నారు అని అడిగాను.దానికి అమ్మ నువ్వు చేసేపని నీచుట్టూ ఉన్నవాళ్ళకి సంతోషాన్ని ఇస్తే అదే నాకు నచ్చిన పని చేసినదానివి అవ్తావు అని చెప్పింది.ఆ మాట నా గుండెల్లో నాటుకుంది నేను తిరిగి సమాధానం చెప్పేలోపు నాన్న అదిగడుమరి నన్ను అడగవా అని అడిగాడు దానికి అడుగు నాన్న నీకంటే నాకు అమ్మ కూడా ఎక్కువ కాదు నాకు అని అన్నాను దానికి నాన్న నా బంగారు తల్లివి నువ్వు నిన్న నేను ఏమి కోరను నువ్వు నాతో వుంటే చాలు అని అనేలోపు నేను డ్రైవర్ రోడ్డుపై ఎదురుగా కారుకి అడ్డంగా వచ్చిన కుక్కపిల్ల నుచూపను అది చూసిన డ్రైవర్ కారు నీ వెంటనే దాని పక్కకు తప్పించి పక్కగా వున్న జాతీరహదారి పైకి కారుని మర్లించాడు వెంటనే అందరం గట్టిగా ఊపిరి పీల్చుకొని ఆ కుక్కపిల్ల చూసాము అది ఆనందంగా తన తల్లిని చేరింది.వెంటనే మా కారుని ఒక పెద్ద లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది,

1 Comment

  1. అన్ని సగం సగం పోస్ట్ చేస్తవెంట్ర,పూర్తిగా పోస్ట్ చెయ్యరా

Comments are closed.