రీతూ పాల్ – Part 1 255

ఏదో ఈవేళ ఇలా అయిపోయింది, ఏమనుకోకు. నిన్ను ఇబ్బంది పెట్టాను. ఇంకెప్పుడు ఇలా చెయ్యను. డబ్బు తీసుకుని ఈరోజు ఇంటికి వెళ్ళు రేపు తొందరగా అని చెప్పాడు. నేను ఇంకేమీ మాట్లాడకుండా ఆ అయిదు వేలు తీసుకుని ఇంటికి వెళ్ళాను.

ఇంటికి వెళుతూ సార్ కు అంత డబ్బు సడన్ గా ఎలా వచ్చింది అని అనుకుంటున్నాను. ఆ హీరోయిన్లకు, హీరోలకు తెచ్చిన రోటీలు, ఫ్రూట్స్, జూసులు నాకు ఇచ్చేవాడు. ఎప్పుడైనా మహా అయితే 50 రూపాయలు ఇస్తాడు. ఇలా ఇంత డబ్బు నాకు ఎప్పుడూ ఇవ్వలేదు. అయినా అతను చేసిన పని నాకు నచ్చలేదు. అందుకే మా పిన్నికి ఏదో విధంగా నచ్చ చెప్పి వేరే పని చేసుకుందామని అనుకున్నాను అందులో ఇల్లు చేరుకున్నాను.

ఇంట్లో పెద్ద గొడవ జరుగుతోంది. మా పిన్ని నువ్వు దానికి పెళ్లి చేసి పంపిస్తే ఇంట్లో ఎలా జరుగుతుంది. చిన్నదాని పరిస్థితి ఏంటి? అని అరుస్తోంది.

ఇంకా ఎన్నాళ్ళు అది కష్టపడుతూ బతకాలి. దానికంటూ ఒక మంచి జీవితం వద్దా.

అయితే, ఇప్పుడు దానికి పెళ్లి చేసి ఉన్నదంతా దానికి పెట్టి మమ్మల్ని రోడ్లమీద పడేద్దామనుకున్నావా?

ఒసేయ్, వాళ్ళు కట్నం అడగడం లేదు. ఎదో పెళ్లి మాత్రం బాగా చేయమని అన్నారు. మన అమ్మాయికి అంతకన్నా గొప్ప సంబంధం తెచ్చే స్తోమత నాకు లేదు.

అయితే డబ్బులు ఎక్కడినుండి వస్తాయి.

అవసరం అయితే ఇల్లు తాకట్టు పెడతాను.

తర్వాత నేను నా కూతురు రోడ్లమీద అంతేనా, అంతేనా దీనికి కావలసింది.

ఏదైనా ఏది ఏమైనా గానీ ఇల్లు తాకట్టు పెట్టడానికి గానీ అమ్మడానికి కానీ వీలులేదు. అంతగా పెళ్లి చేయాలంటే మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను.

నేను చచ్చినా ఒప్పుకోను.

అంతగా నీ తమ్ముడికి ఇవ్వాలనుకుంటే చిన్నది ఉంది కదా?

దాన్ని ఆ తాగుబోతు గాడికి నేను ఇవ్వను. ఎవరైనా మంచివాడికిచ్చి పెళ్లి చేస్తాను.

ఒసేయ్, అది నోరా లేక తాటి మట్ట. చిన్నప్పటినుంచి రోజు గాడిద చాకిరీ చేసి మనల్ని పోషిస్తోంది.

అవును అన్ని తను చేస్తోంది. పెద్ద చెప్పొచ్చాడు. చిన్నప్పట్నుంచి దాన్ని నేను పెంచలేదు. ఆరోజు 50 వేలు కట్నం ఇవ్వలేక మానాన్న నా గొంతు కోశాడు. నీకు రెండో పెళ్ళాంగా వచ్చి నాఖర్మ ఇలా తగలబడింది.

ఒసేయ్… మీ నాన్న నీకు పెళ్లి చేస్తానని కూస్తున్నాడు. నన్ను కాదని నువ్వు పెళ్లి చేసుకున్నావనుకో, ఆంతే నాలో రాక్షసిని చూస్తావు.

అంటే అది పెళ్లి పెటాకులు లేకుండా జీవితాంతం అలా పడుండాలా?

నాకు అలాంటి కోరికలు లేవు

అయితే మరి ఏమంటావ్

నేను ఏమంటాను మా తమ్ముణ్ణి పెళ్లి చేసుకో అంటాను. వాడు ఇదంటే చాలా ఇష్టపడుతున్నాడు.

అది కుదరదు.

1 Comment

  1. Ganti subrahmanyam

    Excellent continue ?

Comments are closed.