రీతూ పాల్ – Part 1 255

అయితే చిన్నదానికి పెళ్లి చేసి తర్వాత నీ కూతురు పెళ్లి చేసుకో.

ఒసేయ్ పెద్ద దాని పెళ్లి కాకుండా చిన్నదానికి పెళ్లి ఎలా చేస్తారు.

అయితే 20 లక్షలు నా మొహాన కొట్టి మీ ఇష్టం వచ్చినట్టు తగలబడండి.

అంత డబ్బు అది ఎలా తెలుస్తుంది ?

ఏమో నాకు తెలీదు, నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం. కాదు కూడదని తండ్రి కూతురు ఏదన్నా చేశారో నా తమ్ముడికి దీనికి సంబంధం ఉందని ఊరంత టాం.. టాం.. కొట్టిస్తాను.

నాన్న నా పెళ్లి గురించి మీరు గొడవ పడకండి. ఎలా ఉంటే అలా జరుగుతుంది అని ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయాను.

అన్నం తినబుద్ధి కాలేదు. అలాగే ఏడుస్తూ పడుకున్నాను. ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలీదు. పొద్దున్నే మా పిన్ని అరుపులు వినబడ్డాయి.

ఒసేయ్ ముదనాష్టండనా, తొందరగా లేచి తగలడు. ఈ పనులన్నీ అలాగే ఉన్నాయి. ఏంటి వినపడిందా?

అక్క రాత్రంతా ఏడుస్తూనే ఉంది. ఆ పనులు ఏంటో నాకు చెప్పు నేను చేస్తాను.

నోరు మూసుకుని నువ్వు మంచిగా చదువుకో. లేదంటే నీకు మొగుణ్ణి తేలేక నేను చావాలి.

నేను లేచి ఇంట్లో పనులన్నీ చేసి మా పిన్నితో “నేను వేరే పని చేసుకుంటాను స్టూడియోకి వెళ్ళను అని అన్నాను” అంతే ఇంకేంటి అబ్బా కూతుళ్ళు కొత్త ప్లాన్ వేశారా? వేరేచోట పని చేస్తానని అటు నుంచి అటే ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా. మీ ఆటలు సాగవు” అని అరిచింది. సిగ్గు విడిచి చెబుతున్నాను ఆ మేకప్ మెన్ నన్ను ఎక్కడపడితే అక్కడ పట్టుకుంటున్నాడు. ఏవేవో చేయమంటున్నాడు. నోరు ముయ్యి. నీ మాట నేను నమ్మను. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు వచ్చిందా? నువ్వు పెద్ద అందగత్తెవని అనుకుంటున్నావా. అలాంటి మంచి వాళ్ళు మీద అభాండాలు వేస్తే పురుగులు పడి పోతారు. నిన్న చెప్పింది గుర్తు ఉంది కదా. మా తమ్ముడి పెళ్లి చేసుకో లేదా 20 లక్షలు సంపాదించు. అంతేకానీ ఇలాంటి మాటలు ఇంకొకసారి ఇంకోసారి చెప్తే నేను నిన్ను చంపేస్తాను. చేసేదేమి లేక స్టుడియోకు బయల్దేరాను. మా పిన్ని కూడా నాతో పాటే బయలుదేరింది. నేను వద్దని చెప్పలేను. డైరెక్టర్ రూమ్ లోకి వెళ్లి ఏదో మాట్లాడింది. తర్వాత డైరెక్టర్ నన్ను పిలిచి “ఏంటి వేషాలు వేస్తున్నావా? ఏదన్నా ఇబ్బంది ఉంటే నాకు చెప్పాలి. అంతే కాని ఇలా చాడీలు చెప్పరాదు. వెళ్లి పని చూసుకో” అని నన్ను పంపేశాడు.

అంతలో అమలకు ఫోన్ వచ్చింది.

పార్సెల్ ఏమి తీసుకురావాలి అని అడిగింది అమ్మ.

రెండు వాటర్ బాటిల్, నాలుగు రోటి, బట్టర్ మిల్క్, ఆపిల్ మిల్క్ షేక్ నాకు.

అక్క నీకేం కావాలి?

నేను ఇక్కడే వెళ్ళి తింటాను. నువ్వు ఎక్కడికీ వెళ్ళద్దు.

అలాగే ఒక భోజనం కూడా

సరే ఒక గంట సేపట్లో అక్కడ ఉంటాను.

అక్కడే భోజనం చేసి పార్సెల్ తీసుకురా. లేటయినా పర్వాలేదు. అని ఫోన్ పెట్టేసింది.

తర్వాత ఏం జరిగింది అని అడిగాను

తరువాతి అప్డేట్ లో………….

1 Comment

  1. Ganti subrahmanyam

    Excellent continue ?

Comments are closed.