హో కనిపెట్టేసావా??అదీ నిన్నటితో తనకి ఉన్న శాప ప్రభావం మొత్తం తొలగిపోయింది ఎప్పుడైతే నువ్వు వరూధిని దగ్గరికి వెళ్ళొచ్చావో అప్పుడే.
అదేంటే ఆశ్చర్యం గా ప్రవీణ కి శాపం తొలగిపోవడం?నేను వరూధిని దగ్గరికి వెళ్తే ఈమె శాపానికి విమోచనం కలగడం ఏంటి???
హ్మ్మ్మ్ అదా నీ డౌట్?ఏమీలేదు వరూధిని జన్మ నక్షత్రం, ప్రవీణ జన్మ నక్షత్రం ఒక్కటే,అందులోనూ ఆ మాయావుల భరతం పట్టింది గా ఆ దెబ్బతో వారి శాప ప్రభావం తొలగిపోయింది అంతే.
ఉఫ్ఫ్ఫ్ ఇదేదో పెద్ద ఆశ్చర్యంగా ఉందే మంజూ అన్నాను .
అంతగా ఆశ్చర్యపోవక్కర్లేదు రా సంజూ,ఇంకో విషయం ఏంటంటే ఆ పవిత్ర నక్షత్రం కూడా సేమ్..ఒకటే దెబ్బకి రెండు పిట్టల్ని ట్రాక్ లోకి తెచ్చావ్.
హ్మ్మ్మ్ అదా విషయం,అయితే ఇప్పటి నుండి ప్రవీణ మేడం కి మంచి సంబంధాలు చూడాలేమో?(తన కళ్ళల్లో చూస్తూ).
హ హ్హా ఏంటే ప్రవీణా,పెళ్లి చేసుకుంటావా?సంజయ్ గాడు సంబంధం చూస్తాడట???
అప్పుడే నాకు వద్దులే వే ఈ పెళ్లి,చేసుకుంటే గీసుకుంటే నువ్వే చేసుకో అంటూ వుడుక్కుంది ప్రవీణ.
ఇంకెప్పుడు చేసుకుంటావే మొద్దూ అసలే వయసు అయిపోతుంటేనూ,అయినా నాకెందుకు పెళ్లి??నాకు సంజయ్ గాడు ఉన్నాడు గా నాకవసరం లేదులే అదేదో నువ్వే చేసుకో అంది మంజూ నవ్వేస్తూ.
అబ్బో సంజయ్ గాడు పెళ్లి చేసుకుంటే తర్వాత నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో ఒక్కసారి, అప్పుడు తెలుస్తుంది నీకు బాధ ఏంటో?
పోవే ప్రవీ, అయినా వాడు పెళ్లి చేసుకుంటే మాత్రం వాడిని వదులుతానా ఏంటి?ఏరా సంజయ్ నన్ను వదిలేస్తావా అంటూ బుంగమూతి పెట్టింది.
అబ్బే నిన్నెందుకు వదులుతానే మంజూ అస్సలు వదలను,నా భార్య అర్థం చేసుకునేలా మలుచుకుంటాను లే అంటూ ధైర్యం చెప్పాను.
అబ్బో వీడు చూడవే,భార్యని ఒప్పిస్తాడట అయినా సిగ్గు లేదంట రా నీకు అలా అనడానికి??చెప్పుతో కొడుతుంది వచ్చిన భార్య ముందు ఇలాంటి వేషాలు వేసావంటే..ఏమ్మా జానకీ నువ్వైతే అలా ఒప్పుకుంటావా??
నేనైతే సంజయ్ గురించి అంతా తెలిసినదాన్ని కాబట్టి ఒప్పుకుంటా ఆంటీ అంటూ జానకీ నిఖార్సయిన సమాధానం ఇచ్చింది ప్రవీణ కి…
హ హ్హా నువ్వూ ఉండాల్సినదానివే జానకీ,హ్మ్మ్మ్ ఏ ఆడదైనా వాడు చెప్పినట్లు ఆడాల్సిందే లే,ఒసేయ్ మంజూ నువ్వు వీడిని తగులుకుంటే నేనూ ఒక రాయి వేస్తానే అంది నవ్వేస్తూ.
అబ్బో నీకు అంత సీన్ లేదులేవే ప్రవీ,ఏమైనా జరిగే పనులు ఉంటే చెప్పు.
అంటే ఏంటే నీ ఉద్దేశ్యం???నేను వీడిని వలలో వేసుకోలేనా అనా నీ అభిప్రాయం??
అలా కాదే ప్రవీ,అయినా నీకు అంత ధైర్యం లేదు అని నా ఉద్దేశ్యం..
ఓహో అదా నీ అభిప్రాయం, ఏరా సంజయ్ గా నన్నూ మంజూ లాగే చూసుకుంటావా లేదా??అంటూ సీరియస్ గా చూసింది నా వైపు.
నేను నవ్వేస్తూ ,మొత్తానికి మీ ఇద్దరి మధ్య ఆరాటం నాకు ఎసరు పెట్టేలా చేసిందే అన్నాను.
ఒరేయ్ నేను చెప్పినదానికి ఆన్సర్ చెప్తావా లేదా అంటూ గద్దించింది ప్రవీ.
హబ్బా ఇప్పుడు అవన్నీ ఎందుకులే గానీ,ముందు దర్శనం చేసుకుందాము అంటూ గుడి లోకి ఎంటర్ అయ్యి ప్రదక్షిణలు చేయడం మొదలెట్టాము…
ప్రదక్షిణలు అయ్యాక గుడిలోకి ఎంటర్ అయ్యి,పూజారి దగ్గర ఆశీస్సులు తీసుకొని కాసేపు గుడి అంతా కలియదిరిగాము…నేనూ అందరితో పాటూ ఆ పురాతన కాళికా మాత ఆలయాన్ని చూస్తుండగా నా కంటికి ఒక ఆకృతి మెరుపులా తగిలింది… అది వరూధిని దగ్గర కనిపించిన “మహాదీపం” యొక్క ఆకృతి.
ఆశ్చర్యం గా దాని వైపే చూస్తున్న నాకు జానకీ మాట అంతరాయం కలిగించింది సంజయ్ దాన్ని గమనించావా అని ఆ మహాదీపం వైపే వేలు చూపిస్తూ..
ఆశ్చర్యం గా జానకీ ని చూస్తూ అదే పనిలో వున్నాను జానకీ అని మనసులో జానకీ యొక్క జ్ఞాపక శక్తి కి శెభాష్ చెప్పాను..
అయినా ఈ ఆలయంలో ఈ ప్రతిమ ఉండటం ఏంటి??అది కూడా ఎవరో రాక్షసుల్ని ఒక ఆడ మనిషి ఎదుర్కొంటూ కనిపిస్తుంటే నాకు ఆశ్చర్యం అవధులు దాటింది..బహుశా ఆ రాక్షసులు గుహుడు సంతతి వాళ్ళా???మహాదీపం పై భాగాన ఒక వీరుడు దానికి కాపలాగా ఖడ్గం ధరించి ఉండటం నన్ను ఆశ్చర్యం కి గురి చేసింది..
ఎందుకో ఆ విషయం తెలుసుకోవాలి అని అనిపించగా,పూజారి గారూ అని అరిచాను…పూజారి నా దగ్గరికి వచ్చి చెప్పు బాబూ అని వినయంగా అనేసరికి ఆయనకి మహాదీపం గుర్తుని చూపిస్తూ ఆ ప్రతిమ గురించి మీకేమైనా తెలిస్తే చెప్పగలరు అన్నాను వినయంగా.
నాకేమి తెలియదు బాబూ ఈ ప్రతిమలు గురించి ,నేను ఈ మధ్యనే ఇందులో పూజారిగా నియమితం అయ్యాను,ఈ ఆలయ విశిష్టత మొత్తం నా నాన్న గారికి మాత్రమే తెలుసు అన్నాడు వినయంగా.
అవునా మీ నాన్న గారు ఎక్కడ వుంటారు బ్రాహ్మణా అని అడగగా ప్రక్కనే ఉన్న పురాతన రాజకోట పై భాగాన ఉంటారు అని జవాబిచ్చారు ఆ బ్రాహ్మణుడు..
అదేంటీ ఆ రాజకోట లోకి ఎవ్వరినీ అనుమతివ్వరు గా??మీ నాన్న గారు అందులోకి ఎలా వెళ్తున్నారు అన్నాను ఆశ్చర్యం గా..
పురాతన కాలం నుండీ మా వంశం లో ఒక్కరు ఎల్లప్పుడూ ఆ కోటలోనే ఉండటం ఆనవాయితీ బాబూ,ఆ కోట బాగోగులు మా వంశస్తులే చూడటం ఆనవాయితీగా వస్తోంది అందుకు ప్రభుత్వం నుండి కూడా అనుమతి ఉంది అని చెప్పారు ఆ బ్రాహ్మణుడు.
ఓహో అదా విషయం,నేను మీ నాన్న గారిని కలవొచ్చా??
ఆయన సామాన్యంగా ఎవ్వరినీ కలవరు బాబూ,ఎందుకైనా మంచిది మీ సెల్ నంబర్ ఉంటే నాకు ఇవ్వండి,నేను ఒక్కసారి ఆయనతో మాట్లాడి మీకు కబురు చేస్తాను అంటూ నా పేరుతో సహా అన్ని డీటైల్స్ తీసుకున్నారు ఆయన.