ఆట ప్రారంభమవుతుంది 167

“సో……ఇప్పుడు చెప్పు..నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు….”అన్నాడు స్ట్రెయిట్ గా విషయానికి వొస్తు విగ్నేష్. “ముందు మీరు చెప్పండి….”అంది స్నిగ్ద. “నా గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమిలేదు…ఒక మాములు మనిషిని…”అన్నాడు కొంచెం నిర్వేదంగా విగ్నేష్. అతన్ని ఒకసారి తెరిపార చూసి “మీ వయసు..ఒక ముప్పై ఐదు ఉంటుందా..”అంది అతని వయసుని అంచనా వేస్తున్నట్టుగా చూస్తూ. “నలభై ఐదు…ఐన ఇప్పుడు నా వయసు తో ఎం పని…”అన్నాడు కొంచెం అసహనంగా విగ్నేష్. అదేమీ పట్టించుకోకుండా “అవునా…మీరు చూడడానికి అలా లేరు.. “అంది నవ్వుతు స్నిగ్ద. వయసు తక్కువ లా కన్పిస్తున్నావంటే ఆడవాళ్లకే కాదు మగవాళ్లకు కూడా హ్యాపీ గానే ఉంటుంది. “ఐన పెళ్లి అయి పిల్లలు ఉండి..ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి అని అనుకుంటున్నారు..”అంది స్నిగ్ద. “నేను నీకు, నాకు పెళ్లి అయ్యిందని చెప్పానా…..”అన్నాడు. “అంటే…అంటే…నలభై ఐదు అన్నారు కదా…అయ్యిఉంటుందేమో అని….”అంటూ నసిగింది స్నిగ్ద. “అది సరే…నీకు పట్టుమని పాతికేళ్ళు కూడా లేవు…చనిపోవాలి అని ఎందుకు అన్పిస్తుంది.”అన్నాడు. “నా గురించి తర్వాత చెప్తాను…ముందు మీ గురించి చెప్పండి…ఎక్కువ టైం లేదు మనకి….”అంది మళ్ళి ముఖం మీద నుండి నవ్వు మాయం అవుతుంటె. సరే అంటూ స్నిగ్ద వైపు చూసి తన గురించి చెప్పబోతుంటే, “ఆగండాగండి …..ఎలాగూ కాసేపట్లో చనిపోబోతున్నాము కదా ….అన్ని నిజాలే చెప్పండి….ఎంత పచ్చి నిజాలు ఐన కూడా పర్లేదు…ప్రామిస్ చేయండి..నిజాలే చెప్తాను అంటూ…నా చేతి మీద చేతి పెట్టి…”అంటూ చేయి ముందుకు చేసింది స్నిగ్ద. గట్టిగ నవ్వాడు విగ్నేష్. అతను ఎందుకు నవ్వు తున్నాడో అర్ధం కాక ఆలాగే చూస్తూ ఉండిపోయింది. విగ్నేష్ నవ్వు ఆపి ” కాసేపట్లో చనిపోబోయేముందు కూడా ఈ ఓట్లు ఏంటి …నువ్వు చనిపోవడానికి వచ్చినట్టుగా లేదు….నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వొచ్చినట్టుగా ఉంది…”అన్నాడు. ఆ మాటలకి సిగ్గుపడుతూ “అది కాదండి…ఎదో అలవాటు చొప్పున…అలా అడిగాను…”అంది సిన్సియర్ గా స్నిగ్ద. ఆ అమ్మాయి వైపు కాసేపు చూసి “ఇవన్నీ కాదు స్నిగ్ద….నీకు చనిపోవాల్సిన అవసరం లేదు..నా మాట విను….నీకు మంచి ఫ్యూచర్ ఉంది…హాయిగా ఇంటికి వెళ్ళిపో…”అన్నాడు విగ్నేష్ సిన్సియర్ గా.
“అంటే….నేను వెళ్ళిపోతే …మీరు ఒంటరిగా చనిపోదామనే…అలాంటిది ఏమి కుదరదు….నేను కూడా మీతో పాటే….”అంది అంతే సిన్సియర్ గా స్నిగ్ద. “హెయి….నీకేమైనా పిచ్చా….ఎవరైనా కలిసి బ్రతకాలి అనుకుంటారు…కలిసి చావాలి అనుకోరు….ఐన నీకు ఇప్పుడప్పుడే చావల్సినంత కష్టాలు ఉన్నాయి అని నాకు అనిపించడం లేదు…”అన్నాడు విగ్నేష్ కొంచెం సీరియస్ గానే. “మరీ మీకు ఉన్నాయా…ఇప్పుడప్పుడే చనిపోయినంత కస్టాలు….నాకు కూడా అనిపించడంలేదు….మిమ్మల్ని ఆపినపుడు మీరు చెప్పినదాన్ని బట్టి…డబ్బుకి కూడా కొదవలేదు మీకు…చాలా మంది అప్పుల వాళ్ళ బాధతోనో….లేకపోతె ఇంట్లో వాళ్ళు పెట్టె టార్చర్ తట్టుకోలేకపోతేనో చావాలి అనుకుంటారు…మీకు పెళ్లి కూడా కాలేదు అంటున్నారు సో ఆ ప్రాబ్లెమ్ కూడా లేదు…”నిలదీసినట్టుగా అడిగింది స్నిగ్ద. అలా అడిగేసరికి ఏమి చెప్పాలో అర్ధం కాలేదు కాసేపు విగ్నేష్ కి. ఒకటి మాత్రం బాగా అర్ధం అయ్యింది విగ్నేష్ కి.అమ్మాయి చాలా తెలివైనదని. ఇంత తెలివైన అమ్మాయి, చావాలనుకుంటుంది అనే విషయం మళ్ళి గుర్తొచ్చి కొంచెం అనునయంగా ” చూడు స్నిగ్ద…నా సమస్య వేరు.. మన పరిచయం ఐన ఈ కొద్ది కాలం చనువుతో చెప్తున్నాను….ఇంటికి వెళ్ళిపో..నీకు చావల్సిన అవసరం ..ఏ కోశానా లేదు…నా మాట విను….ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు…అసలే రోజులు బాగోలేవు….తొందరగా ఇంటికి .వెళ్ళిపో…నా చావు నన్ను ప్రశాంతంగా చావనివ్వు….”అన్నాడు స్నిగ్ద వైపు ప్లీజ్ అన్నట్టుగా చూస్తూ.
“ఇవన్నీ కాదు కానీ….నా గురించి నీకు, నీ గురించి నాకు తెలియాల్సిన అవసరం ఏమిలేదు…పద..లేవండి..వెళ్లి ఇద్దరం కలిసే చనిపోదాము….”అంది లేచి నిల్చుంటు సీరియస్ గా స్నిగ్ద. “హే…నీకేమైనా లూసా…ఇంటికి వెళ్ళిపో ..అంటే కలిసి చద్దాము అంటున్నావు ..”అన్నాడు కాస్త కోపంగా విగ్నేష్. నవ్వుతు విగ్నేష్ వైపు చూసింది స్నిగ్ద. “ఏంటి నేను సీరియస్ గా చెప్తుంటే ..నీకు నవ్వులాటగా ఉందా….”అన్నాడు విగ్నేష్. “లేకపోతె ….మరేంటి…మాస్టారు …ఇక్కడికి వొచ్చింది చచ్చిపోవడానికే….మళ్ళి ఇంటికి వెళ్లిపోవడానికి కాదు…మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు….మీరు చాలా మంచి వారు..వాస్తవానికి మీకు చావల్సిన అవసరం ఏ కోశానా లేదు గాక లేదు….మీరే ఇంటికి వెళ్లిపోండి….నా చావు నన్ను చావనివ్వండి….” అతని లాగే అనేసరికి నవ్వకుండా ఉండలేకపోయాడు విగ్నేష్. కాసేపు ఇద్దరు మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు.
మల్లి బెంచ్ మీద కూర్చుంటూ “సో…..ఇప్పుడేంటి…మన స్టోరీస్ ఒకరికొకరం చెప్పుకుంటేనే కానీ….చావలేమంటావు…అంతేగా..”అన్నాడు సీరియస్ గా విగ్నేష్. చప్పున బెంచి మీద కూర్చుంటూ “అవును…మాస్టారు…అప్పుడు ప్రశాంతంగా చనిపోవొచ్చు….గారంటీ నాది….”అంది భరోసా ఇస్తున్నట్టుగా పేస్ పెడుతూ స్నిగ్ద. “హ..హ..హ….వాడెవడో యాడ్స్ లో నున్నగా గుండు కొట్టుకొని…గారంటీ నాది అంటాడు చూడు…అలా ఉంది నువ్వు చెప్తుంటే….”అన్నాడు నవ్వుతూనే విగ్నేష్. స్నిగ్ద బుంగ మూతి పెట్టుకొని “వాళ్లంటే….వాళ్ళ బిజినెస్ కోసం అంటారు….”అంది. “సరే ..సరే…అవన్నీ వొదిలెయి….మన విషయానికి వొద్దాము…”అంటూ స్నిగ్ద వైపు చూసాడు నవ్వుతు విగ్నేష్. అది బెటర్ అన్నట్టుగా చూసింది స్నిగ్ద. గొంతు సవరించుకొని “నా జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు చెప్తాను….క్లుప్తంగా….”అంటూ తన గురించి చెప్పడం మొదలెట్టేసాడు విగ్నేష్.

“నా గురించి చెప్పే ముందు, నా చిన్ననాటి గురించి కూడా కొద్దిగా చెప్పాలి. మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. ఒక్కడే కొడుకుని. నీకు తెలియనిదేముంది, దిగువ మధ్య తరగతిలో డబ్బుల గురించి ఉండే కష్టాలు. ఏ చిన్న అవసరం వొచ్చిన అప్పు చేయాల్సిందే. కొంచెం పర్లేదు అనుకునే టైం కి మల్లి ఎదో ఆవసరం వొస్తూనే ఉంటుంది. మా ఇంట్లో కష్టాలు, చుట్టూ ఉన్న వాళ్ళ కష్టాలు చూసి చూసి, ఎలాగైనా బాగా డబ్బు సంపాదించాలి అనే పట్టుదల ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్ కి వెళ్తున్న కొద్దీ పెరగసాగింది. ఎవరితో షేర్ చేసుకోలేదు కానీ, పదో క్లాస్ కి వొచ్చే వరకు లైబ్రరీ కి వెళ్లడం అలవాటు చేసుకున్న. జీవితంలో సక్సెస్ ఐన వాళ్ళ స్టోరీస్ చాల చదివాను. ప్రతివాడి సక్సెస్, ఫెయిల్యూర్ తోనే స్టార్ట్ అయ్యింది అనే విషయం నాకు అర్ధం అయ్యింది. నా ఫోకస్ ఫెయిల్ కాకుండా సక్సెస్ ఎలా అవ్వాలి అనే దాని మీద నాకు తెలియాకుండానే వెళ్ళిపోయింది. అందరు టీనేజ్ కుర్రాళ్లు గర్ల్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటే నేనేమో పుస్తకాల పురుగునైపోయాను. డిగ్రీ కి వొచ్చే సరికి చాల పుస్తకాలు చదివేశాను. ఇల్లు, లైబ్రరీ ఇదే తప్ప వేరే ధ్యాసే ఉండేది కాదు.

ఒక రోజు లైబ్రరీలో వారెన్ బఫెట్ సంబదించిన బుక్ చదువుతూ , ఎందుకో తల ఎత్తి చూసాను. నాకు ఎదురుగ ఒక అమ్మాయి కూర్చొని నన్నే చూస్తుంది. నేను ఎప్పుడు ఆ అమ్మాయిని పెద్దగా గమనించలేదు లైబ్రరీలో. ఆ అమ్మాయి చూపులని బట్టి నన్ను చాల రోజుల నుండి observe చేస్తున్నట్టుగా అనిపించింది. నన్ను చూసి పలకరింపుగా నవ్వింది. నేను కూడా మొహమాటంగా చిన్నగా స్మైల్ ఇచ్చాను. చాల సేపటి నుండి బుక్ చదువుతుండడం వల్ల నాకు కొంచెం తల నొప్పిగా అనిపించి, టీ తాగడానికి కాంటీన్ వైపు వెళ్ళాను. కాంటీన్లో పెద్దగా జన సంచారం లేదు. టీ తీస్కొని ఒక టేబుల్ దెగ్గరకు వెళ్లి కూర్చొని టీ సిప్ చేస్తూ వారెన్ బఫెట్ అంత ఎలా సంపాదించాడు స్టాక్ మార్కెట్లో అని ఆలోచిస్తుంటే, హాయ్ అన్న మాటకు ఈ లోకం లోకి వొచ్చాను. ఎదురుగ ఇంతకు ముందు లైబ్రరీ లో చూసిన అమ్మాయి, టీ తెచ్చుకొని నాకు ఎదురుగ కూర్చుంది. నేను హాయ్ అన్నట్టుగా చిన్నగా స్మైల్ ఇచ్చాను. “మిమ్మల్ని ఒక వారం నుండి observe చేస్తున్నాను….అంత సీరియస్ గా ఎం చదువుతారు…”అంది నవ్వుతు. నేను అమ్మాయిలతో మాట్లాడింది చాల తక్కువ. అందులో ఈ అమ్మాయి తో నాకు అస్సలు పరిచయం కూడా లేదు. ఏమనాలో అర్ధం కాక “ఎదో సరదాకి …. అలా వొచ్చి బోర్ కొట్టినప్పుడల్లా చేతికి దొరికిన బుక్ చదువుతూ ఉంటాను…”అన్నాను నవ్వుతు. “మీరు సరదాకి రావడంలేదు లైబ్రరీ కి…చాల సీరియస్ గానే వస్తున్నారు….మీరు చదువుతున్న బుక్స్ కూడా నేను observe చేశాను…”అంటూ ఆగి టీ సిప్ చేసింది. ఓహ్ అంటే చాల రోజుల నుండి నన్ను observe చేస్తుంది అనే విషయం అర్ధం అయి, నిజం చెప్పాలి అంటే కొంచెం గర్వంగా కూడా అనిపించింది. ఒకసారి ఆ అమ్మాయి వైపు చూసాను. చాల dignified గా ఉంది. పద్దతిగా డ్రెస్సింగ్, ఆ అమ్మాయి పేస్ చూస్తే ఎవరికైనా గౌరవ భావం కలుగుతుంది. నేను అలా తన పేస్ నే చూస్తుంటే కొంచెం ఇబ్బంది గా కదిలి “ఏంటి.. ఎం ఆలోచిస్తున్నారు…”అంది నవ్వుతు. “అది సరే…మీరు ఎం చేస్తుంటారు….”అన్నాను టాపిక్ డైవర్ట్ చేస్తూ. “డిగ్రీ చదువుతున్నాను…ఇక్కడే దేగ్గర్లో ఉన్న హాస్టల్ లో ఉంటాను….నాకు బుక్స్ చదవడం అలవాటు.. అందుకే ఇక్కడికి అప్పుడప్పుడు వొస్తూ ఉంటాను…”అంది. “మీ పేరు…”అన్నాను. “ఊహ్హ్హ్హ్ఫ్….సారీ..ఇంట్రో చేసుకోవడమే మర్చిపోయాను….ఐ అమ్ సిరి….నైస్ to మీట్ యు…”అంటూ చేయి చాపి, నా గురించి కూడా చెప్పమన్నట్టుగా చూసింది. “నైస్ తో మీట్ యు….నా పేరు విగ్నేష్”అంటూ చేయి కలిపాను. అలా ఆల్మోస్ట్ డైలీ కలిసేవాళ్ళము. ఇద్దరి ఏజ్ గ్రూప్ ఒక్కటే వల్లనేమో ఈజీ గానే ఫ్రెండ్స్ అయి పోయాము. తాను చాల పుస్తకాలూ చదివింది. రంగనాయకమ్మ, చలం దెగ్గర నుండి శ్రీ శ్రీ వరకు ఎవరి పుస్తకాలూ కూడా వదిలినట్టు అయితే నాకు అనిపించలేదు. ఆ పుస్తకాల గురించి మాట్లాడుతుంటే నాకు సరిగా అర్ధం అయ్యేది కాదు. నేను ఎప్పుడు ఎక్కువగా అలాంటి బుక్స్ చదవలేదు. లైబ్రరీ లో కలవడమే తప్ప బయట ఎక్కడ మేము కలవలేదు మా రెండు నెలల పరిచయంలో. కనీసం ఫోన్ నెంబర్ కూడా ఎక్స్చేంజి చేసుకోలేదు.
ఒక వారం నుండి తాను రావడం లేదు లైబ్రరీ కి. అప్పుడనిపించింది ఎంత పెద్ద తప్పు చేసానో, కనీసం ఫోన్ నెంబర్ కూడా తీసుకోకుండా. కనీసం ఏ హాస్టల్ లో ఉంటుందో ఆ హాస్టల్ పేరు కూడా తెలుసుకోలేదు నేను. ఐన నేను తన గురించి ఎందుకు అంతలా వెయిట్ చేస్తున్నానో నాకు కూడా అర్ధం కాలేదు.
పది రోజుల తర్వాత అనుకుంట, తను వొచ్చింది. నేను పలకరింపుగా నవ్వాను. “ఏంటి సర్….నన్ను మిస్ అవ్వలేదా ఇన్ని రోజులు….”అంది ఎదురుగ వొచ్చి కూర్చుంటూ. “ఊర్లో లేరు అనుకుంటా…అందుకే రాలేదు కదా….”అన్నాను చాల వెయిట్ చేశాను అనే విషయం తనకి తెలియకుండా మేనేజ్ చేస్తూ. “అవునా….అయితే నా గురించి వెయిట్ చేయలేదా….”అంది కొంచెం నిరుత్సహాంగా సిరి. “మన మెంత ఫూల్స్ మీ కదా…”అంది తనే మళ్ళి. అర్ధం కానట్టుగా చూసాను. “కనీసం ఫోన్ నంబర్స్ కూడా ఎక్స్చేంజి చేసుకోలేదు…”అంది నా కళ్ళలోకి చూస్తూ. తనకి కూడా నన్ను ఇన్ని రోజులు మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ ఉంది అని అర్ధం అయ్యేసరికి, కొంచెం రిలాక్స్ అవుతూ “బోర్ గా ఉంది….అలా బయటకి వెళ్దామా…..”అన్నాను. “బయటకా….ఎక్కడికి….”నేను అలా అంటాను అని ఎక్సపెక్ట్ చేయక ఆశ్చర్యపోతూ అంది సిరి. “ఎక్కడికైనా సరదాగా…అలా బయటకు ..అంతే…”అన్నాను నిజానికి ఎక్కడికెళ్లాలో నాకు కూడా తెలియక. “సరే ..పద.నీకు మాంచి ఐస్ క్రీం తినిపిస్తాను….” అంటూ లేచింది.
ఐస్ క్రీం తినేసి బయటకు వచ్చాము. “చాల బాగుంది ….అవును …ఎక్కడికెళ్ళావు సడన్ గా..ఇన్ని రోజులు “అన్నాను అడగడం మర్చిపోయినందుకు నొచ్చుకుంటూ. “హ్మ్మ్…అబ్బో…ఇప్పుడు గుర్తొచ్చిందా….ఉరేల్లానులే..నాన్నగారు వొచ్చారు….నీకు చెప్పడానికి టైం కూడా లేకుండే…తమరి నెంబర్ కూడా లేదు కదా నా దెగ్గర….”అంది నవ్వుతు సిరి. ఏమనాలో అర్ధం కాక నవ్వుతు చూసాను తనని. “సరే…ఊర్లో లేను కదా….ఇన్ని రోజులు…ఫ్రెండ్స్ ని కలవాలి…నేను బయలు దేరుతాను…”అంది నన్ను చూస్తూ. సరే అన్నట్టుగా చూసాను. “అయితే ఇప్పుడు కూడా నెంబర్ ఇవ్వవా….”అంది నా కళ్ళలోకి చూస్తూ. నేను సారీ అన్నట్టుగా చూసి, నెంబర్ చెప్పాను. తను వెళ్ళిపోయింది.
నైట్ పదిగంటలకు ఫోన్ మోగుతుంటే ఈ టైం లో ఎవరబ్బా అనుకుంటూ ఫోన్ ఎత్తి “హలో …”అన్నాను. “ఏంటి సర్..మీ నెంబర్ ఇవ్వడమే కానీ….మా నెంబర్ తీసుకోక పొతే ఎలా….”అంటూ అవతలి నుండి సిరి అనగానే, “ఓహ్ .నువ్వా సిరి…సారీ…మర్చిపోయాను…ఏంటి ఈ టైం లో చేసావు….”అన్నాను తర్వాత ఎం మాట్లాడాలో తెలియక. అలా అడగడం నాకే ఎబ్బట్టుగా అనిపించింది తర్వాత. కాసేపు మౌనం, తాను ఫీల్ అయినట్టుగా అనిపించింది. “సారీ….నాకే un easy గా ఉంది ఇలా అడిగినందుకు….”అన్నాను నేను కూడా ఫీల్ అవుతూ. “ఓహ్…తమరికి కూడా ఫీలింగ్స్ ఉన్నాయే…గ్రేట్…nice to hear from you… sorry….”అంది నవ్వుతు సిరి. అలా చాల సేపు మాట్లాడం. కొద్దీ రోజుల్లోనే రోజు కనీసం ఫోన్ లో ఐన మాట్లాడుకోకుండా ఉండలేని స్థితికి వచ్చేసాము ఆల్మోస్ట్. ఆరేడు నెలల్లోనే మా స్నేహం చాల గట్టిపడింది. అది కేవలం స్నేహమా, ప్రేమా ఏమో అంత దూరం ఆలోచించలేదు అప్పటివరకు. అప్పుడు నాకు అనిపించింది అన్ని స్నేహలకంటే ఆడా, మగా మధ్య ఉండే స్నేహమే చాల గట్టిది అని. ఇది కరెక్టో కాదో నాకు కూడా తెలియదు.
ఒకరోజు దూరపు చుట్టాల పెళ్ళికని అమ్మ నాన్న ఊరెళ్ళారు. వాతారణం వర్షం వొచ్చేట్టుగా ఉండడం వల్ల, ఇంట్లో కూడా ఎవరు లేకపోవడం వల్ల లేట్ గా లేచి ఫ్రెష్ అప్ అవ్వడానికి బాత్రూం లోకి వెళ్లి వొచ్చేలోపు సిరి వి 10 missed కాల్స్ ఉండడం చూసి, కాల్ బ్యాక్ చేశాను. “ఎన్ని సార్లు ఫోన్ చేశాను….ఎం చేస్తున్నావు…”అంది. “వాష్ రూమ్ లో ఉన్నాలేగాని, అన్ని సార్లు చేసావు ఏమైంది…”అన్నాను. “నిన్ను కలవాలి …అర్జెంటు..ఇప్పుడే..”అంది నేను చెప్పేది వినిపించుకోకుండా. “ఇప్పుడా….వర్షం కూడా వచ్చేట్టుగా ఉంది…సర్లే….నేను ఇంట్లో నే ఉన్నాను….అమ్మ వాళ్ళు పెళ్ళికి ఊరెళ్ళారు…”అన్నాను. “నేను రానా మీ ఇంటికి..”అంది. ఇంకా చేసేది ఏమిలేక నియర్ బై లాండ్మార్క్ చెప్పి, వెళ్లి ఇంటికి తీసుకొచ్చాను. మేము ఇంట్లోకి రావడంతోనే, బయట వర్షం స్టార్ట్ అయ్యింది.

1 Comment

Comments are closed.