ఆట ప్రారంభమవుతుంది 167

అమ్మ లేపుతుంటే ఉలిక్కిపడి లేచాను. “ఏమైంది..రా…”అంటూ నా పక్కన కూర్చుంది అమ్మ. నేను అమ్మ బుజం మీద తల పెట్టి “తల నొప్పిగా ఉంది అమ్మ….”అని మాత్రమే అనగలిగాను. ఉండు కాఫీ తెస్తాను అంటూ వెళ్లి, వేడి వేడి కాఫీ తీస్కొని వొచ్చింది. కాఫీ తాగక కొంచెం స్థిమిత పడ్డట్టుగా అయ్యింది. ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను. తనతో ఎలా కాంటాక్ట్ లోకి రావాలో అర్ధం కావడంలేదు. వాళ్ళ ఊరి పేరు ఎదో చెప్పింది. నాకు అంతగా గుర్తులేదు… ఆ రోజు ఎలాగో గడిచిపోయింది. ఎన్ని సార్లు సిరి ఫోన్ కి ట్రై చేసానో గుర్తులేదు. పిచ్చి పిచ్చి కలలు ….రాత్రంతా కలత నిద్ర..ఉదయం లేచి తల స్నానం చేసి టిఫిన్ తిని, నాకు ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ విశాల్, వాడి దెగ్గరకు వెళ్ళాను. వాడు నన్ను చూసి “ఏమైంది మామ…పేస్ అంత అలా అయింది….”అంటూ వొచ్చి నన్ను పట్టుకున్నాడు. సిరి గురించి తనకి కూడా తెలుసు. మళ్ళి తానే “సిరి తో ఏమైనా గొడవ పడ్డావా….”అన్నాడు. లేదన్నట్టుగా చూసాను. వాడికి జరిగిందంతా చెప్పాను. “బాధ పడకు మామ…ఒక రెండు మూడు రోజులు చూద్దాము…అప్పటికి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే….ఎదో ఒకటి ఆలోచిద్దాములే…”అన్నాడు. నాకు కూడా పిచ్చి పెట్టినట్టుగా ఉంది. కొంచెం రిలాక్స్ అవుదాము అనిపించింది. వాడితో కలిసి ఆ రోజు మొత్తం బయట తిరిగాను. కానీ నా ఆలచనలన్నీ సిరి చుట్టురే తిరుగుతున్నాయి. నాకు కలవకపోయిన పర్లేదు తాను సేఫ్ గా ఉంటె చాలు, తాను సేఫ్ గా ఉన్నాను అని ఒక్కసారి ఫోన్ చేస్తే చాలు. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదు. అలా అని ఏమి నాస్తికుడిని కూడా కాదు. నాకు గుర్తొచ్చిన దేవుళ్లందరిని వేడుకున్నాను. కనీసం సిరి ని సేఫ్ గా ఉంచితే చాలు అని..
చూస్తూ ఉండగానే పది రోజులు గడిచిపోయాయి. సిరి దెగ్గర నుండి ఎలాంటి ఫోన్ లేదు. ఆలోచించాను,ఇక నాకు మిగిలిన ఒకే ఒక్క దిక్కు సిరి రూమ్ మెట్. మళ్ళి హాస్టల్ కి వెళ్ళాను. తనను కలిసి ఆరాతీసాను. తనకు కూడా అంతగా తెలియదని అర్ధం అయ్యింది. ఇంక ఎం చేయాలో అర్ధం కాలేదు. సడన్ గ ఫ్లాష్ లా వెలిగింది, హాస్టల్ వాళ్ళ దెగ్గర డీటెయిల్స్ ఉంటాయి అని. ఆ అమ్మాయిని ప్రాధేయపడి డీటెయిల్స్ తెప్పించాను. ఊరి అడ్రస్, సిరి ఫాదర్ నెంబర్ దొరికింది. ఆ నెంబర్ కి ఫోన్ చేశాను. same swiched off . ఆ నెంబర్ కూడా swiched off వచ్చేసరికి నా మనసు ఎదో కీడు శంకించింది. ఇంక అక్కడ ఉండలేక ఆ అమ్మాయికి థాంక్స్ చెప్పి ఇంటికి వొచ్చాను. నా రూమ్ లోకి వెళ్లి, రెండు నంబర్స్ మధ్య రాత్రి వరకు ట్రై చేస్తూనే ఉన్నాను. రాత్రంతా సిరి తాలూకు ఆలచనలతో పిచ్చెక్కిపోయింది. ఉదయం నిద్ర లేచి అమ్మకు ఊరెళుతున్నాను రెండు రోజుల్లో వొస్తాను అని చెప్పి సిరి ఊరికి బయలు దేరాను.
సిరి వాళ్ళ ఉరికి చేరుకునేసరికి మరుసటి రోజు ఉదయం పది గంటలు అయింది. అందరు నన్ను వింతగా చూస్తున్నారు కొత్త మొహం కనపడేసరికి. ఎవరిదేగ్గర వాకబు చేయాలో అర్ధం కాలేదు. పైపెచ్చు తల పోటుగా ఉంది కొంచెం టీ తాగితే కానీ మాములు మనిషి అయ్యేట్టుగా లేదు అనిపించి, అటు ఇటు చూసాను చిన్న టీ కొట్టు కనిపించింది. అక్కడికి వెళ్లి టీ తాగి, అలాగే బెంచ్ మీద కూర్చున్నాను. “ఏంటి బాబు…ఉరికి కొత్తలా ఉన్నావు…ఎవరి తాలూకు …. “అన్నాడు ఆ టీ కొట్టు ఓనర్. సిరి వాళ్ళ నాన్న పేరు చెప్పి వాళ్ళని కలవడానికి వొచ్చాను అని చెప్పాను.
అతను అటు ఇటు చూసి, ఏమనుకున్నాడో ఏమో నా చేయి పట్టుకొని గబా గబా లోనికి తీసుకెళ్లాడు. నాకేమి అర్ధం కాలేదు. లోనికి వెళ్ళగానే “వాళ్ళు నీకేమి అవుతారు….”అన్నాడు. “వాళ్ళ అమ్మాయి సిరి….నాకు తెలుసు…”అన్నాను. “ఆ తల్లి నీకు తెలుసా…”అన్నాడు అతను. నేను అర్ధం కానట్టుగా అతని వైపు చూసాను. “ఆ తల్లి …వల్లే నేను ఈ హోటల్ పెట్టుకున్నాను….చాలా తెలివైన అమ్మాయి…నాకే కాదు ఎందరికో చాలా సహాయం చేసింది…వాళ్ళ నాన్న గారు…చాలా మంచివారు….”అంటూ నా వైపు చూసి ఆపాడు. హమ్మయ్య, కొంచెం ఊపిరి పీల్చుకున్నాను. ఇతని ద్వారా సిరి ని కలవొచ్చు అని. “నాకు సిరి వాళ్ళ ఇల్లు చూపిస్తారా….నేను సిరిని కలవాలి అర్జెంటు గా..”అన్నాను లేచి నిల్చుంటు. అతను నా చేయి పట్టుకొని మళ్ళీ కుర్చోపెట్టాడు. అర్ధం కాక అతని వైపు చూసాను. అతను గంబిరంగా నా వైపు చూసి “సిరి ని కలవడం వీలు కాదు….”అన్నాడు. “ఎం… ఎందుకు……”అంటూ అతని వైపు అసహనంగా చూసాను. “కుదరదని చెప్పాను కదా….ఇంక నువ్వు వొచ్చిన దారిలోనే వెళ్ళిపో….ఆ అమ్మను కలవడానికి వీలు కాదు….”అన్నాడు నిక్కచ్చిగా చెప్తున్నట్టుగా. “సిరి ని కలవకుండా….ఈ ఊరు దాటే ప్రసక్తే లేదు…” మొండిగా అన్నాను నేను. “కుదరదు అని చెప్పాను….కదా.”అనునయిస్తున్నట్టుగా అన్నాడు. “లేదండి…నేను చాలా దూరం నుండి వొచ్చాను…ప్లీజ్….ఒకసారి నన్ను ఆమె దెగ్గరకు తీసుకెళ్లండి….”వేడుకోలుగా అతని వైపు చూసాను. అతను నా వైపు జాలిగా చూసి, నా పక్కన వొచ్చి కూర్చున్నాడు. నా బుజం మీద చేయి వేసి “సిరి ని ప్రేమించావా….”అన్నాడు. నా కళ్ళలో సన్నటి కన్నీటి పొర. కళ్ళు తుడుచుకుంటూ అవునన్నట్టుగా చూసాను. చిత్రంగా అతని కన్నులవెంట నీళ్లు. నాకేమి అర్ధం కాలేదు. బిక్క మొకం వెస్కొని అతని వైపు చూస్తూనే ఉన్నాను. అతను కొంచెం తేరుకొని “నువ్వు వెంటనే మీ ఉరికి వెళ్ళిపో బాబు….”అన్నాడు. నాకు కోపం తో పాటు దుఃఖం కూడా వొచ్చింది. సిరి ని కలవడానికి నాకు ఉన్న ఒకే ఒక్క ఆధారం అతను. కంట్రోల్ చేస్కుంటూ “ప్లీజ్…ఒక్కసారి వాళ్ళింటికి తీసుకెళ్లండి….కనీసం దారైన చెప్పండి…”అన్నాను ప్రాధేయపడుతూ. “చెప్పాను కదా ..ఆ అమ్మయిని కలవడం వీలు కాదు అని…”అన్నాడు నిక్కచ్చిగా. కోపంగా అతన్ని చూస్తూ “పెద్ద మీరే ఉన్నారా ఊర్లో…ఇంకా ఎవరినైనా అడిగి తెలుసుకుంటాను….”అంటూ లేచాను.
“ఆ అమ్మయి దెగ్గరకు నిన్ను ఎవ్వరు తీసుకెళ్లరు ….నువ్వు వచ్చిన దార్లో వెళ్లడం మంచిది…”అన్నాడు. నాకు దుఃఖం కోపం కలగలిసి పోయి “ప్లీజ్…………15 రోజుల నుండి ట్రై చేస్తున్నాను….వెదుక్కుంటూ ఇంత దూరం వొచ్చాను…ఇంక నాకు ఓపిక కూడా లేదు …..దయ చేసి తీసుకెళ్లండి….”అన్నాను కళ్ళు తుడుచుకుంటూ. అతను ఏమి మాట్లాడకుండా అలాగే నిల్చున్నాడు. ఇంక లాభం లేదనుకొని అక్కడ నుండి బయలు దేరబోయాను. “సిరి …ఇక్కడ లేదు….”అన్నాడు వెనకనుండి. నేను దిగ్గున అతని వైపు తిరిగి “ఇక్కడ లేదా…మరి ఎక్కడ ఉంది….అడ్రస్ చెప్పండి చాలు..నేను వెళ్తాను…”అంటూ అడిగాను. మళ్ళి మౌనంగా ఉన్నాడు. ఇంక ఇతనితో లాభం లేదు బయటకెళ్ళి నా ప్రయత్నం నేను చేస్తాను అని అనుకుంటూ బయటకి వెళ్లబోయాను. “సిరి…లేదు….ఈ లోకం లో లేదు…..చచ్చిపోయింది……”అన్నాడు అది చెప్తున్నప్పుడు అతని నోరు బొంగురు పోయింది. “వాట్ట్ట్ట్……………..ఎం మాట్లాడుతున్నారు మీరు….”అని మాత్రం అన గలిగాను. “నిజమే చెప్తున్నా….ఆ అమ్మ చచ్చిపోయింది…ఆ అమ్మే కాదు…ఆ కుటుంబం అంత ఆత్మహత్య చేసుకున్నారు…..”అన్నాడు. నాకు తల తిరిగినట్టయి పక్కనే ఉన్న టేబుల్ మీద కుల పడిపోయాను. సిరి చనిపోయింది అనే మాటలు నా చెవుల్లో మారుమోగి పోతున్నాయి. నా శ్వాసని ఎవరో నొక్కిపట్టినట్టు , మెదడు మొద్దుబారిపోయినట్టు, అలాగే చలనం లేకుండా కూర్చుండి పోయాను.

అతను కుదిపే సరికి ఈ లోకం లోకి వొచ్చాను. నా కళ్ళ నుండి ధారలుగా కన్నీళ్లు, నా ప్రయత్నం ఏమిలేకుండానే. బహుశా అది నా గుండె కార్చిన కన్నీరనుకుంటా. నా మెదడుకి గుండెకి లంకె తెగిన ఫీలింగ్ నాకు స్పష్టంగా తెలుస్తుంది. అతను నా పక్కన కూర్చొని నా బుజం మీద చేయి వేసి. “చూడు బాబు..జరిగిందేదో జరిగిపోయింది…నువ్వు ఇంక ఉరికి వెళ్ళిపో….”అన్నాడు. గొంతు పెగల్చుకొని “ఎలా జరిగింది….”అని అడిగాను. అతను దీర్ఘంగా నిట్టూర్చి, “సిరి నాన్నగారి మంచి తనమే వల్ల పాలిట శాపం అయ్యింది.. అతని స్నేహితులే అతన్ని మోసం చేసారు….బిజినెస్ లో అవసరం అని అందరి దెగ్గర అప్పు చేయించారు అతనితో …తర్వాత చేతులెత్తేశారు ….తనను నమ్మి డబ్బులు ఇచ్చిన వారికి ముఖం చూపించలేక …తాను చనిపోతే కుటుంబం కూడా ఛీత్కారాలు ఎదురుకోవాల్సి వొస్తుందని….అందరు కలిసే నిర్ణయం తీస్కొని ఆత్మ హత్య చేసుకున్నారు ఉత్తరం రాసి…’అంటూ ఆపాడు తను. నాకు అర్ధం అయ్యింది. సిరి కి ముందే తెలుసు చనిపోతున్నాను అని. అందుకే చివరి సారి కలిసినప్పుడు, తన బిహేవియర్ లో తేడా.నేనెందుకు పసి గట్టలేకపోయాను, తనని నిలదీయాల్సింది. నిజం చెప్పేవరకు వొదలాల్సింది కాదు. నా మీద ఒట్టు పెట్టించైనా నిజం చెప్పించాల్సింది. నేను తనని ప్రేమించాల్సినంత ప్రేమించలేదా…..ఇలా పరి పరి విధాలుగా నా మనసులో ఆలోచనల ఝరి ముసురుతుంటే, “నాకు సిరిని చూడాలని ఉంది….”అన్నాను గొంతు పెగల్చుకొని. నా మాటకు అతను నివ్వెర పోతూ, “చెప్పాను కదా బాబు…..ఆ అమ్మ చనిపోయిందని….”అన్నాడు. “తను ప్రస్తుతం ఉన్న చోటికి తీసుకెళ్లండి…”అన్నాను. అతను అర్ధం కానట్టుగా నా వైపు చూశాడు. “నన్ను….నన్ను… తన సమాధి వద్దకు తీసుకెళ్లండి….కనీసం ఈ సహాయం ఐన చేయండి….”అన్నాను దుఃఖంతో గొంతు మూసుకుపోతుంటే, అర్థిస్తున్నట్టుగా. అతను ఏమనుకున్నాడో ఏమో లేచి నిల్చొని “పద….”అన్నాడు.
శక్తి నంత కూడదీసుకుని అతన్ని అనుసరించాను. దారి పొడవునా నాకు ఎలాంటి ఆలోచనలు లేవు. మెదడు మొద్దు బారి పోయింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతన్నే అనుసరించాను ఊరి చివర వరకు. స్మశానం దరిదాపుల్లో తల యెత్తి చూసాను.
ఆకాశంలో మబ్బులు ముసురుకుంటున్నాయి. ఏ క్షణంలో ఐన వర్షం స్టార్ట్ అయ్యేట్టుగా ఉంది. ఆకాశంలో మెరుస్తున్న మెరుపులకి, సమాధులు వింతగా వెలిగిపోతున్నాయి, ఇప్పుడు ఈ స్మశానం నా ప్రేయసి నివాసం…. నా ప్రేయసి ఇల్లు…మొదటి సారి నా ప్రేయసి ఇంటికి వెళ్తున్నాను. అదీ ఉట్టి చేతుల్తో వెళ్తున్నాను…ఆకాశంలో మెరుపులు ఎక్కువ అయ్యాయి, తెలిసున్న ఇంటికి తీస్కెళ్లిన్నట్టుగా వడి వడిగా అతను సమాధి వైపు తీసుకెళ్తున్నాడు. మెల్లిగా వర్షం స్టార్ట్ అయ్యింది. సమాధి దెగ్గర అవుతున్న కొద్దీ, అతని అడుగుల వేగం తగ్గింది. అతను ఒక చోట ఆగి వెను తిరిగి చూసాడు. అది సిరి దే అని అర్ధం అయ్యేసరికి, నా అడుగు ముందుకు పడలేదు. ఎక్కడో పిడిగుపడిన శబ్దం. పెద్ద మెరుపు…ఆ మెరుపులో సమాధి దేదీప్యమానంగా వెలిగింది కొన్ని క్షణాలపాటు. నేను ఆపాదమస్తకం వొణికిపోయాను. ఏ శక్తి నన్ను సమాధి వరకు లాక్కెలిందో తెలియాదు కానీ, సమాధి ముందు, మోకాళ్ళ మీద పడిపోయాను. ఈ పదిహేను రోజుల నా వేదనంత కన్నీటి రూపంలో బయటకు వొస్తుంది. వర్షానికి కూడా ఏడ్పుపొచ్చిందేమో వర్షం జోరు అందుకుంది.
వర్షం నీటితో నా కన్నీరుని కూడా కలగలిపి, నా ప్రేయసి సమాధిని అభిషేకిస్తున్నాను, మనసులో ఏ ఫీలింగ్ లేదు….తన వొడిలో తలపెట్టినట్టుగా…సమాధి పైన తల ఆనించాను. ఎదో తెలియని ప్రశాంతత…తన వొడిలో పడుకున్న ఫీలింగ్…..అలా ఎంత సేపు పడుకున్నానో తెలియదు…అతను బుజం తట్టి లేపాడు. అమ్మ వొడిలో ప్రశాంతంగా పడుకున్న చిన్న పిల్లోడిని లేపితే ఎలా ఉలిక్కిపడి లేస్తాడో…అలా ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. అప్పటివరకు, సిరి చేతులు నా తల మీద సున్నితంగా నిమురుతున్న భావన…
“బాబు.. లే….వర్షం పెద్దదయింది….ఇంక పద…”అన్నాడు అతను కూడా కళ్ళు తుడుచుకుంటూ. చిత్రంగా నా కళ్ళలో కన్నీళ్లు కూడా ఇంకి పోయాయి…గుండె బీటలు పడుతున్న ఫీలింగ్…ఇంక అక్కడ ఉండలేకపోయాను….చివ్వున లేచి….వడి వడిగా అతనికంటే ముందే బయలు దేరాను….కర్కోటకుడిలా…మళ్ళి వెను తిరిగి కూడా చూడకుండా ముందుకు కదిలాను….వెను తిరిగి చూస్తే నేను అక్కడనుండి కదలడం అసంభవం….
ఊర్లోకి వొచ్చే రాగానే…..బస్సు రెడీ గా ఉంది…..అతనికి మాట మాత్రం కూడా చెప్పకుండా బస్సు ఎక్కాను. అతను అర్ధం చేసుకున్నవాడిలా…..విండో సైడ్ వొచ్చి…ఆప్యాయంగా నా బుజం పై చేయి వేశాడు. అతని కళ్ళలోకి చూసాను..బస్సు కదిలింది…..నేను కళ్ళు మూసుకున్నాను…..
ఇంట్లో వొస్తున్న నా వైపు అమ్మ ఆందోళనగా చూసింది. అప్పుడు గాని నా వైపు నేను చూసుకోలేదు. డ్రెస్ మొత్తం దుమ్ము పట్టిపోయింది. అమ్మ కళ్ళలోకి చూడలేక, వడి వడిగా బాత్రూం లోకి దూరి తలారా స్నానం చేశాను. సరాసరి దేవుని రూమ్ లోకి వెళ్ళిపోయాను. నాకు ఊహ తెలిసినప్పటినుండి నేను పెద్దగా దేవుని రూమ్ లోకి వెళ్ళింది లేదు. దేవుని పటం ముందు కులపడిపోయాను. చిత్రంగా, సిరి సమాధి ముందు కులపడినట్టుగానే. కళ్ళలో కన్నీటిపొర, ప్రమిద వెలుగులో దేదీప్యమానంగా వెలుగుతున్న దేవుని పటం వైపు చూసాను. అచ్చంగా, ఆకాశంలో మెరిసిన మెరుపులకి వెలిగిన సిరి సమాధిలా వెలిగిపోతుంది
దేవుని రూంలో నుండి వొస్తున్న నన్ను అయోమయంగా చూసింది అమ్మ. ఏమి మాట్లాడకుండా వెళ్లి సోఫా లో కూర్చున్నాను. అమ్మ వొచ్చి పక్కన కూర్చోగానే, వడిలో తల పెట్టి పడుకొని కళ్ళు మూసుకున్నాను. అమ్మ వొడిలో, సిరి సమాధి మీద, దేవుని ముందు అన్ని చోట్ల ఒకేలాంటి భావన. నన్ను నేను మరిచిపోయిన భావన. అమ్మ ఏమి మాట్లాడకుండా, తల మీద చేయి పెట్టి జుట్టుని రాస్తుంటే నిద్రలోకి జారుకున్నాను.
అమ్మ లేపుతుంటే ఉలిక్కిపడి లేచాను. ఎదురుగ నాన్న, విశాల్ ఉన్నారు. నాకేమైంది అన్న కంగారులో నాన్నను, విశాల్ ను పిలిచినట్టుగా ఉంది అమ్మ. వాళ్ళ అందర్నీ చూడగానే నా దుఃఖం కట్టలు తెంచుకుంది. ఆందోళనగా వాళ్ళు వచ్చి నన్ను పట్టుకున్నారు. కొంచెం కోలుకున్నాక జరిగిందంతా వాళ్ళకి చెప్పాను. అమ్మను ఊరడించడం కొంచెం కష్టమే అయ్యింది మాకు.
అదే రోజు సాయంత్రం నేను బెడ్ మీద పడుకొని ఉన్నాను, అమ్మ వొచ్చి నన్ను లేపి ఒక లెటర్ చేతిలో పెట్టి “నీ బెడ్ మార్నింగ్ క్లీన్ చేస్తుంటే, బెడ్ కింద ఈ లెటర్ దొరికిందిరా…సీల్ చేసి ఉంది అని నేను విప్పలేదు.”అంటూ నా చేతిలో పెట్టి అమ్మ వెళ్ళిపోయింది. కవర్ అటు ఇటు తిప్పి చూసాను. ఏంటిది అనుకుంటూ కవర్ ఓపెన్ చేశాను. ఆ చేతి రాత చూసి నా చేతులు వొణికాయి. అది సిరి చేతి రాత. సిరి చేతి రాత ముత్యాల్లా ఉంటుంది. నా కళ్ళు ఆ లెటర్ వెంట పరుగులు తీశాయి.

1 Comment

Comments are closed.