టైం మెషిన్ – Part 2 97

తన పని ఇంత సులువుగా అవుతుందని అనుకోలేదు మల్హోత్రా.
వెళ్ళి అది ఒక్కటే తీసుకుంటే అనుమానం కలుగుతోంది అనిపించి.
ప్రాజెక్ట్ బ్లూప్రింట్, ట్రిగ్గర్, ట్రిగ్గర్ నమూనా, ఇంకా కొన్ని వస్తువులు తీసుకుని బయల్దేరాడు. గుమ్మం దాటుతుండగా “ఆగు..” అన్న రిచర్డ్స్ పిలుపుకు ఠక్కున ఆగిపోయాడు.
“వాటిని ఇలా తీసుకురా” అన్నాడు రిచర్డ్స్.
భయంగానే ఆ బ్యాగ్ ని రిచర్డ్స్ ముందు పెట్టి ఒక్కొక్క వస్తువుని బయటకు తీస్తున్నాడు మల్హోత్రా.
వాటిలో ఒక వస్తువు మాత్రం రిచర్డ్స్ కళ్ళని ఆకర్షించింది.
“అదేంటి?” అన్నాడు రిచర్డ్స్.
“సార్ ఇది ట్రిగ్గర్” భయంగానే చెప్పాడు మల్హోత్రా.
దీని గురించి అబద్ధం చెప్పొచ్చు అది ఎంత ప్రమాదకరమో మల్హోత్రాకి ఎవరూ చెప్పవలసిన అవసరం లేదు. అందుకే తెగించి నిజం చెప్పేశాడు.
“ఓహ్.. ట్రిగ్గర్ అంటే ఇదేనా? దీని వల్ల అనుకుంట కదా పని మొత్తం ఆగిపోయింది అని చెప్పావ్?” అన్నాడు రిచర్డ్స్ దాన్ని పరీక్షగా చూస్తూ..
“హా అవును సర్.. అందుకే అక్కడ దీన్ని పరీక్షిద్దాం అని తీసుకు వెళ్తున్నాను సర్” ఒక అబద్దాన్ని నమ్మకంగా చెప్పడానికి ప్రయత్నించాడు.
“నో నో నో.. ఇంత ఇంపార్టెంట్ వస్తువు అక్కడికి ఎందుకు? రీసెర్చ్ అయ్యాక ఇక్కడే ఏమైనా ఉంటే చేద్దువుగాని. లీవ్ ఇట్ హియర్.” అంటూ ట్రిగ్గర్ తీసేసుకున్నాడు రిచర్డ్స్.
మల్హోత్రా గుండెల్లో బాంబులు పేలాయి. అది లేకుండా తన జర్నీ అసాధ్యం. గుండె చిక్కబెట్టుకొని “అక్కడికి తీసుకెళ్తే ఏమైనా పని చేసేది లేనిది తెలుస్తుంది కదా అని” అంటూ మంద్ర స్వరంతో నసిగాడు మల్హోత్రా.
“వాట్ మల్హోత్రా? మెషిన్ లేనప్పుడు ఇక పని చేసేది లేనిది నీకెలా తెలుస్తుంది? అక్కడ నిర్మిస్తావా మెషిన్?” రిచర్డ్స్ నవ్వుతూ అడిగినా అందులో నిగూఢ అర్ధం మల్హోత్రా గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.
“అది కాదు సర్..” అంటూ మల్హోత్రా ఏదో చెప్పబోయేంతలో “మల్హోత్రా.. జస్ట్ షటప్ అండ్ లీవ్ విత్ దోస్ థింగ్స్.” అనేసి సిగార్ ఒక్క దమ్ము లాగి కళ్ళు మూసుకున్నాడు.
ఇక రిచర్డ్స్ కి చెప్పడం తన వల్ల కాదని స్పష్టం అవుతోంది. అందుకే నిరాశగా బయటకి నడుస్తున్నాడు నిస్సత్తువగా ఒక్కో అడుగు వేస్తూ.
“మల్హోత్రా.. జస్ట్ ఏ మినిట్” అన్న రిచర్డ్స్ మాటకు మల్హోత్రా ఏంటి అన్నట్టు వెనక్కు తిరిగి చూసాడు.
“వెళ్ళే ముందు ఒక్కసారి మెషిన్ ని టెస్ట్ చేసి వెళ్ళండి.” అంటూ ట్రిగ్గర్ కాళ్ళ ముందు ఉన్న టీపాయ్ మీద పెట్టి మల్హోత్రా వంక చూసాడు.
మల్హోత్రా నడుస్తూ వస్తున్నాడు కానీ గుండెల్లో దడా వణుకు వడా పునుకు మొదలైపోయింది.
ఆ ట్రిగ్గర్ తీసుకుని మెషిన్ ఛాంబర్ లోనికి వెళ్ళిపోయాడు.
మల్హోత్రా లోపల విపరీతమైన భయంతో నిలబడి ఉన్నాడు.
ఇంతలో రిచర్డ్స్ గొంతు “రెడీ మల్హోత్రా.. 3.. 2.. 1.. స్టార్ట్” అని కర్కశంగా వినిపించింది.
మల్హోత్రాకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అన్యమనస్కంగానే “yeah.. రెడీ సర్” అన్నాడు.

ఇంతలో మల్హోత్రా మెదడులో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తన దగ్గర ఉన్న ట్రిగ్గర్ నమూనా అక్కడ పెట్టి మెషీన్ లాంచ్ చేసాడు.
రిచర్డ్స్ తో పాటు అతని టీం మొత్తం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు.
మెషీన్ లోంచి “initialisation.. 10.. 9.. 8..” అంటూ అనౌన్స్.మెంట్ రాసాగింది.
అందరికీ వట్టలు స్ట్రక్ అయిపోయాయి.
“0.. మిషన్ ఫెయిల్డ్” అన్న సిస్టం మాటలకు అందరూ జావ కారిపోయారు.
“ఓకే మల్హోత్రా.. యూ మే గో నౌ” అన్న రిచర్డ్స్ మాటలు మల్హోత్రా చెవిలో అమృతం పోసినట్టు వినిపించాయి.
క్షణం ఆలస్యం చేయకుండా తనకి కావలిసిన ట్రిగ్గర్ తో సహా నిమిషాల మీద బయట పడ్డాడు మల్హోత్రా.
తర్వాత ఠాగూర్ తనని వాళ్ళ అబ్బాయి హర్ధిక్ ని కలవమని చెప్పాడు.
ఇంతలో బస్సు సడన్ బ్రేక్ పడటంతో మల్హోత్రా తన ఆలోచనల సుడిలోంచి బయటకు వచ్చాడు.
బస్సులోకి పది మంది సెక్యూరిటీ ఆఫీసర్లు హుటాహుటిన లోపలికి వచ్చి మల్హోత్రాని ఏం మాట్లాడానివ్వకుండా వెంటనే తమ అదుపులోకి తీసుకుని జీప్ లోకి ఎక్కించి తీసుకుపోయారు.
కానీ రిచర్డ్స్ తన నీడని తానే నమ్మడు అలాంటిది మల్హోత్రా మాటలు ఎందుకు నమ్ముతాడు? అందుకే చంపడంలో అరితేరిపోయిన షబ్నం చేతికి మల్హోత్రాని అప్పగించాడు.
మల్హోత్రా తనకి అత్యంత అవసరమైన మనిషి కనుక అతన్ని తప్ప అతను కలిసిన ప్రతి వ్యక్తినీ పరలోకానికి పంపి అతను ఇచ్చిన ప్రతి వస్తువును సేకరించడం ఆమె కర్తవ్యం.
ఆ పనిలో భాగంగానే హర్ధిక్ వద్ద నుండి ఆమె ఆ ఫైల్స్ పట్టుకుపోయింది.
కానీ ఆమె చేసిన తప్పల్లా హర్ధిక్ మీద జాలిపడి వదిలెయ్యడం.
ఎందుకంటే తెలివైన హర్ధిక్ మల్హోత్రా ఇచ్చిన ముఖ్యమైన ట్రిగ్గర్, ఇంకా కొన్ని పత్రాలను తన సూట్ రూమ్ లాకర్ లో ముందుగానే భద్రపరిచాడు.
అది తెలియని షబ్నం తనకి దొరికిన వస్తువులు మాత్రమే అతని దగ్గర ఉన్నాయని భ్రమపడి అవి తీసుకుని వెళ్ళిపోయింది.
షబ్నం ఎక్కిన కారు భాంద్రలోని ఒక ఖరీదైన విల్లా ముందు ఆగింది. అందులోంచి మరొక నలుగురు అగంతకులతో కలిసి షబ్నం లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ ఈజీ చైర్ లో వెనక్కు వాలి కూర్చున్నాడు రిచర్డ్స్ రైట్ హ్యాండ్ స్టీఫెన్.
“తీసుకొచ్చావా?” డైరెక్ట్ గా మేటర్ లోకి వచ్చేసాడు స్టీఫెన్. అతనెప్పుడూ అంతే. ఏం కావాలన్నా నిర్మొహమాటంగా అడిగేస్తాడు. ఆన్సర్ అయినా అమ్మాయ్ అయినా.
“మిషన్ అకంప్లిష్డ్..” అంటూ హర్ధిక్ ని వదిలేసిన విషయం దాచిపెట్టి తాను తెచ్చిన వస్తువులను టేబుల్ మీద పరిచింది.
స్టీఫెన్ వాటిని ఒకసారి పరిశీలించి రిచర్డ్స్ కి కాల్ చేసాడు.
రిచర్డ్స్ కాల్ అటెండ్ చేసి ” ఏమైనా చెప్పాలా?” అన్నాడు.
“నో సర్.. ఎవ్రిథింగ్ ఫైన్”
“కానీ తను సౌరవ్ కొడుకును ఎందుకు కలిసాడు?”
“అదొక్కటే డౌట్ సర్. నథింగ్ సస్పిషియస్”
“ఓకే ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇమ్మిడియట్ గా ఇంఫార్మ్ చెయ్.” అంటూ ఫోన్ పెట్టేసాడు రిచర్డ్స్.
హర్ధిక్ కొంచెం సేపటికి కళ్ళు తెరిచి స్పృహలోకి వచ్చాడు. చుట్టూ చూసాడు. రూమ్ మొత్తం చిందరవందర గందరగోళంగా ఉంది. మెల్లిగా పైకి లేవడానికి ప్రయత్నించాడు. తల మొత్తం దిమ్ముగా అనిపించింది.
“పూకు ముండ ఎంత దెబ్బ కొట్టింది. దొరికితే చెప్తాను దాని సంగతి” అనుకుంటూ పైకి లేచి సోఫాలో కూలబడి ఒక దమ్ము వెలిగించాడు. టీపాయ్ మీద స్కాచ్ బాటిల్ నా సంగతి ఏంటి అన్నట్టు వెక్కిరిస్తూ నిలబడింది.
వెంటనే దాన్ని తీసి రెండు పెగ్గులు లోపలికి పోనిచ్చాడు. ఇప్పుడు కొంచెం బెటర్ గా అనిపిస్తుంది హర్ధిక్ కి.
ఎవరో తనని ఫాలో అవుతున్నారన్న విషయం హర్ధిక్ కి అర్ధం అయ్యింది. ఎలా అయినా ఇక్కడి నుంచి బయట పడాలి అనుకున్నాడు. కానీ తను సేఫ్ గా ఉండాలంటే ఎక్కువ సేపు ప్రయాణం చెయ్యకూడదు.

ఎందుకో హర్ధిక్ కి ఇందులో తనకి తెలియని విషయాలు, వలయాలు చాలా ఉన్నాయ్ అనిపించింది. ఇక నుంచి ఏం ప్లాన్ చేసినా పకడ్బందీగా అమలు చేయాలని మాత్రమే అనుకున్నాడు.
అతని మనసులో ఉన్నది ఒకటే విషయం. అమ్మాయిని పనిలో కలపకూడదు. ఒక్కసారి సేఫ్టీ లాకర్ ఓపెన్ చేసి తాను భద్రం చేసిన వస్తువులను చూసుకున్నాడు. అన్నీ సేఫ్ అనుకుని లాకర్ క్లోజ్ చేసి కొంచెం మందు కొట్టి పడుకున్నాడు. పొద్దున్నే లేవాలి అనుకుంటూ.
*********
మల్హోత్రా ఉదయాన్నే ఢిల్లీలో ఫ్లైట్ దిగి తన స్వస్థలమైన నోయిడా పక్కనే ఉన్న ఒక చిన్న పల్లెటూరికి ప్రయాణమయ్యాడు.
ఎయిర్పోర్టు బయట ఉన్న ఒక టాక్సీలో తన ఊరికి చేరుకున్నాడు.
చాలా సంవత్సరాల క్రితం వదిలేసిన ఊరు..
బాగా మారింది అనుకుంటూ ఊరి పరిసరాలను గమనిస్తూ ఊళ్ళోకి ప్రయాణిస్తున్నాడు. తాను అక్కడ ఉండేటప్పుడు అక్కడ కనిపించే ప్రదేశాలన్నీ ఇప్పుడు చాలా కొత్తగా ఉన్నాయి.
ఎంత ప్రయత్నిస్తున్నా తను ఉండే ప్లేస్ గుర్తురావడంలేదు. డ్రైవర్ కూడా ఊరి చుట్టూ చక్కర్లు కొట్టి కొట్టి విసుగ్గా మల్హోత్రా వైపు చూసాడు.
అతనిలో వస్తున్న విసుగు గమనించిన మల్హోత్రా ఒక సెంటర్ దగ్గర ఆపమని దిగి డబ్బులిచ్చి పంపించేసాడు.
ఆ ఊరి జనం మల్హోత్రా ఎవరా అని చూడసాగారు.
మల్హోత్రాకి అక్కడ ఎవరిని ఏమని అడగాలో కూడా తెలియట్లేదు. నిలబడి చూస్తున్నాడు. ఇంతలో వెనక నుంచి “రహీమ్ చాచా..” అని పిల్లలు అరుస్తున్నారు.