చేసే పనేమీ లేకుండా ఒంటరిగా ఇక్కడ ఉండడం నాకు నచ్చడం లేదు. నాకు ఇప్పుడు ఆకలి వేస్తుంది. తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని వెతకాలి. నా వస్తువులని చెక్ చేసాను. నాకు ఈ ద్వీపం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేవరకు నా దగ్గర ఇంకొన్ని ఆయుధాలు ఉంటే బావుండునని అనిపించింది. నాకు కొన్ని బాణాలు కావాలి. నేను డాక్ కి వెళ్లి మోటార్ యచ్ లోపలికి వెళ్లాను. డెక్ మీద టేకు ఫ్లోరింగ్ వుంది. చాలా సన్ లాంజులు వరుసగా వున్నాయి. పెద్దగా వున్న అవుట్ డోర్ లాంజ్ సీట్లు, మీడియం సైజు వున్న హాట్ టబ్ అక్కడ వున్నాయి. మెయిన్ సెలూన్ లో ఒక సోఫా, కొన్ని కుర్చీలు, కాంతి లోపలికి రావడానికి వీలుగా వున్న కిటికీలు వున్నాయి.
నేను మెట్లు దిగి కింగ్-సైజ్ మంచం, ప్రైవేట్ లాంజ్ ఏరియా, స్పా లాంటి బాత్ రూముతో ఉన్న మాస్టర్ సూట్లోకి వెళ్లాను. “వావ్,” అని అనుకోకుండా ఉండలేకపోయాను. నేను అలవాటు పడిన యాచ్ లాగే ఇది కూడా అలాగే వుంది. అయితే నాణ్యత చూసి నేను ఆశ్చర్యపోయాను.
నేను హెల్మ్ దగ్గరికి వెళ్లి సీటులో కూర్చున్నాను. ఇక దీన్ని స్టార్ట్ చేసి నడిపిద్దామని అనుకున్నాను. స్టార్ట్ బటన్ నొక్కగానే ఇంజిన్ నిశ్శబ్దంగా గర్జించింది. నా దగ్గర వున్న మ్యాప్ లాంటిదే ఒక స్క్రీన్ కనిపించింది. మధ్యలో వేరే వాటి కంటే కొంచెం పెద్దగా ఉన్న మెరిసే ద్వీపం ఒకటి కనిపించింది. నేను దానిని తాకాను. తాకగానే అద్భుతమైన అక్షరాలూ వున్న ఒక బాక్స్ వచ్చింది. “రసఖండం…. పెద్ద వ్యాపారం జరిగే అత్యంత రద్దీగా ఉండే ద్వీపాలలో ఒకటి.”
నాకు అక్కడ తినడానికి ఏదో ఒకటి దొరుకుతుందని అనిపించింది. నేను మళ్ళీ ద్వీపం పేరుమీద నొక్కాను. వెంటనే నా ద్వీపం నుండి రసఖండ ద్వీపం వరకు ఒక ఎర్ర గీత ఏర్పడింది. ఆ ద్వీపానికి అది దారి చూపిస్తున్నట్లుగా అనిపించింది. నేను నా యాచ్ ని సులభంగా కొద్దీ దూరం నడిపించాను. నా వేళ్ళు దురద పెడుతున్నాయి, అక్కడ ఏముందో తెలుసుకోవాలని అనిపించింది.
వేగం సున్నితంగా, శక్తివంతంగా ఉంది. నేను స్పీడ్ పెంచే కొద్దీ, గాలి నా జుట్టుని ఎగరేస్తుంది, వేగం నాకు స్వేచ్చని ఇచ్చినట్లు అనిపించింది. అందుకే నేను మోటార్ బోటులతో ప్రేమలో పడిపోయాను. మీరు వేరే దేనితోనూ ఈ స్వేచ్ఛని అనుభవించలేరు. నేను అలల మీదుగా ప్రయాణం చేస్తున్నాను, నా వెనుక ఇంజిన్ మోత వినిపిస్తుంది. నా పైన సీగల్స్ గుంపు ఎగురుతూ కనిపించింది, నేను అలలను చీల్చుకుంటూ వెళ్లడంతో నా స్పీడుని అందుకోలేక అవి వెనకబడిపోయాయి.
“ఒహ్హ్ దేవుడా, ఇది చాలా వేగంగా వెళుతుంది,” అని నేను సముద్రం మీదుగా ప్రయాణిస్తూ నాతో నేను చెప్పుకున్నాను. కరెంటుతో నడుస్తున్నప్పటికీ, అది నేను అనుకున్నదానికన్నా చాలా శక్తివంతమైందని తెలిసింది.
***
వేగాన్ని తగ్గించి, నా వస్తువుల అరలోనుండి బైనాక్యూలర్స్ మీద ద్రుష్టి పెట్టగానే అవి నా చేతిలో ప్రత్యక్షమయ్యాయి. కళ్ళకి ఆనించుకుని చూసినప్పుడు, నాకు రసఖండ ద్వీపం కనిపించింది. నా అంచనా ప్రకారం నేను బయలుదేరి రెండు గంటలు లోపు అయివుంటుందని అనుకున్నాను. ఈ ప్రయాణం అద్భుతంగా వుంది. దారిలో కొన్ని ద్వీపాలని దాటుకుంటూ వచ్చాను. సరుకులతో నిండిన ఎక్కువ సంఖ్యలో వున్న పడవలు కనిపించాయి. వాటిలో చాలా తక్కువ మంది మగాళ్లు ఉన్నారు, నేను వాళ్ళ పక్కనుండి వెళుతున్నప్పుడు వాళ్ళందరూ నావైపు చూసారు. గహన ఇంతకుముందు నాకు చెప్పింది గుర్తుకొచ్చింది అయితే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని నేను అనుకోలేదు.
హోరైజన్ వెనకనుండి ఏర్పడిన పెద్ద నీడని జూమ్ చేసి చూసాను. ఆ ద్వీపం చాలా పెద్దగా వుంది, జీవంతో నిండి వుంది. నేనున్న దూరం నుండి చీమల పుట్టలా కనిపించింది. నేను డాక్ చేయడానికి వెళ్లాను.
నేను యాచ్ ని సులభంగానే డాక్ చేసాను. తన చిన్న చెయ్యిని ఊపుకుంటూ నావైపు పరిగెత్తుకుని వస్తున్న ఒక మరగుజ్జు అమ్మాయిని చూసాను. “నావైపు తాడు విసిరేయండి” అని ఆమె చెప్పింది.
“ఆగండి” అని ఆమెకి చెప్పి, నేను డాక్ మీదకి వెళ్లి తాడు తీసుకుని ఆమె వైపు విసిరాను. ఆమె దానిని అందుకుని వెంటనే దగ్గరున్న క్లీట్ కి ఆ తాడుని కట్టి నాకు థమ్స్-అప్ సైగ చూపించింది.
నేను డాక్ మీదకి దిగి ఆ చిన్న మరగుజ్జుకి తల ఊపి నమస్కారం పెట్టాను. నేను ఆమె కన్నా పొడవుగా ఉండడం చూసి ఆమె కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి.
“మీరు చాలా పొడవుగా వున్నారు…….. ఇంకా మీరు మగవ్యక్తి” అని ఆమె నమ్మలేనట్లు చెప్పింది.
నేను కూడా ఆమెని పరిశీలించి చూసాను. ఆమె ముఖం మాయాజాలంతో మెరుస్తున్నట్లు అనిపించింది. ఆ మెరుపు నన్ను చాలా అందమైన పరధ్యానంలోకి నెట్టింది. ఆమె పేదరికాన్ని తెలియజేస్తున్నట్లు వేసుకున్న బట్టలు అక్కడక్కడా చిరిగిపోయాయి. అయితే ఆమె నిష్కళంకమైన చర్మం, గుండ్రంగా వున్న ముఖంతో అందంగా కనిపించింది. ఆమె జుట్టు ఎర్రగా వుండి మెరుస్తుంది. ఆమె ఇంకొన్ని అడుగులు పొడుగ్గా వుండి ఉంటే, నేను ఆమెతో ప్రేమలో పడేవాడిని. “మీరు ఇక్కడ పని చేస్తారా ?” అని నేను ఆమెని అడిగాను.
ఆమె తలూపి తన జుట్టుని చెవుల వెనక్కి నెట్టింది. “అవును,” అని ఆమె తన చూపుని మరల్చుకుంటూ వినయంగా అంది.
“దీనిని ఇక్కడ డాక్ చేయడానికి ఎంతివ్వాలి ?”
“ఎంత కాలం ?” అని కలవరపడుతూ ఆమె అడిగింది.
ఆమె ముఖాన్ని చూస్తుంటే, ఆమెకి నన్ను చాలా ప్రశ్నలు అడగాలని అనిపిస్తుందని, అయితే అడిగే ధైర్యం చేయలేకపోతుందని అర్ధమైంది.
“మూడు గంటలు అనుకుంటున్నాను” అని చెప్పాను. వెతుక్కొని తినడానికి, ఇంకా ఈ ప్రపంచం గురించి నాకు వస్తున్న అనుమానాల్ని తీర్చే మనిషిని కనుక్కోవడానికి ఆ సమయం సరిపోతుందని అనుకున్నాను.
“రెండు వెండి ఔన్సులు,” అని ఆమె అంది.
నేను ఈ ప్రపంచానికి కొత్తవాడినైనా, ధరల విషయంలో నాకు మంచి అవగాహన వుంది. ఆమె ఎంత భయపడుతుందో గమనిస్తే, ఆమె నన్ను మోసం చేస్తుందని నేను అనుకోలేదు. బ్లూ రింగ్ మీద దృష్టి పెట్టగానే నా ముందు బ్లూ స్క్రీన్ వచ్చింది. నేను వాలెట్ ని ఎంచుకుని, నా కుడి చేతిలో ప్రత్యక్షమైన రెండు ఔన్సుల వెండిని ఎంచుకున్నాను. నేను వాటిని ఆమెకి ఇవ్వగానే ఆమె వినయంగా వంగి నమస్కరించింది.
“ఎంత గౌరవం” అని ఆమె నమ్మలేనట్లు చెప్పింది.
“నాతో రండి, నేను మిమ్మల్ని గేట్ నుండి లోపలికి పంపుతాను” అని ఆమె నన్ను గేటు దగ్గరికి తీసుకెళ్లి, తన దగ్గరున్న తాళంచెవులలో ఒకదానితో గేటుని తెరిచింది. తాను పక్కకి తప్పుకుని, నన్ను ముందుగా వెళ్ళనిచ్చింది.
