మేము ఆయుధాల దుకాణాల దగ్గరికి చేరుకున్నాము, అయితే ఆమె వెనకనే ఉండిపోయింది. “నన్ను క్షమించండి, నేను ఆయుధాల్ని చూడలేను.”
“మీ సమయాన్ని నాకోసం వాడినందుకు ధన్యవాదాలు, మీరు ఏదైనా పని తొందరలో ఉన్నారా ?” అని ఆమెని అడిగాను. నేను ఆమెకి గుడ్ బై చెప్పడానికి రెడీగా వున్నాను అయితే ఆమె చూపులు ఇంకా ప్రవర్తన నా దృష్టిని ఆకర్షించాయి. అందుకే ఆమెని ఆ ప్రశ్న అడిగాను.
“ఊ-హు,” అని ఆమె అంది. ” నిజానికి నేను ఇంటికి వెళ్తున్నాను.”
“మీరు ఇంకొంచెంసేపు ఇక్కడే వుండగలరా ? నాకు కొంచెం అదనపు సహాయం అవసరం అవుతుందని అనుకుంటున్నాను” అని ఆమెని అడిగాను.
ఆమె బుగ్గలు గులాబీ రంగులోకి మారాయి. “తప్పకుండా.”
“ఒక నిమిషం ఇవ్వండి,” అని అన్నాను.
నేను బాణాలు అమ్మే దుకాణాలకి వెళ్లాను. అక్కడ చాలామంది అమ్మాయిలు చక్కటి నాలుగు పలకల కండరాలతో దృఢంగా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే నాకు మంత్రగత్తెలు గుర్తుకొచ్చారు. దాదాపు చట్టబద్ధమైన వయస్సులో ఉన్న ఒక అమ్మాయి మీద నా కళ్ళు నిలిచాయి. ఆమె నాకు కొన్ని సంవత్సరాల క్రితం నేను కలిసిన ఒక జిమ్ అమ్మాయిని గుర్తు చేసింది. ఆమె పెదవుల మీద ఒక చిరునవ్వు చేరింది. ఇక్కడ చాలా మందిలాగే ఆమెకి కూడా ఆ ఆకర్షణీయమైన మెరుపు ఉంది. అది ఏదో ఒక రకమైన మేకప్ కావొచ్చేమో అనిపించింది అయితే నాకు ఖచ్చితంగా తెలియదు, అయితే వాళ్ళని అలా మెరిసేలా చేసేది ఏమిటో అని నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఇంతకుముందు కలిసిన అమ్మాయి, ఇప్పుడు నాకోసం దుకాణం బయట వెయిట్ చేస్తున్న ఆ అందమైన అమ్మాయిని ఖచ్చితంగా అడగాలి అనుకున్నాను.
ఆమె తన రెండు చేతులని కౌంటర్ మీద పెట్టి, వాటిని కలిపి నొక్కింది. దాంతో ఆమె రొమ్ముల మధ్య లోయ మరింత లోతుగా మారింది. అది సూదిని కూడా సులభంగా పట్టుకోగల అద్భుతమైన క్లీవేజ్. “మీరు ఒక విదేశీయుడు.”
“మీకు చాలా చురుకైన కళ్ళు ఉన్నాయి, సులభంగా తెలుసుకున్నారు” అని ఆమెని మెచ్చుకున్నాను.
ఆమె అందమైన ముఖం మీద చిరునవ్వు విరిసింది. “తప్పుగా అనుకోకండి, గుర్తించడం అంత కష్టం ఏమీ కాదు.”
“అంత దారుణంగా ఉన్నానా ?”
“దారుణం అని కాదు, కానీ ఒక పురుషుడిగా, మీరు ఖచ్చితంగా ఇక్కడి వాళ్ళు కాదు” అని ఆమె నన్ను పరిశీలిస్తూ అంది.
“అవును, నన్ను ఇప్పటికే చాలా మంది తలలు తిప్పి చూసారు,” అని నేను ఆలోచిస్తూ చెప్పాను.
“మిమ్మల్ని చూసినప్పుడు, మీరు ఇక్కడివారు కాదు అనిపించేలా ఉన్నారన్నది నిజం. సరే, ఇంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ?” అని ఆమె తన గొంతుని తగ్గించి అడిగింది.
నేను బాణాల వైపు తల తిప్పి చూపించాను. “నాకు కొన్ని బాణాలు కావాలి.”
“ఏ రకం బాణాలు ?” తన గోధుమ రంగు, మెరిసే జుట్టుని తన వేలికి మెలితిప్పుతూ అడిగింది.
నేను వాటిని నిశితంగా పరిశీలిస్తూ వాటిని దేనితో తయారుచేశారని అడిగాను. నేను ఎప్పుడూ వినని కొన్ని చెట్ల తో వాటిని తయారుచేసినట్లు చెప్పింది. ఆమె నాతో కావాలని సంభాషణని పొడిగిస్తుందని నాకు తెలిసింది. నేను వెనుతిరిగి చూసాను. నేను ఇంతకుముందు కలిసిన అమ్మాయి నన్ను చూస్తూ కన్ను కొట్టింది. అన్నిటిని పరిశీలించి నేను సన్నగా వుండి పదునుగా వున్న బాణాలని తీసుకున్నాను. అవి చాలా డేంజరస్ గా అనిపించాయి. బాణాల కొనని తాకొద్దని ఆమె నన్ను హెచ్చరించింది.
“ముప్పై బాణాల ధర ఎంత ?” అని అడిగాను.
మా సంభాషణ చివరికి చేరుకునేసరికి ఆమె తన పెదవిని కొరికింది. “మేము మామూలుగా అయితే ఒక్కో బాణాన్ని అర ఔన్స్ కి అమ్ముతాము. అయితే మీరు నాకు తీపి ముద్దుని ఇవ్వగలిగితే, బదులుగా నేను మీకు అయిదు బాణాలు ఉచితంగా ఇస్తాను” అంది.
నేను ఆమె వైపు చూసి నా కళ్ళు ఆర్పాను. జోక్ చేస్తుందా అని చూసాను. ఆమె సీరియస్ గానే చెప్పిందని అర్ధమైంది. నాకు కొన్ని క్షణాలు నోటి వెంట మాటలు రాలేదు. కొద్దిసేపు అయ్యాక “తప్పకుండా” అని చెప్పను.
“ఇంకో విషయం, మీరు నా చిరునామాని తీసుకుంటే, మీకు ఇంకో అయిదు ఉచితంగా ఇస్తాను” అని ఆమె వినయంగా చూస్తూ చెప్పింది.
“నాకు ఇది మంచి బేరంలా అనిపిస్తుంది” అని చెప్పాను. అయితే ఆమె నన్ను ఆటపట్టిస్తుందా అన్న అనుమానం మరోసారి వచ్చింది. ఆమె ముఖంలో ఎలాంటి భావాలు కనిపించడంలేదు.
ఆమె అక్కడినుండి వెనుతిరిగి చప్పట్లు కొట్టింది. “నేను వాటిని తీసుకొస్తాను” అంది.
నేను నా భుజం మీదుగా వెనక్కి చూసి, ఆ బంగారు రంగు జుట్టు వున్న అమ్మాయిని దగ్గరికి రమ్మని సైగ చేశాను. “ఇక్కడ ముద్దులకి డిస్కౌంట్ ఇవ్వడం మామూలుగానే జరుగుతుందా ?”
ఆమె ఒక కనుబొమ్మ పైకి లేపింది. “అవును, మీలాంటి అందమైన వ్యక్తి అడిగితే ఇస్తారు.”
“OK,” అని అన్నాను.
“నేను మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాలి,” అని ఆమె నన్ను అనుమానంగా చూస్తూ అంది.
“అవునా, నేను కూడా మిమ్మల్ని చాలా అడగాలి,” అని అన్నాను.
