గులాబీ రంగు చనుమొనలతో 10

“నేను మూడు గంటల తర్వాత ఇక్కడ మీకోసం ఎదురుచూస్తుంటాను” అని చెప్పింది.

“తప్పకుండా వస్తాను” అని ఆమెకి చెప్పాను.

నేను చిన్న కొండ మీదకి అనేకమంది అమ్మాయిలని దాటుకుంటూ వెళ్లాను. వాళ్ళందరి అందమైన ముఖాల మీద వున్న లేత మెరుపుని చూసాను. నేను వాళ్ళ పక్కనుండి నడుచుకుంటూ వెళుతున్నప్పుడు వాళ్ళు తమ తలలు తిప్పి నన్ను చూసారు. నేను నా జీవితంలో చూసిన అత్యంత ఆకర్షణీయమైన అమ్మాయిలు వాళ్ళు. వాళ్లలో చాలా మందికి, ఊహించుకున్న ప్రతి రంగులో వుండే మెరిసే జుట్టు పొడుగ్గా మోకాళ్ళ వరకు ఉంది. వాళ్ళు చాలా చిన్న చిన్న బట్టలు వేసుకున్నారు, మినీ స్కర్ట్ లు, క్రాప్ టాప్ లు, ఆకులతో చేసిన చిన్న బికినీల వరకు అన్ని రకాల బట్టలు వేసుకున్నారు. ఆ అందాల సంవృద్ధి, వాళ్ళు నామీద చూపిస్తున్న శ్రద్ద చూసి నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళు నన్ను చూసిన వెంటనే, నన్ను నిశ్చలంగా చూస్తూ, నేను ఎంత అందంగా ఉన్నానో గుసగుసలాడారు. మగాళ్లు ఎక్కడ వుండి ఉంటారని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఇప్పటివరకు నేను చాలా తక్కువమంది మగాళ్లని చూసాను.

కొండ శిఖరాన్ని చేరుకున్నాక, పైన MARKET అని రాసి ఉన్న ఒక తలుపు కనిపించింది. అక్కడినుండి నాకు ద్వీపం మొత్తం కనిపించింది. మధ్యలో అద్భుతమైన దుకాణాలతో సందడిగా ఉండే మార్కెట్ ఉంది. అది అమ్మాయిలతో కిక్కిరిసి ఉంది.

నేను రాతి వీధిలోకి అడుగుపెట్టి దుకాణాల వైపు వెళ్ళాను. చివరికి అక్కడ ఇద్దరు అమ్మాయిలతో వస్తున్న ఒక మగాడు కనిపించాడు. అతని నోరు తెరుచుకుని వుంది. నోటి వెంట ఎంగిలి కారుతుంది. అతను కొంచెం మందబుద్ధి వున్న వాడిలా కనిపించాడు. అతను ఆ అమ్మాయిలకన్నా పొట్టిగా ఉన్నాడు, అతను ఆ అమ్మాయిలని కర్రలుగా వుపయోగించి నడుస్తున్నాడు. ఆ అమ్మాయిలు…… అద్భుతంగా వున్నారు. నేను భ్రమ పడుతున్నానేమో అని కళ్ళు రుద్దుకుని వాళ్ళని చూసాను. అయితే నేను భ్రమ పడడంలేదని తెలిసింది. వాళ్ళు అతనితోనే ఇంకా ఎందుకున్నారు అనిపించింది. లింగ అసమతుల్యత గురించి నాకు గుర్తొచ్చింది. అయితే అది అర్థరహితంగా అనిపించింది. నేను తల ఊపుతూ, నేను ఒక తెలియని ప్రపంచంలో వున్నానని అనుకున్నాను.

నేను అలాగే మార్కెట్ లో ముందుకి వెళ్లాను. నాకు బాణాలు ఇంకా తినడానికి ఏదైనా కావాలి. అక్కడ ఎక్కువగా బట్టలు అమ్మే దుకాణాలే వున్నాయి. వాటిని దాటుకుంటూ వెళ్లాను. విక్టోరియా సీక్రెట్స్ మోడల్ లాగా వున్న పొడవైన, అందమైన ఒక అమ్మాయి దగ్గర ఆగాను. నేను ఆమెని చూడగానే ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. నేను చూస్తుండగానే ఆ సిగ్గు బుగ్గల మీదనుండి, మెడ మీదుగా ఆమె రొమ్ముల వరకు చేరుకుంది. ఆమె అంత అందంగా వున్న అమ్మాయిలతో నేను ఇంతకుముందు గడిపాను. అయితే ఇలాంటి ప్రతిచర్యని నేను ఎప్పుడూ చూడలేదు.

“ఆయుధాలు ఎక్కడ దొరుకుతాయో మీరు నాకు చెబుతారా ?” అని ఆమెని అడిగాను.

ఆమె స్పృహ తప్పి పడిపోయింది, అదృష్టవశాత్తూ ఆమె వెనుక మరొక అమ్మాయి ఉంది, చూస్తున్న బట్టలు వదిలిపెట్టి వచ్చి ఆమెని వెంటనే పట్టుకుంది. “లావణ్యా !” అని ఏడుస్తూ ఆమెని కిందకి దించింది.

ఇంకొక అమ్మాయి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది, ఆమె చిన్న బికినీ తప్ప ఇంకేమీ వేసుకోలేదు. “ఆమె మళ్ళీ ఆ మనిషిని చూసిందా ?”

“అవును… అయితే అతను ఇక్కడే నిలబడి ఉన్నాడు.”

వాళ్లిద్దరూ నా వైపు తిరిగారు, వాళ్ళ కళ్ళు గుండ్రంగా మారాయి. “ఇప్పుడు లావణ్య స్పృహ తప్పి పడిపోయినందుకు ఆమెని తప్పు పట్టాల్సిన అవసరం లేదు,” అని ఆమె అంది.

“ఆమె బాగానే ఉందా ?” అని నేను వాళ్ళని అడిగాను.

“ఆమెకి మెలకువ వస్తుంది, దాని గురించి ఆందోళన పడాల్సిన పని లేదు,” అని పెద్ద అమ్మాయి అంది.

ఒక అమ్మాయిని స్పృహ తప్పేలా చేసినందుకు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది, అందుకే అక్కడినుండి ముందుకి వెళ్లాలని అనుకున్నాను. నేను బంగారు రంగు జుట్టు ఉన్న ఒక అమ్మాయి తాను కొన్న బట్టలని చేజార్చుకోవడం చూశాను. నేను వాటిని తీసి ఆమె భుజాన్ని తట్టాను, ఒకవేళ ఆమె కూడా స్పృహ తప్పితే పట్టుకోవడానికి రెడీగా వున్నాను.

“మీరు ఇది జారవిడుచుకున్నారు” అని ఆమెతో అన్నాను.

ఆమె వెనక్కి తిరిగి నా వైపు చూసింది, ఆమె పెదవులు చిరునవ్వుతో మెలితిరిగాయి. “ఓహ్, ధన్యవాదాలు,” అని తన బట్టలు తీసుకుంటూ చెప్పింది.

“పర్లేదు,” అని నేను ఊపిరి పీల్చుకుంటూ ఆమెతో అన్నాను.

“మీరు ఎక్కడి నుండి వచ్చారు ?” అని ఆమె అడిగింది, ఆమె కళ్ళు ఆసక్తితో మెరిసిపోతున్నాయి.

“అదొక పెద్ద కథ,” అని నేను ఆమెకి చెప్పాను.

“అలా అయితే ఇక్కడ తిరగడం మీకు కష్టంగా ఉండొచ్చు, మీకు ఏదన్నా సహాయం కావాలా ?” అని ఆమె అడిగింది.

“అవును, నాకు సహాయం కావాలి” అని ఆమె ఆహ్లాదకరమైన ముఖాన్ని పరిశీలిస్తూ చెప్పాను. ఆ ముఖంలో నాకు స్నేహభావం తప్ప మరేమీ కనిపించలేదు. ఆమె తన శరీరాన్ని వంటికి గట్టిగా అతుక్కునే బట్టలతో కాకుండా, మామూలు వేసవి బట్టలు వేసుకుంది. ఆమె తన బంగారు రంగు జుట్టుని గాలికి వదిలేసింది. ఆమెకి అందమైన గుండ్రటి ముక్కుతోబాటు అందమైన చిరునవ్వులు కూడా వున్నాయి. ఆమె కళ్ళు ఆమె జుట్టు రంగులోనే వున్నాయి. ఆమె బహుశా ఐదు అడుగుల పది అంగుళాల పొడవు ఉంటుందేమో, కానీ నా కంటే చాలా పొట్టిగా ఉంది.

“నేను బాణాల కోసం ఇంకా తినడానికి కూడా ఏదైనా దొరుకుతుందేమోనని వెతుకుతున్నాను” అని చెప్పాను.

“ఆయుధాలా,” అని ఆమె తనలో తాను గొణుక్కుంటూ వణికిపోయింది. “నాకు ఆయుధాలు అంటే అసహ్యం, అయితే నేను మీకు ఒక సహాయం చేయాలి. రండి.”

ఆమె నన్ను ఆయుధాలు వుండే దుకాణాల వైపు తీసుకెళ్లింది. వీధుల్లో పైకీ కిందకీ తిరుగుతున్న అనేకమంది అమ్మాయిలని మేము తోసుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. అప్పుడే నేను మరో ఇద్దరు మగాళ్లని చూశాను, అయితే వాళ్ళు పనులు చేసే స్థితిలో లేనట్లు కనిపించారు. అయితే నేను ఇంతకుముందు చూసిన మగవాళ్లకంటే వీళ్ళు చాలా బెటర్ అనిపించింది.

“ఇప్పుడు రోజు మొత్తంలో బాగా రద్దీగా వుండే సమయం కాబట్టి కొంచెం ఓపిక పట్టండి” అని చెప్పింది.

“ముందుగా చెప్పినందుకు ధన్యవాదాలు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *