ఫ్రెండ్స్! 828

దేశానికి కాదు..ఆ స్వతంత్రమేదో నాకే వచ్చిందేమో అనిపించింది.
దార్లో నడుస్తుండగా తను నన్ను ఆపి అందరిముందు అడిగింది.
శ్రీ నాకు నోట్స్ కాపీ చేసిపెడతావా.
ఈ 15 రోజుల నోట్స్ ఒక్కసారిగా రాయాలి అంటే నాకు చాల ఇబ్బంది కదా అలాగే ఎగ్జామ్స్ కూడా దగ్గరలో వున్నాయి కదా అంది
నాకు లోపల ఎగిరి గంతెయాలి అని వున్న తమాయించుకొని కొంచెం గంభీరం నటిస్తూ సరే ఎప్పుడు రమ్మంటే అపుడు వస్థనులే అని చెప్పా.
అయితే ఈ సండే రా.మా ఇంట్లో వాళ్ళు మధ్యాహ్నం ఫంక్షన్ కు పక్క ఊరు వెళ్తున్నారు.
మనం కలిసి ” రాసుకుందాం” అని నొక్కి చెప్పింది.
నాకు అర్థం అయ్యింది.
మల్లి సండే వరకు అగలా అని వున్నా ఫ్రీడమ్ పోయినోడిలా అయ్యింది నా పరిస్థితి.
ముళ్ళమీద నే గడిపినట్లు వుంది సండే వరకు.
కరెక్ట్ గా 11 గంటలకు ఫ్రెష్ గ రెడీ అయ్యి నాకున్న డ్రెస్ లలో ఒక మంచి డ్రెస్ ఇస్త్రీ చేయించుకొని పండుగాడి ఇంటికెళ్ళి వల్ల బాబాయి రూమ్ లో దుబాయ్ నుండి తెచ్చిన సెంటు కొట్టుకొని పుస్తకాలు పట్టుకొని బయలు దేరా వాళ్ళ ఇంటికి….శత్రురాజ్యం పైకి దండెత్తే రాజు లా.

కరెక్టుగా 12 గం”లకు వాళ్ళ ఇంటిముందు వున్నాను.
లోపలికి వెళ్ళాలి అని వున్నా ఎవరన్నా ఎదురుపడి అడిగితే ఏమని చెప్పాలో తేలిక కాసేపుఅక్కడే అటుఇటు తిరిగాను.ఇంకా ఓపిక లేక లోపలికి వెళ్ళాను. తను ఇంటి వారండాలో మెట్లమీద కూర్చొని వుంది.చూస్తే తను నాకోసమే వెయిట్ చేస్తున్నట్లు అనిపించింది.
నేను హాయ్ చెప్పి లేట్ చేసానా అన్నాను.
తను నావైపు కొరకొర చూస్తూ 9 గంటలనుండి చూస్తున్న నీకోసం.ఇప్పుడా రావడం అంది కోపం గ.
నాకు బాధ గా అనుపించింది.
సారీ ప్రవి… మీవాళ్ళు అంత తొందరగా వెళ్ళరు అనుకున్న అంటూ తన మొహం లోకి చూసాను.
తన కళ్ళలో సన్నటి కన్నీటి పోరా.
హేయ్ ఏమయ్యింది అన్నాను.
తను నవ్వుతు ప్రవి అని నన్ను మా అమ్మ తప్ప ఎవరు పిలిచేవారు కాదు.తన తర్వాత నువ్వే అల పిలిచావ్ అంది.
నేను సారీ…అని చెప్పను.
నో అల ఎంలేదు.ఇన్ఫాక్ట్ నాకు మా మమ్మీ ని ఈరోజు గుర్తు చేసావ్ థాంక్స్ అంది.
నేను చిన్నగా నవ్వి ఇంటికొచ్చిన అతిథి ని గుమ్మం లొనే నిలుచోబెట్టి మాట్లాడుతారా ఏంటి మీ ఇంట్లో అన్నాను.
తను..సారీ శ్రీ..రా లోపలి అంది.
నేను ఇంట్లోకి వెళ్లి చుట్టూ చూసాను.నేను ఆ ఇంట్లోకి చాల సార్లు వెళ్ళాను కానీ ఇప్పుడు కాస్త చేంజ్ కనబడుతుంది.