అలా ప్రేమ లో సంతోషాన్ని పొందలేని ఎందరో 1 60

విసి కీ అర్థం అయింది వెంటనే రుచి నీ తీసుకొని జావిద్ ఇంటికి వెళ్లాడు జరిగింది అంతా చెప్పాడు “అయితే ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు రా” అన్నాడు” సార్ ఈ అమ్మాయి కీ ఒక seat మీ పవర్ తో ఇప్పిస్తే హ్యాపీ హ్యాపీగా చదువుకుంటుంది” అని చెెప్పాడు ” సరే రా seat ఇస్తాను ఫీ కూడా నేనే చూసుకుంటా కానీ ఈ అమ్మాయి సేఫ్టీ నువ్వే చూసుకోవాలి ఆ ఉస్మాన్ మీద ఒక proof ఉంటే పోలీస్ లకి చెప్పొచ్చు కానీ నువ్వు కూడా ఇరకాటంలో పడ్డతావ్ “అని హెచ్చరించారు” మళ్లీ ఈ అమ్మాయి పొజిషన్ ఏంటి సార్ ఇప్పుడు “అని అడిగాడు “నీ ఇంట్లోనే పెట్టుకో “అని చెప్పాడు జాావిద్

షాక్ అయిన విసి” సార్ ఆ ఉస్మాన్ గాడికి నా గురించి అంతా తెలుసు ఇప్పుడు ఈ అమ్మాయి నీ నా ఇంట్లో అంటే అసలే మా parents లేరు సార్ “అని చెప్పాడు “అప్పుడు సేఫ్ ఏ కదరా రేయి ఇంతకీ మించి నేను ఎమ్ చెప్పలేను చేయలేను “అని వాళ్లని పంపేసాడు జావిద్ బయటకి వచ్చాక విసి రుచి వైపు చూసి” మీకు ఒకే నే కదా నాతో ఉండటం “అని అడిగాడు తను ఒక నవ్వి తల ఉప్పింది అప్పుడు ఉస్మాన్ ఫోన్ చేశాడు

ఫోన్ ఎత్తి “సలాం వాలేకుం ఉస్మాన్ భాయ్ క్యా బాత్ హై “అని అడిగాడు” షేర్ ఆ అమ్మాయి ఎక్కడ “అని అడిగాడు అనుమానంగా “ఆ అమ్మాయి పోదున్నె వెళ్లిపోయింది గా అని చెప్పాడు విసి “నయి రే ఒ అభి తక్ నహి లౌటా “అని కొంచెం చిరాకుగా చెప్పాడు ఉస్మాన్” దానికి డబ్బులు ఏమైనా ఇచ్చావా”అని అడిగాడు “హా ఒక వేయి కావాలి” అంటే ఇచ్చాను “అని చెప్పాడు విసి” అబ్బ ఎందుకు ఇచ్చావ్ అది పారిపోయింది” అని అరిచాడు” సరే ఒక రెండు రోజులు బయటకి రాకు నేను ఒక నెల ముంబయి వేళ్లుతున్న” అని ఫోన్ పెట్టేసాడు

కానీ ఉస్మాన్ కీ తెలియని విషయం ఏంటి అంటే విసి మొత్తం ఆ సంభాషణ రికార్డు చేశాడు తరువాత అది పోలీస్ లకి ఇవ్వాలని స్టేషన్ కీ వేళ్లుతున్నారు కానీ వీళ్లకి తెలియని విషయం ఏంటి అంటే ఉస్మాన్ కిరణ్ వీళ్లని ఫాలో అవుతున్నారు

విసి ఆ అమ్మాయి నీ కాపాడాలని చూస్తున్నాడు అని అర్థం చేసుకున్న ఉస్మాన్ కిరణ్ ఎలాగైనా సరే వాళ్లని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారు దాంతో కిరణ్ కీ ఒక ఐడియా వచ్చింది ఉస్మాన్ తో ఇలా అన్నాడు “ఉస్మాన్ కాలేజీ స్టూడెంట్ తో వ్యబిచారం చేయిస్తూ పట్టుబడ్డ ప్రొఫెసర్ ఎలా ఉంది రేపు breaking news” అని అడిగాడు కిరణ్ “అరే భాయ్ సూపర్ ప్లాన్ దెబ్బకు పోరీ మన చేతిలో ఉంటుంది” అని సంబర పడ్డాడు ఉస్మాన్ వెంటనే కిరణ్ ఫోన్ తీసుకొని వాళ్ల నాన్న కింద పని చేసే ఒక అవినీతి పరుడు అయిన ఇనస్పెక్టర్ రమణ కీ ఫోన్ చేసి అంత చెప్పి వాళ్లని అరెస్ట్ చేయమని చెప్పాడు కిరణ్