అలా ప్రేమ లో సంతోషాన్ని పొందలేని ఎందరో 1 60

ఫాతిమ దిగులుగా చూసింది మేఘన వైపు” నాకూ అంతా అర్థం అయింది అన్నట్టు ఒక లుక్ ఇచ్చింది మేఘన “ఇది కాదు కానీ మీ అమ్మ నాన్న ఎందుకు విడిపోయారు” అని అడిగింది మేఘన “ఏం లేదె మా నాన్న మా అమ్మ వాళ్లు పెళ్లికి పెట్టిన కారు అమ్మెసాడు దాంతో కోపం వచ్చి అమ్మ divorce ఇచ్చింది నను అమ్మ తీసుకువెళ్లింది చోటి అబ్బు దగ్గరే ఉంది” అని చెప్పింది “ఏంటి ఇంత చిన్న విషయం కీ divorce ఆ “అని అడిగింది మేఘన” అంటే అదీ మా అమ్మ కీ అది వాళ్ల అమ్మ గుర్తు అందుకే “అని నీటురుపు విడిచింది ఫాతిమ

మేఘన : అవును వినోద్ ఎందుకు ఇలా అయి పోయాడు
ఫాతిమ : ఇప్పుడు తెలుసుకొని ఎమ్ చేస్తావ్
మేఘన : నాకూ అవసరం అసలు రుచి ఎమ్ చేసేది
ఫాతిమ : కాల్ గర్ల్
తల పగిలిన అంత పని జరిగింది మేఘన కీ ” హేయ్ ఏంటే నువ్వు చెప్పేది జోక్ చేయదు “అని అడిగింది మేఘన “అవునే రుచి కాల్ గర్ల్ ఏ” అని చెప్పింది ఫాతిమ

ఏంటే ఇంత షాక్ ఇచ్చావ్ రుచి కాల్ గర్ల్ ఆ అయిన ఒక కాల్ గర్ల్ నీ లవ్ చేయడం ఏంటి పెళ్లి చేసుకోవడం ఏంటి అది చనిపోయింది అని ఇలా అయిపోవడం ఏంటే” అని తల పట్టుకుని కూర్చుంది మేఘన, అప్పుడు ఫాతిమ మేఘన భుజం మీద చేయి వేసి “dude అలా అన్నొదు రుచి నీ బలవంతంగా కాల్ గర్ల్ గా మార్చారు” అని చెప్పడం స్టార్ట్ చేసింది ఫాతిమ

“నువ్వు నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం కానీ నువ్వు ఇంజనీరింగ్ కోసం పూణే వెళ్లావ్ కానీ నాకూ ఇంజనీరింగ్ seat రాలేదు అందుకే అబ్బు

తన పవర్ తో నాకూ Osmania University లో BSC electronics లో seat ఇప్పించారు “అని మొదలు పెట్టింది ఫాతిమ “2 years కళ్లు మూసి తెరిచే లోపు అయి పోయాయి కానీ life లో ఒక త్రీల్ లేదు అప్పుడు వచ్చాడే ధనుష్ వాడిని చూడగానే నా fuse ఎగిరిపోయింది మా సైన్స్ ప్రొఫెసర్ వాడు అని తన లవ్ స్టోరీ చెప్పడం మొదలు పెట్టింది ఫాతిమ

” ఒసేయ్ నేను నీ తోకలొ లవ్ స్టోరీ అడ్డగా లేదు వినోద్ గురించి చెప్పు అని అరిచింది మేఘన “ఒ సారీ Flow లో నాది వచ్చేసింది” అని మళ్ళీ మొదలు పెట్టింది

25 జూన్ 2013

Osmania University BSC electronics వైట్ చెక్స్, కాటన్ జీన్స్ పాంట్ తో neat గా టక్ చేసుకోని వచ్చాడు విసి క్లాస్ లోకి ఆరడుగుల ఎత్తు మంచి కండలు తిరిగిన బాడి
గ్రీక్ వీరుడు వచ్చాడా అన్నట్లు అమ్మాయిలు అంతా అతనే చూస్తూ ఉండి పోయారు “good morning క్లాస్ I am VC వినోద్ చంద్ర your new English professor” అని పరిచయం చేసుకున్నాడు విసి, అంతే ఒక సారిగా silent అయ్యారు అంతా అమ్మాయిలు మాత్రం చిన్నగా మాట్లాడుకుంటున్నారు”వీడు professor ఏంటే టెంపరేచర్ పెంచే వీడి లాంటి వాడు ప్రొఫెసర్ అయితే మనకు పండగే” అప్పుడే అట్టు వైపు వెళుతున్న సుజాత మేడమ్ విసి నీ చూసి ఆగిపోయింది అలాగే విసి నీ కళ్లు
ఆర్పకుండా చూస్తోంది అప్పుడు విసి lesson చెప్తూ బయటికి చూస్తే సుజాత మేడమ్ అది గమనించి పక్కకు వెళ్లింది