“ఆత్మ”కధ 506

చిత్రం గా అక్కడ అన్నీ నాకు ఇష్టమైన పదార్ధాలు పెట్టి వున్నాయి .. కానీ ఆకలి వెయ్యట్లేదు .. ఆ ఇద్దరూ .. నావేపు చూసి ఇక్కడ ఆకలీ దాహమూ వుండవు … మీకు ఏమైనా తినాలి అనిపిస్తే తినండి . అక్కడ ఉన్న పాత్రలో సుగంధ ద్రవ్యాలు కలిపిన చల్లని మంచినీరు ఉంటుంది .. నిద్రించవలెనంటే అదిగో తల్పము ..
ఆకలి లేకపోయినా కొద్దికొద్దిగా తిన్నాను .. వాళ్ళు చూపించిన పాత్రలోంచి కొంచెం నీరు తీసుకుని తాగాను ..
చాలా ఆశ్చర్యం అనిపించింది .. ఏలకుల పొడీ అతి స్వల్పంగా మిరియాల పొడీ కాక .. తియ్యదనం కోసం ఏమి కలిపారో తెలియలేదు .. కానీ ఆ చల్లని నీరు తాగుతూ వుంటే .. అలా తాగుతూనే ఉండి పోవాలని అనిపించింది .. అంత మధురంగా వున్నాయి ..
వాళ్ళు చూపించిన ఆ తల్పం మీద వెళ్లి పడుకున్నా..
ఆ తల్పం లో ఏమైనా మహాత్యం ఉందేమో తెలీదు .. కానీ దాని మీద పడుకునీ పడుకోగానే నిద్ర వొచ్చేసింది..
నాకు మళ్ళీ మెలకువ వొచ్చేసరికి . నిన్న చూసిన “రాజుగారు” నా ఎదురుగా ఒక ఆసనం లో కూచుని వున్నారు..
నేను లేచి కళ్ళు విప్పి చూడగానే ..
మళ్ళీ మరో ప్రస్తావన లేకుండా .. సూటిగా ..
మిత్రమా .. మా చిత్రగుప్తుని తప్పిదము వలన భూలోకమున నీవు నీ ఆయువు ఇంకను మిగిలి ఉండగనే మరణించుట సంభవించినది .. ఆ తప్పిదమును సరిచేయు శక్తి ప్రస్తుతము నాకును లేదు .. ఈ విషయము న నేను పూర్తిగా అ శక్తుడను .. నీవు ఈ విషయమును బ్రహ్మ కు గాని శంకరునకు గాని మనవి చేసిన ఇట్టి ఘోరమగు తప్పిదమునకు వారు విధించు శిక్ష లు చాల భయంకరముగా ఉండును..
తప్పు చేసినది చిత్రగుప్తుడే అయిననూ .. సేవకులు చేయు దోషములకు యజమానులు కూడ బాధ్యులే అగుదురు … అందువలన చిత్రగుప్తునితో బాటు నేను కూడ శిక్ష అనుభవించవలెను..
మావలన జరిగిన ఈఅపరాధమును నీవు పెద్ద మనసుతో మన్నించినచో .. నీవు ఏమి వరము కోరుకున్ననూ నీకు ఇవ్వగలము. అని నావైపు చూస్తూ ఊరుకున్నాడు.
చాలు .. సాక్షాత్తూ యమధర్మరాజు నన్ను బతిమాలుతున్నాడు .. అతనికీ చిత్రగుప్తుడికీ శిక్ష పడితే నాకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు .. అంచేత ఆ ఇస్తానన్న వరాలేవో పుచ్చేసుకుంటే మంచిది .. ఇంతకీ వ్యవహారం ఇక్కడిదాకా వొచ్చింది కాబట్టి .. జెనరల్ గా నా భవిష్యత్తు ఎలావుండేదో (బతికుంటే ) అడగవచ్చు .. దాన్ని బట్టి ఏం అడగాలో ఆలోచించుకుందాం అని ఆలోచించుకున్నా ..
ఆయన వేపు తిరిగి ..

6 Comments

  1. పార్వతి

    అన్నీ కథలు మధ్యలోనే అపెస్తున్నారు. పూ ర్థి చ్గెయంది

    1. nuvvu vaste nenu poorthi chesipedata gaa

  2. Continue cheyandi

  3. good story please continue

  4. Mee alochana ok adbhutham Danni meeru maku panchadam chala santhosham please continue as your style ?

Comments are closed.