“ఆత్మ”కధ 506

నాంది
వొదినా నేను కాలేజీ కి వెళ్తున్నా అని మా పెద్ద వొదిన తో చెప్పి నా మోపెడ్ స్టార్ట్ చేశా ..
సైడ్ రోడ్ లోంచి మెయిన్ రోడ్ కి టర్న్ తీసుకుంటూ ఉండగా .. వెనకనుంచి నన్ను ఏదో గుద్దినట్టయింది ..
ఒక్కసారి భరించలెంత బాధ .. ఒక అరనిముషం సేపు నరకం చూసాను ..
అంతే ..
ఒక్కసారిగా ఒళ్ళంతా తేలిగ్గా అయిపోయినట్టయింది ..
ఆ తరవాత నన్ను ఎవరో ఇద్దరు ఆర్మీ సోల్జర్స్ లా ఉన్నారు..పట్టుకుని తీసుకెళ్తున్నారు ..
సుమారు ఒక అరగంట అయినట్టుంది ..
ఆ ఇద్దరూ నన్ను జానపద సినిమాల్లో లాగ అదేదో పెద్ద సభా భవనం లా వుంది .. నన్ను అక్కడ నిలబెట్టి వాళ్ళిద్దరూ పక్కకి తప్పుకున్నారు …
నా ఎదురుగా వున్న అతను ఒక రాజుగారి గెటప్ లో వున్నాడు .. పక్కకి తిరిగి చూస్తూ అక్కడ వున్న ఇంకొకతన్ని పట్టుకుని దులిపేస్తున్నాడు ..
ఇంటర్మీడియట్ లో నా సెకండ్ లాంగ్వేజ్ సంస్క్రుతం కావడం ఇప్పుడు పనికొచ్చింది …
అతని మాటల్ని తెలుగులో పెట్టాలంటే
” రాను రాను నీ బుద్ది మందగిస్తున్నది చిత్రగుప్తా .. నీవు ఈ తప్పు చేయుట ఇది అప్పుడే నాలుగవ పర్యాయము .. ఈతని ఆయువు ఇంకను ముప్పది సంవత్సరములు వున్నది .. నీవు వేసిన తప్పుడు లెక్క కారణముగా మేము తల దించుకోవలసిన పరిస్థితి ఏర్పడినది .. ఇప్పుడు ఈ మానవుని ఏమి చేయవలె ?
ఇటుల ఎందుకు జరిగినదని చతుర్ముఖుడు అడిగిన ఏమి సమాధానము చెప్పవలె ? ఇస్సీ .. ఇతనిని ఇప్పుడు వెనుకకు త్రిప్పి పంపుదమన్ననూ సాధ్యము కాదే ? అక్కడ భూలోకమున ఈతని శరీరమునకు అంత్యక్రియలు కూడ జరిగిపోయినవి .. ధిక్ .. నీవు మమ్ములను గొప్ప ధర్మ సంకటములో పడవైచినావు .�
అని .. నావైపు తిరిగాడు ..
అప్పటికి నాకు సీన్ మొత్తం అర్ధం అయిపోయింది ..
మిత్రమా .. నీవు నేటికి మా అతిధి గృహమున విశ్రాంతి తీసుకొనుము .. రేపు ఉదయమున మనము ఈ విషయమున ఒక పరిష్కారమునకు ప్రయత్నించుదము .. అని చెప్పి అక్కడ వున్న ఒక ఇద్దరు భటులకి సైగ చేశాడు ..
వాళ్ళిద్దరూ నన్ను ఎప్పుడు పట్టుకున్నారో ఎలా తీసుకెళ్లారో కూడా నాకు తెలియలేదు .. కన్నుమూసి తెరిచేసరికి ఇంకో పెద్ద గదిలో వున్నాను నేను ..

6 Comments

  1. పార్వతి

    అన్నీ కథలు మధ్యలోనే అపెస్తున్నారు. పూ ర్థి చ్గెయంది

    1. nuvvu vaste nenu poorthi chesipedata gaa

  2. Continue cheyandi

  3. good story please continue

  4. Mee alochana ok adbhutham Danni meeru maku panchadam chala santhosham please continue as your style ?

Comments are closed.