చాలా లక్కీ 2 133

వద్దు అనబోయి. . .సావంత్ వచ్చిపోవడం గగన్ కు పూర్తిగా తెలీకుండా అహన దేవి ఎందుకు దాచిపెడుతోందో ? అసలు వారిద్దరి మధ్య ఏం జరుగుతోందోనని తెలుసుకొని ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేయకుంటే తన సంసారినికే మోసం వచ్చేలా ఉందనుకొని మౌనంగా ఉండిపోయింది.
మోహన అలా మౌనంగా ఉంటం చూసి గగన్ ఇంకోలా అర్థం చేసుకొంటూ మోహనా నీవు ఎక్కువగా ఆలోచించవద్దు . . . . నీ గతానికి సంభందించి అతడికి ఎటువంటి సమస్యలూ లేవు అన్నాడు.
మోహన ఏమీ మాట్లాడలేకపోయింది మీ ఇష్టం అని అటు తిరిగి పడుకొనేసింది.

ఈ విశయాన్ని అహన, చారిలిద్దరకూ తెలీకుండా రెండు రోజుల తరువాత పెద్ద హోటెల్ లో సావన్ తో పాటు తమ పెళ్ళికి సహాయపడిన స్నేహితులతో చిన్న కిట్టీ పార్టీ ఏర్పాటు చేసాడు గగన్. . . పార్టీలో హెల్తీగా కనిపిస్తూ, హుందాగా తెల్లటి పలు వరుస తళుక్కుమనేలా నవ్వుతూ అందరినీ ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకొంటున మోహనన్ చూసి సావంత్ తో పాటు గగన్ స్నేహితులందరూ మోహనలో వచ్చిన మార్పును చూసి నోరు వెళ్ళబెట్టేసారు. జస్ట్ మూడు నాలుగు నెలల క్రితం కూటికి అల్లాడిన అమ్మాయేనా ఈ అమ్మాయి అని సరిపోల్చుకొంటున్నారు. తనని ఎజుకేట్ చేసిన స్నేహితులందరూ మరొక్కమారు కలవడంతో మోహన కూడా వాళ్లతో హ్యాపీగా కలిసిపోయింది. ఒక్క సావంత్ తో తప్ప

పార్టీలో అవకాశం చూసుకొని సావంత్ . . .మోహనా నన్ను అనుమానంతో దూరం పెట్టకు. . .నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నీ మంచికే చెబుతున్నా. . . మీ అత్తయ్య నీవు అనుకొన్నంత మంచిదేం కాదు. ప్లీస్. . . . ఎక్కడ కలవమన్నావ్ . . .. అన్నాడు.
సావంత్ అలా అహన విశయం తెచ్చేసరికి ఎప్పుడో ఎందుకు సావంత్ . . . .ఇప్పుడే చెప్పు . . . అంది.
లేదు. . . ఇక్కడ కాదు . . .ఇది పది మందిలో చెప్పేది కాదు. వేరేగా మాటాడుతా రేపు గాని ఎల్లుండి గాని ఆంటీ వెళ్ళిపోయిన తరువాత ల్యాండ్ కు ఫోన్ చేస్తా సరేనా అని గగన్ రావడంతో సర్దుకొని మళ్ళీ ఫ్రెండ్స్ తో కలిసిపోయాడు..

పార్టీ అయిపోయిన తరువాత అందరు స్నేహితులతో పాటు సావంత్ కూడా సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. తన అందరి స్నేహితులతో హుందాగ నడచుకొన్న రీతి గగన్ కు చాలా సంతోషమయ్యింది.
చెప్పినట్టుగానే మరునాడు అందరూ వెళ్ళిపోయిన తరువాత ల్యాండ్ లైన్ కు సావంత్ ఫోన్ చేసాడు.

మోహన :- చెప్పు సావంత్ అంది గంభీరంగా. . .
నేను మీ ఇంటికి ముందే ఉన్నాను మోహనా రమ్మంటే లోపలికొస్తాను.
సరే రా అని బయట లాన్ లోనే చెట్టుకింద కుర్చీలేయించింది.
సావంత్ తటపటాయిస్తూ ఉంటే. . .మోహనే కలగజేసుకొని ఏదో చెప్పాలన్నావుగా సావంత్ చెప్పు అంది.

సావంత్ : మోహనా నీకు గగన్ భర్తయితే నాకు చిన్న నాటి నుండీ స్నేహితుడు ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. . .మా ఇద్దరి గురించి కూడా ఆంటీ అంకుల్ కు తెలుసు. .. . మా ఇద్దరి రిలేషన్ షిప్ ను ఆంటీ వాడుకోవాలని చూస్తోంది.
మోహన :- చూడు సావంత్ . . . ఇక నా జీవితం ఇంతే . . ఇలానే జీవితం ముగిసిపోతుందనే సమయానికి ఓ తండ్రి లాగా నన్ను ఆ ఊబిలోనుండి పైకిలాగి నాకో జీవితాన్ని ఇచ్చాడు గగన్. . .గగన్ నా జీవితంలోనికి రావడానికి నువ్వు కూడా కారణం . . .అలా అని సెంటిమెంట్ పెట్టుకొనే రకం కాదు నేను. . .ఆకలికి తట్టుకోలేకనో. . .ఒళ్ళునెప్పుల కోసమో. . . నాటు సారా తాగి విటులిచ్చింది తిని పడుకొనే మోహన ఎప్పుడో చచ్చిపోయింది.
ఇప్పుడు నాకంటూ ఓ సంసారం, ఇల్లూ వాకిలీ ,అత్తయ్యా ,మామా , అందరూ ఉన్నారు. నాలాంటి దానికి ఇంతకన్నా స్వర్గం ఉంటుందని నేను అనుకోవడం లేదు.. . .ఇలాంటి సమయంలో నీవు నన్ను మళ్ళీ నా పాత జీవితం ఆసరగా చేసుకొని మళ్ళీ నా జీవితం లోని కి రావాలని ప్రయత్నించవద్దు.

అంత స్పష్టంగా మాట్లాడుతున్న మోహనను చూసి సరిగ్గా నాలుగైదు నెలల క్రితం గుడెనెకాల సారా కోసం తనకు కాలెత్తిన మోహనేనా ఇది అనిపించింది. అదే సమయంలో మాట్లాడిన మాటలన్నీ తనను ఉద్దేశించినవే అని అర్థం అవుతూ ఉంటే సారీ మోహనా. . .నీవు ఇలా అంటం లో తప్పులేదు కాని అప్పటి పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు. నీవిప్పుడు నా స్నేహితుడి భార్యవి. .. వాడి ఉన్నతమైన భావాలు వ్యక్తిత్వం వాటినే చూసే ఇంతకాలం వాడితో నేను స్నేహితుడిగా మిగిలిపోయాను.అందరి కుర్రాళ్ళకు మల్లే మేము కూడా ఎంతో కొంత ఎంజాయ్ చేసినా వాడిది చాలా సున్నితమైన మనసు. పైగా అందగాడు కూడా ఎంతో మంది వాడిని తమ వాడిగ చేసుకోవాలని ప్రయత్నించినా కూడా తన తల్లితండ్రుల మాటకే ఎక్కువగా విలువిస్తానని చెప్పి తప్పించుకొనేవాడు.
అలాంటిది తన తల్లి తండ్రులను కాదని వాడు నిన్ను పెళ్ళి చేసుకొన్నాడంటే మీ ఇద్దరి మనసులు ఎంతగా కలిసిపోయాయో అర్థం చేసుకోగలను. . . మీ విశయం తెలిసి సంతోషపడిన వారిలో బహుశా నేనే మొదటి వాడిని కావచ్చు . . .కానీ మీ ప్రేమ వ్యవహారం అంకుల్ అర్థం చేసుకొన్నంతగా ఆంటీ అర్థం చేసుకోవడం లేదు. . .అలా అనే దానికన్నా నిన్ను శాశ్వతంగా గగన్ కు దూరం చేయాలని చూస్తోంది.