చాలా లక్కీ 2 133

సావంత్ ఎక్స్ప్లనేషనుతో తాను కన్వీనెన్స్ అయినట్టుగా తల ఊపుతూ సూటిగా విశయం చెప్పు సావంత్. . . నువ్వు ఈ మధ్య తరచూ ఇంటికొచ్చి వెళుతున్నావు. . .నేను రాంగానే లేచి వెళ్ళిపోతున్నావు.. . . అదీ కూడా గగన్ లేని సమయంలోనే ఎందుకు. .. . .నీ విశయం గగన్ తో ఎప్పుడో చెబుదామనుకొన్నాను. . .కాని నా అంతట నేను నీ గురించి చెబితే నా భర్త ఎక్కడ బాధపదతాడోనని చెప్పలేదు.
సావంత్ : ఆ . . .అక్కడికే వస్తున్నా మోహనా . . . ఆంటీ కి నువ్వంటే సుతారామూ ఇష్టం లేదు. . .డైరెక్ట్ గా నిన్ను ఏం చేసినా తమ కొడుకు ఎక్కడ తమకు దూరమవుతాడో నని . .. . నా ద్వారా గగన్ కు నీ మీద అనుమానం వచ్చేలాగా ఇంటికొచ్చి వెళుతూ ఉందమని ఆంటీనే చెప్పింది.. . .ఒక్క సారి గగన్ కు నీకు పొరపొచ్చాలు వచ్చిన మరుక్షణం నీ హిస్టరీ మొత్తం బయటకు లాగి నిన్ని గగన్ కు దూరం చేయాలని తను భావిస్తోంది.
మోహన ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది. తన వెనకాల ఇంత మాస్టర్ ప్లాన్ జరుగుతోందా అని మ్రాన్ పడిపోయింది. భయమూ ,దుఖమూ రెండూ కలగా పులగంగా మెదడును తినేస్తుంటే తల పట్టుకొంది.
సావంత్ కూడా ఏం చెప్పకుండా మౌనం వహించాడు.

కాసేపు మౌనం తరువాత మోహన సర్దుకొంటూ సావంత్ ఇలా చెయడానికి ఆంటీ నీకు ఏం అఫర్ చేసింది. . .ఆంటీ చెప్పినట్టు కాకుండా నువ్వు ఇలా డబల్ క్రాస్ చేసి విశయం నాకు లీక్ చేయడం వల్ల నానుండి ఏం ఆశిస్తున్నవు అంది.

సావంత్ ఆమె షార్ప్ నెస్ కు ముందు చూపుకు అబ్బురపడుతూ. . .కరెక్ట్ గానే ఊహించావు మోహనా. . .ఒకవేళ ఆంటీ చెప్పినట్లు నడచుకొంటే. . . పనయిన తరువాత. . . తమ కంపెనీలో టెన్ పర్సెంట్ షేర్లు నా పేరున ట్రాన్స్ఫర్ చేస్తానన్నది. అంటే సుమారు 60 70కోట్లు . . .అంత పెద్ద మొత్తాన్ని వద్దనుకొన్నది కేవలం నా స్నేహితుడి కోసమే. . .. . .నీ నుండి ఏదీ ఆశించదం లేదు.
మోహన :- నిజమా సావంత్ అంది గొంతు వణకుతుండగా. . .
సావంత్ : నిజం మోహనా నా విశయంలో నువ్వు ఇంకేం అనుమానాలూ పెట్టుకోవల్సిన అవసరం లేదు. తొందరలోనే నేను జార్జియా కు వెళ్ళిపోతున్నాను. నా పెళ్ళికో లేదా మీకు పిల్లలయిన తరువాతో నా ఇంటికి రండి. కాని నీవు జాగ్రత్త. నేను కాకపోతే ఈ పని వేరే వారితోనైనా చేయిస్తుంది. లేదా మూడో కంటికి తెలీకుండా నిన్ను హత్య చేయించవచ్చు.

కన్నీళ్ళు కళ్ళ చివరకొచ్చేసాయి మోహనకు.. . . దుఖం ఆపుకొంటూ. . .ఇప్పుడు ఏం చేయమంటావ్. .సావంత్. . . నేను గగన్ కు దూరమయి బ్రతకలేను.. . .అలా అని ఇక్కడ దిక్కులేని చావు చావలేను. . .

సావంత్ ఏం మాట్లాడకుండా గోళ్ళు గిల్లుకొంటూ కూచొన్నాడు.
రెండు నిమిషాలు మౌనంగా లోలోపలే ఆలోచించిన మోహన ఏదో నిర్ణయానికొచ్చినట్లుగా. . . సావంత్ . . .నీవు జార్జియా వెళ్ళిపోయేంతలోపు ,నాకు ఓ సాయం చేసిపెట్టగలవా అంది.

సావంత్ : చెప్పు మోహనా
మోహన తన ప్లాన్ ను వివరించి . . .ఆంటీ నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. . .ఇకపై అసలు కథను నేను నడుపుతాను. . .నీవు జస్ట్ నేను చెప్పినట్లు చేయి చాలు.
సావంత్ మోహన చెప్పిన ప్లాన్ ను విని సావంత్ నోరు తెరచుకొని ఉండిపోయాడు.అదే సమయంలో తన ప్లాన్ బెడిసికొడితే ముందు ముందు కు ఏం జరుగుతుందో నని భయపడ్డాడు.

మోహన సావంత్ కు ధైర్యం చెబుతూ చూడు సావంత్ నీవు చెప్పిన దాన్ని బట్టి. . .అన్ని విశయాలనూ పక్కా చేసుకొన్న తరువాతే మన ప్లాన్ అమలు చేద్దాం. . .ఒకటి రెండు రోజుల వరకూ ఆంటీని అవాయిడ్ చేయ్. . .మీ స్నేహానికీ . . .నీ భవష్యత్తుకు ఏమాత్రం ఢోకా రాకుండా నేను చూసుకొంటాను. ఆ మాత్రం నన్ను నమ్ము. . .ఏ రకంగానైనా నీకే లాభం కదా. . .అంది చివరగా. . .

సావంత్ లోలోపల లొట్టలేసుకొంటూ పైకి మాత్రం మేక పోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ సెలవు తీసుకొన్నాడు.
సావంత్ వెళ్ళిన వైపే చూస్తూ సాలోచనగా తల పంకించింది.

మూడు రోజుల తరువాత పట్టుబట్టి గగన్ తో బాటు తనూ ఆఫీసుకు బయలు దేరింది మోహన. చారి కూడా ఆమెకు వంత పాట్టం తో చేసేదేమీ లేక గగన్ మోహనను కూడా తీసుకొని బయలు దేరాడు. ఆఫీసులో మోహనను అందరికీ పరిచయం చేయడానికి చారి సంకోచిస్తూ ఉంటే . . . .మార్కెటింగ్ రీసెర్చ్ స్టూడెంట్ అని పెద్దాయనకు దూరపు చుట్టమని తనే చెప్పుకొని పరిచయం చేసుకొంటూ ఇద్దరినీ రిలీఫ్ చేసింది.

చారి లోలోపల బాధపడుతూ మోహన పెద్ద మనసుకు జోహార్లు చెప్పుకొని ఆప్యాంగా తల నిమరాడు.

ముగ్గురూ కలిసి ఆఫీసుకు వెళ్ళిపోవడంతో అహనకు కాస్త తీరిక దొరికినట్లయ్యి మూడు రోజుల నుండి చేతికి దొరక్కుండ ఉంటున్న సావంత్ కు ఫోన్ చేసి చీవాట్లు పెడుతూ ఇంటి దగ్గరకు రమ్మంది.

సావన్ ఇంట్లోకి వెళ్ళే సమయానికి ఇంట్లో పని వాళ్ళంతా తమ డ్యూటీలు దిగి క్వార్టర్స్ కు వెళ్ళిపోయారు. బయట వాచ్ మాన్ మాత్రం కాపలాగా ఉన్నాడు. సాధారణంగా ఆ సమయానికి అహన కూడా క్లబ్ కో లేదా ఆఫీసుకో వెళ్ళిపోయేది. ఐతే ఈ రోజు ఇంట్లో మోహన లేకపోవడంతో తను ఇంట్లోనే ఉండిపోయింది.

సావంత్ రాగానే హాల్లో అతడి కోసమే ఎదురు చూస్తున్న అహన దిగ్గున లేచి వచ్చి సావంత్ ను కొట్టినంత పని చేస్తూ ఎక్కడికెళ్ళావురా . . . . అస్సలు కనిపించడం లేదు అని గయ్ మంది.
అయ్యో ఆంటీ. . . . మీరు టెన్షన్ పడకండి . . . .నేను మీ పని మీదే ఉన్నాను . . .

నా పని మీదేమిట్రా చవటాయ్. . . నేనేమైన నీకు దగ్గరుండి శోభనమేమైన చేయిస్తున్నానా? ఆ తింగరి ముండను దూరం చేసి పెట్టరా అంటే . . . . ఏదీ తేల్చ కుండా రెండు నెలల నుండి నాన్ చుతున్నావు. అటు తిరిగి ఇటు తిరిగి దానికి మన మీద అనుమానం వచ్చేలాగుంది.

సావంత్:- ఆంటీ ప్లీజ్ మీరు కాస్త కూల్ గా ఉండండి. . . ఒకేసారి అనుమానం వచ్చేలాగ చేయాలంటే ఇదేమైనా సినిమా అనుకొన్నారా . . .అందుకే అటు గగన్ ను ఇటు మోహనను ఇద్దరినీ సీక్రెట్ గా గమనిస్తున్నాను. ఒకటి రెండు రోజుల్లో నేనే మీకు ప్రోగ్రెస్ గురించి చెబుదామనుకొన్నా
అహన ఆవేశం కాస్త తగ్గించుకొంటూ . . . మరి రెండు రోజుల నుండీ ఇంటికి రావడం లేదు కనీసం ఫోన్ తీయడం లేదు. . .ఏం చేస్తున్నావేమిటి

సావంత్:- నేను మీకు అన్నీ వివరంగా చెబుతా కాని ముందు నాకు మోహన వాళ్ళ బెడ్ రూం చూపించండి.
బెడ్ రూం ఎందుకూ అనబోయి. . .నాలుక కర్చుకొంటూ ఈ ఇంట్లో వాళ్ళ గది ఎక్కడుందో నీకు తెలీదారా . . .
సావంత్:- హయ్యో ఆంటీ తెలీదని కాదు. . .నేను నా ప్లాన్ గురించి చెబుతా అని అన్నాను కదా. . . ముందు నేను అడిగిన దానికి మాత్రం ఆన్సర్ చెప్పండి . . .రండి అంటూ గది పైకి బయలు దేరాడు.

గగన్ మోహనల బెడ్ రూము నీట్ గా తీర్చి దిద్దబడి ఉండి మోహన టేస్టుకు తగ్గట్టుగా అక్కడక్కడా చిన్న చిన్న మార్పులు చేయబడి ఉన్నాయి. బెడ్ రూములోనికెళ్ళగానే అహన కు ఈర్శ్య మరింత గా పెరిగింది.
సావంత్ ఆమె హావ భావాలతో పని లేనట్లుగా ఆంటీ . . .మోహన స్నానం చేసే సమయానికి నేను ఇదిగో ఈ గ్లాస్ విండో నుండి వెనుక వైపున వెళ్ళిపోతున్నట్టుగా గగన్ చూసేట్టు మనం చేయాలి. . .ఇలా వెనుక తలుపు నుండి వెళ్ళి పక్క గదిలోనికెళతానన్నమాట అంటూ అ గదిలో నుండి పక్క గదిలోనికి దాటుకొని వచ్చాడు.

ఆ గది బుక్స్ పెట్టుకొనే స్టోర్ రూముకోసం కేటాయించుకొన్నారు అందరూ . . . అరలు అరలుగా పేర్చి ఉన్న బుక్స్ అన్నింటినీ పరిశీలిస్తూ అక్కడున్న సోఫా మీద కూచొన్నాడు.