జీవితం 504

నేనూరుకుంటానా, నామోచేతిని దాని జబ్బ పక్కగా పోనిచ్చి దాని రొమ్మును నొక్కాను. కోపంగా మొకం పెట్టింది గాని దానికి సమ్మగా వుందని నాకు అర్ధమైందిరా.” అన్నాడు. ఎట్టా అర్ధమందిరా అన్నాను. “అరే, అదెప్పుడూ ఆడపిల్లల మధ్యలోనో, ఆ చివరో కూర్చోకుండా ఈ చివరెందుకు కూర్చుంటదిరా, దాని చూపు పుస్తకం మీదున్నట్టు నటిస్తది గాని ఓరకంటితో మనల్నే చూస్తా వుంటదిరా – ఇది చాలదేరా అర్ధం చేసుకోడానికి” అన్నాడు లింగం గాడు. వీడి దగ్గర ఎంత విషయం ఉంది! అనుకున్నాను. గురువు గురువే కదా! రొమ్ము అనేది మనం పట్టించుకోవాల్సిన ముఖ్యమైన భాగం అని తెలుసుకున్నాను. కాబట్టి నారెండో గురువు లింగం గాడే.

యల్. విజయలక్ష్మి డాన్సునాకు చాలా ఇష్టం. తెలుగు సినిమాతారల్లో ఆమె నంబర్ఒన్ డాన్సర్ అని నా రేటింగ్. ఆమె ముఖానికి ఆ విశాలనేత్రాలు, సొట్ట బుగ్గలు హైలైట్. యల్. విజయలక్ష్మిని చూసినప్పుడల్లా మా ఇంటర్ క్లాస్ మేట్ ఒకామె గుర్తుకొస్తూ వుంటుంది. ఆమె అసలు పేరు గుర్తు లేదు. మేం పెట్టిన నిక్ నేం ‘బీటా’. మా క్లాస్ మొత్తం 80 మందిలో ఆడపిల్లలు 20 మంది మాత్రమే. వాళ్ళల్లో నలుగురైదుగురు కాస్త చూపరులు. వాళ్లకు ర్యాంకులిచ్చారు మావాళ్ళు. ఆల్ఫా, బీటా, గామా, తీటా అనే పేర్లు పెట్టారు. మా క్లాస్ మేట్స్ లో చురుకైన బ్యాచ్ ఒకటుంది. ఆడపిల్లల మీద కామెంట్లు చెయ్యటం, గాలి కబుర్లు చెప్పుకోవడం బూతు మాటలు ధారాళంగా వాడటం వీళ్ళకు నిత్యకృత్యం. ర్యాంకులిచ్చింది వీళ్లే. నా ధ్యాస చదువు మీద ఉన్నప్పటికీ ఎక్కడ జనరల్ నాలెడ్జ్ మిస్ అవుతానో అని వీళ్ళను అప్పుడప్పుడు కలుస్తుండే వాణ్ణి.

ఈ ఆల్ఫా బీటా గొడవేంట్రా అని రాజశేఖర్ గాణ్ణి అడిగానొక రోజు. వాడు గ్యాంగు లీడర్. అరే మబ్బూ, ఆల్ఫా అంటే నెంబర్ ఒన్, బీటా అంటే రెండూ, గామా మూడు, తీటా నాలుగు అనీ ఇవి ఆడపిల్లల కిచ్చిన ర్యాంకులనీ చెప్పాడు. ఆ నలుగురు ఎవరో కూడా చెప్పాడు. “అరే ఆల్ఫా చూడరా, మోరెత్తి తెగ పోజు గొడతంది, బీటా సొట్ట బుగ్గలు చూడరా కొరికెయ్యాలనిపిస్తందిరా…” ఒక పక్క క్లాసు జరుగుతూనే వుంటుంది. రెండో పక్క ఈ కామెంట్లు. లెక్చరర్ కు వినపడకుండా వుండాలి, కాని ఆడపిల్లలకు మాత్రం లైట్ గా వినపడాలి. అందుకని వ్యూహాత్మకమైన చోటు చూసుకుని కూర్చునేది ఈ బ్యాచ్. పాఠం శ్రద్ధగా వింటున్నట్లు నటిస్తూ, మూతికి చెయ్యడ్డం పెట్టుకుని కామెంట్లు వదిలే వాళ్ళు. ఇంగ్లిషు, తెలుగు క్లాసులప్పుడు వీళ్ళ పక్కన కూర్చునే వాణ్ని. రాజశేఖర్ అందగాడే, మహా కొంటెవాడు. కామెంట్లు చెయ్యడంలో వీడే నంబర్ ఒన్. గ్రీకు అక్షరాలలో ఆల్ఫా, బీటా, గామాలు మొదటి మూడు స్థానాల్లో వుంటాయి. తీటాది ఎనిమిదో స్థానం. అసలీ నామకరణం రాజశేఖర్ గాడి పనే. ఐతే క్లాసంతా ఏకగ్రీవంగా ఆమోదించింది. (ఇక్కడ క్లాస్ అంటే అబ్బాయిలని అర్ధం)

నాలుగో ర్యాంకు అమ్మాయిని డెల్టాఅనాలి గాని తీటా అంటున్నారేంటి అని డౌటు వచ్చింది గాని అడక్కుండానే క్లియర్ ఐంది. ఒక రోజు ఇంగ్లిష్ క్లాస్ జరుగుతోంది. నేను రాజాగాడి పక్కనే కూర్చున్నాను. అటు పక్క నాలుగో బెంచీపై ఈచివర తీటా కూర్చుంది. ఇటు పక్క ఐదో బెంచీపై రాజా, వాడి పక్కన నేను కూర్చున్నాము. మేం కూర్చున్న చోటనుంచి అమ్మాయిలందర్నీ చూడొచ్చు వాళ్ళు గమనించకుండా. కాబట్టి ఇది స్ట్రాటజిక్ ప్లేస్ (వ్యూహాత్మక స్థానం). రాజాగాడేదో జోక్ వేశాడు – తీటాను ఉద్దేశించి. తల కొద్దిగా మావైపు తిప్పి రాజావంక ఓరగా చూసింది. మొహంలో కొంచెం నవ్వు. అరే దీన్నిట్రై చేస్తే పడుద్దిరా, మొహంలో గుల చూడు అన్నాడు రాజా. అప్పుడు వెలిగింది నాకు. గుల అంటే తీటేగా. కాబట్టి తీటా అనడం కరెక్టేగా అనుకున్నాను. నాక్కూడా తీటా కొంచెం కసిపిల్లే నేమో ననిపించింది. తీటా అసలు పేరు సుజాత. యావరేజ్ హైటు, కుదిమట్టంగా వుంటుంది. చామన ఛాయ, నవ్వు మొహం. కళ గల మొహం. ఫేసు, బాడి రెండూ ఎట్రాక్టివ్ గా వుంటాయి. ఈమెకు ఫస్టు ర్యాంకు ఎందుకు ఇవ్వలేదు అనిపించింది. ఏమైనా సమిష్టి నిర్ణయం కదా ప్రశ్నించకూడదులే అనుకున్నాను.

గామా అసలు పేరు గాని, మొహం గాని ఇప్పుడసలు గుర్తు రావడం లేదు. బీటా అసలు పేరు గుర్తు లేదు గాని యల్. విజయలక్ష్మి లాగా వుండేది. ఆల్ఫా అసలు పేరు వసుంధర. చదువులో కూడా ఫస్టే. మమ్మల్ని అసలు చూసేది కాదు. ఎప్పుడన్నా చూస్తేమాత్రం పురుగుల్లాగా చూసేది. అసలు చూడక పోవడం బెటర్ అనిపించేది. చాలా పొగరుంది అనుకునే వాళ్ళం. నా దృష్టిలో ఆమె అందగత్తే కాని నన్నాకర్షింది బీటా, తీటాలే. బీటా లాగా వుందని యల్. విజయలక్ష్మిని, యల్. విజయలక్ష్మి లాగా వుందని బీటాను ఆరాధించే వాణ్ని. సినిమాలో యల్. విజయలక్ష్మి డాన్సు వస్తే ఆనందంగా చూసేవాణ్ణి.