జీవితం 500

జీవితం…ఊహలు-వాస్తవం మధ్య ఊగిసలాడే లోలకం.
మనిషి జీవితంలో సెక్సు కింత ప్రాథాన్యం వుందేమిటి? సెక్సుకు మగవాడు ఇచ్చేంత ఇంపార్టెన్సు ఆడది ఇవ్వదేమో! ఆవిధంగా ఆడదే ప్రకృతికి దగ్గరగా వుందా? వ్యభిచారవృత్తిలో వున్న ఆడవాళ్ళకు గౌరవం వుండదు. సమాజం వాళ్ళను అసహ్యించుకుంటుంది. వ్యభిచారం చేసే ఆడదాన్ని లంజ అంటారు. ఆమెతో గడిపి వచ్చిన వాడిని లంజడు అనరు. వాడికేంటి మగాడు అంటారు. మగాడికి ఒక ఆడది చాలదు. మగాడికి పెళ్ళికి ముందే సెక్సు అనుభవం వుంటే ఇబ్బందేమీలేదు. ఆడదానికి వుంటే మాత్రం కల్లోలమే. మగాడికి వున్న స్వేచ్ఛ ఆడదానికి లేనట్లేగా.
నాగురించి చెప్పాలంటే సమాజం రుద్దిన విలువల ప్రభావం నామీద ఉంది. వాటిని ఆమోదించే విషయంలో అంతరంగంలో ఘర్షణ జరుగుతూ వున్నది. భవిష్యత్తులో ఈ అపసవ్యాలూ, అన్యాయాలూ అంతరించిపోవాలని ఆశిస్తున్నాను. వ్యభిచారం చేసే ఆడవాళ్ళ పట్ల నాకు గతంలో తేలికభావం వుండేది. ఇప్పుడు నాకు వాళ్ళంటే గౌరవం ఏర్పడింది. వాళ్ళను నేను ప్రేమిస్తాను. వాళ్ళతో సెక్సు చేసే అవకాశం వస్తే ఏం చేస్తానో తెలీదు. సెక్సు చేస్తానా, పవిత్రంగా ప్లెటోనిక్ లవ్ ప్రకటిస్తానా- అది ముఖ్యం కాదు. గాఢంగా వాటేసుకుని ముద్దు పెట్టుకుంటాను. ఇది మాత్రం గ్యారంటీ.
ఇక నాకథ చెబుతాను. మొదట నా చిన్ననాటి సంగతులు.
చిన్న నాటి కబుర్లు