డూప్లికేట్  311

ఇక్కడ హైదరాబాద్ లో వినయ్ కీర్తన సినిమా కీ వెళ్లారు intervel లో కీర్తన popcorn తీసుకొని, కూల్ డ్రింక్స్ తీసుకొని వెనకు తిరిగింది అప్పుడు ఆమె ఎదురుగా వచ్చిన వ్యక్తి మీద డ్రింక్ పడింది” సారీ అండీ చేసుకోలేదు ” అని అనింది కీర్తన తన షర్ట్ మీద పడిన డ్రింక్ తుడుచుకుంటు “పర్లేదు లెండి సిస్టర్” అంటూ కీర్తన వైపు చూశాడు “హే వందన ఎలా ఉన్నావు 1 ఇయర్ అయింది చూసి” అని hug చేసుకో బోయాడు కీర్తన అతని పక్కకు తోసి “హే ఎవరూ నువ్వు నా పేరు వందన కాదు కీర్తన “అని చెప్పి వెళ్లింది అతను మాత్రం కీర్తన వైపే చూస్తూ ఉన్నాడు తను వెళ్లి వినయ్ తో ఉండటం చూసి అతను” రేయి మామ” అని వినయ్ వైపు చూసి అరిచాడు, వినయ్ అతని చూసి కంగారు పడ్డాడు కీర్తన నీ హాల్ లోకి పంపి toilet కీ వెళ్లి వస్తా అని అతని వైపు వస్తున్న వాడిని divert చేశాడు

వినయ్ నీ చూసి అతను వెంట పడ్డాడు తరువాత అతను వినయ్ నీ ఫాలో అవుతూ టాయిలెట్ వైపు వెళ్లాడు లోపలికి వెళ్లాక వినయ్ నీ చూసి “వినయ్ నువ్వే నా” అని అడిగాడు “హాయి రా అబ్దుల్” అని ఆప్యాయంగా ఇద్దరు కౌగిలించుకున్నారు “3 ఇయర్స ఏమీ అయిపోయావు మామ అయిన వందనా ఏంటి నను గుర్తు పట్టనట్లు వెళ్లిపోయింది” అని అడిగాడు అబ్దుల్ “అది అక్కడ ఇక్కడ కీర్తన” అని చెప్పాడు వినయ్ “అదేంటి మామ” అని ఆశ్చర్యంగా అడిగాడు అబ్దుల్ “దానికి ఒక్కో ఊరి లో ఒక్కో పేరు ఒక్కో రూపం సిడ్నీ లో అది వందనా ఇక్కడ కీర్తన అక్కడ ultra modern ఇక్కడ ఫ్యామిలీ టైప్ ఒకే సారి రెండు రోల్స్ చేస్తుంది రా అది” అని కొంచెం బాధ గా చెప్పాడు వినయ్, అంతా విన్న అబ్దుల్ “మరి ఇంకా ఎందుకు దానితో ఉన్నావూ వదిలేయి దాని” అని చెప్పాడు” దాని ఇలాగే వదిలేస్తే ఇంకా ఎంత మంది నీ మోసం చేస్తూందో అందుకే దాని టైమ్ చూసి ఏదో ఒకటి చేస్తా” అని చెప్పాడు వినయ్, ఆ తర్వాత ఇద్దరూ బయటికి వచ్చారు ఎవరి దారి లో వాళ్లు వెళ్లిపోయారు వినయ్ థియేటర్ లో వెళ్లి కీర్తన పక్కన కూర్చుని సినిమా చూస్తూన్నాడు కీర్తన కూడా వినయ్ ఎడమ చెయ్యి చుట్టూ తన రెండు చేతులతో పెనవేసి బుజం కీ తల అణిచి సినిమా చూస్తోంది కీర్తన వినయ్ పేరుకే థియేటర్ లో ఉన్నాడు కానీ సినిమా ఉన్న చోట అతనికి తన గతం కళ్ల ముందు మెదులుతుంది.

1 Comment

  1. Mee Narration chaalaa adbhutamga undi bro!!

Comments are closed.