డూప్లికేట్  311

“అది కాదు తల్లి ఒక్కగానోక కూతురు వీ నిన్ను ఒక మంచి వాడికి ఇవ్వాలి అనేది నా బాధ అందుకే అల్లుడి ని ఆటప్పటిస్తూన్నా సరే నువ్వు వెళ్లి మాకు కాఫీ తీసుకురా ఈలోగా అల్లుడు తో కొంచెం మాట్లాడాలి “అని కీర్తన నీ లోపలికి పంపించి, కమిషనర్ మోహన్ వినయ్ నీ బాల్కనీ లోకి తీసుకు వెళ్లాడు” ఇదిగో వినయ్ ఆ విజయ్ గాడి ఒరిజినల్ post mortem రిపోర్ట్ రామ్ ఇచ్చిన దాని ‘FIR’ లో మార్చి తెచ్చాను “అని వినయ్ కీ post mortem రిపోర్టు చేతికి ఇచ్చాడు, వినయ్ వెంటనే తన దెగ్గర ఉన్న లైటర్ తో ఆ రిపోర్ట్ నీ కాల్చి బూడిద చేసాడు “హమ్ ఇప్పుడు ఏమీ చేద్దాం అని అనుకుంటున్నావు ” అని అడిగాడు మోహన్” నెక్స్ట్ నీ కూతురు “అని చెప్పాడు, అది విన్న మోహన్” ఆ భయం తోనే పరుగు పరుగున వచ్చా చూడు వినయ్ నా కూతురు అంటే నాకూ ప్రాణం అది నీ చేతిలో ఉంది అని నేను నీకు భయపడి నువ్వు ఏమీ చెప్తే అది చేస్తూన్నా అనుకోవడం తప్పు ఏదో జరిగిన కొన్ని సంఘటనల వల్ల నువ్వు అంటే నాకూ ఉన్న అభిమానం తో నీకు సహాయం చేస్తూన్నా” అని చెప్పాడు,” మరి అయితే నను ఏమీ చేయమంటావ్” అని అడిగాడు వినయ్,” నేను ఉన్న అన్ని రోజులు దాని ఏమీ చేయకు నీ కాలు కడిగిన వాడిని కాలు పట్టుకుని బ్రతిమాలా మన చేస్తా please నేను ఉన్నంత వరకు దాని సంతోషంగా చూసుకో తరువాత దాని కర్మ అది అనుభవిస్తూంది ” అని చెప్పాడు మోహన్.

“ఇప్పుడు నీకు ఎమ్ అయింది “అని అడిగాడు వినయ్, “lung cancer advance stage” అని చెప్పాడు మోహన్, “మరి ట్రీట్మెంట్ చేసినా ప్రయోజనం లేదా మామ” అని కొంచెం బాధ గా అడిగాడు వినయ్ “ఎమ్ ప్రయోజనం లేదు ఏదో ఈ జీవితం నీ ఇలా ముగించాలి అని రాసి ఉన్నట్లు ఉంది కాబట్టి ఇలాగే ముగిస్తాను” అని చెప్పి కళ్లు తుడుచుకోంటుండగా “ఏంటి నాన్న ఏదో ముగిస్తాను అంటున్నారు ఎమ్ అయ్యింది “అని కాఫీ ట్రే పట్టుకొని వచ్చింది కీర్తన, “అబ్బే ఏమీ లేదు అమ్మ నా కూతురు నీ బాగా చూసుకో నా సేష జీవితం అందంగా ముగిస్తాను అని అల్లుడు తో అంటున్న ” అని నవ్వుతూ కీర్తన ఇచ్చిన కాఫీ కప్పు తీసుకొని తాగి “సరే అయితే నేను బయలుదేరతాను అసలే కొత్త జంట మీకు చాలా పనులు ఉంటాయి” అని చెప్పి వెళ్లిపోయాడు కీర్తన, వినయ్ బయటి దాకా సాగనంపి వచ్చారు,” బేబి నేను రెడీ అయ్యి వస్తా బయటకి వెళ్లదామా “అని అడిగింది కీర్తన సరే అని తల ఊప్పాడు వినయ్, కీర్తన నవ్వుతూ వినయ్ బుగ్గ పైన ముద్దు పెట్టి లోపలికి వెళ్ళింది, ఇంత లో వినయ్ కీ రాజీవ్ నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ ఎత్తి “ఫోన్ వాడికి ఇవ్వు” అని చెప్పాడు వినయ్ రాజీవ్ తన పక్కనే ఉన్న గోవా” Narcos prohibition ఆఫీసర్ స్టీఫెన్” కీ ఫోన్ ఇచ్చాడు

వినయ్ : రేయి బావ ఎలా ఉన్నావ్

స్టిఫెన్ : సూపర్ రా బావ చాలా రోజులకు పాత ఫ్రెండ్ గుర్తుకు వచ్చాడు

వినయ్ : వాడు అంతా చెప్పాడు కదా

స్టిఫెన్ : హా అంతా నేను చూసుకుంటా

వినయ్ : నా చేతికి మట్టి అంటకుండా జరగాలి

1 Comment

  1. Mee Narration chaalaa adbhutamga undi bro!!

Comments are closed.