డూప్లికేట్  311

మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కళ్యాణ మండపం మొత్తం హడావిడి గా ఉంది, అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నం అయి ఉన్నారు, విజయ్ చెల్లి గౌతమి పెళ్లి కొడుకు రూమ్ వైపు వెళ్లి, పెళ్లి కొడుకు ను రెడీ చేయడానికి వేసి ఉన్న తలుపు పైన కొడుతూన్నా వాడు తలుపు తీయడం లేదు పక్కనే ఉన్న కిటికీ తెరిచి ఉంటే లోపలికి తొంగి చూసింది కానీ లోపల ఎవరూ లేరు అవతల ఇంకో అర్ధ గంట లో ముహూర్తం కానీ వీడు ఎక్కడ అని కంగారు గా వెళ్లి తన అమ్మ నాన్న తో అసలు విషయం చెప్పింది, అప్పటికే పంతులు గారు పెళ్లి కొడుకు నీ తీసుకురమ్మని చెప్పారు కానీ వాళ్లు కంగారు లో ముందు పెళ్లి కూతురు తో జరగాల్సిన పనులు చూడామని చెప్పారు.

అప్పుడు ఎర్రని పట్టు చీరలో ఒంటి నిండా నగల తో తల నిండ పువ్వులు పెట్టుకుని సిగ్గు తో తల ఓంచుకోన్ని వచ్చి పీటల పైన కూర్చొని ఉంది కీర్తన, పేరుకే తన శరీరం ఇక్కడ ఉంది కానీ తన చూపు అంతా విజయ్ కోసం వెతుకుతూంది, ఇక్కడ విజయ్ వాళ్ల అమ్మ నాన్న కంగారు పడుతున్నారు ఆ టైమ్ లో రామ్, విజయ్ ఇద్దరూ ఒక్కటే కార్ లోనుంచి దిగారు, దాంతో అందరూ ఒకేసారి వాళ్లకు ఎదురు వెళ్లి మండపం లోకి తీసుకుని వచ్చారు, “రేయి ఎక్కడికి వేలావు రా ముందు టైమ్ అయింది వెళ్లి రెడీ అవ్వండి” అని విజయ్ నాన్న వాళ్లను తొందరగా లోపలికి పంపాడు “నాన్న నీకు ఒక విషయం చెప్పాలి” అని ఏదో చెప్పడానికి ట్రై చేశాడు విజయ్ కానీ ఎవరూ వినే మూడ్ లో లేరు “అన్ని పెళ్లి అయ్యాక తీరిగా కూర్చుని మాట్లాడదాం ముందు రెడీ టైమ్ అయిపోతుంది “అని విజయ్ నీ బలవంతంగా రెడీ చేసి పీటల పైకి తీసుకు వచ్చారు.

విజయ్ నీ ఓరకంట గా చూస్తూ సిగ్గు పడుతోంది కీర్తన అలాగే కొంచెం కొంటెగా కీర్తన వైపు చూశాడు విజయ్ ఆ తర్వాత కాలు కడిగి కన్యాదానం అయిన తర్వాత పంతులు ఇచ్చిన తాళి తీసుకొని సంతోషంగా కీర్తన మెడ లో కట్టాడు విజయ్, ఆ తర్వాత వచ్చిన వాళ్లు అంతా గిఫ్ట్స, ఫొటో లు కార్యక్రమం అయిపోయాక అప్పుడు అడిగాడు విజయ్ వాళ్ల నాన్న “ఏంటి రా ఏదో చెప్పాలి అన్నావు” అని అడిగాడు అప్పుడు విజయ్ మొహం లో నవ్వు పోయి కొంచెం దిగులు పట్టుకుంది అది గమనించిన వాళ్ల అమ్మ “ఏమీ అయింది నాన్న” అని బుజ్జగించి అడిగింది

దాంతో విజయ్ అందరి వైపు చూసి “అన్నయ్య చనిపోయాడు” అని పిడుగు లాంటి వార్త చెప్పాడు

1 Comment

  1. Mee Narration chaalaa adbhutamga undi bro!!

Comments are closed.