తులసీ 1213

తను ఎప్పుడో చదివిన ‘తులసీ’ వృత్తాంతం ఆక్షణాన అతనికి జ్ఞాపకం వచ్చింది. తులసి పాతివ్రత్యాన్ని మాపితేగానీ దుర్మార్గుడైన ఆమె భర్తని సంహరించలేమని శ్రీమహావిష్ణువు ఆమె భర్తలా రూపం మార్చుకుని ఆమెతో రమిస్తాడు. దాంతో, ఆమె భర్త శంకరుని చేతిలో మరణిస్తాడు.
‘ఇక్కడ నేను చేసిన పాపాల వల్ల ఇవ్వాళ నా భార్యకిలా జరిగింది. ఈ క్షణమే నేనూ చనిపోయాను. ఒక చెడ్డ భర్తగా చ-ని-పో-యా-ను. కానీ, నా భార్య మాత్రం తులసీదేవి అంత పవిత్రురాలు. పూజ్యురాలు… ఎప్పటికీ పతివ్రతే!’
పవిత్ర అతన్ని కదిపి, “ఏంటీ… అంతలా ఆలోచిస్తున్నారు? రుక్మిణి గురించా…! పాపం దాన్నేం అనకండీ… అసలే బిక్కచచ్చిపోయి వుందది!” అందామె.
శివ వెంటనే ముందుకి వొంగి ఆమెను గట్టిగా వాటేసుకుని, “ల్-లేదు. ఇం-కేమీ చెయ్యను… మ్-మాటిస్తున్నాను!” అన్నాడు కళ్ళలో నీళ్ళతో.
★★★
ఆనాటి నుండీ అతను పక్క చూపులు చూడ్డం మానేశాడు. అతనిలో అకస్మాత్తుగా వచ్చిన మార్పుకి పవిత్ర చాలా ఆశ్చర్యపోయింది. ఆతర్వాత చాలా ఆనందపడింది. వారి మధ్య ప్రేమబంధం ద్విగుణీకృతం అయ్యింది.
కొన్ని నెలలు గడిచాక వారిద్దరూ ఒక పాపాయిని దత్తత తీసుకున్నారు.
ఆ పాపకి శివ పెట్టిన పేరు “తులసి”.
బహుశా, పాపచింతనేమో! :-/

— కథ అయిపోయింది —

3 Comments

Comments are closed.