పతి, పత్నీ! 2 1230

అవాక్కయిన రవిని చూస్తూ, “చెప్పు రవీ..” అంది ఆమె. “నువ్వు చెప్పింది నిజమే, నేనెప్పుడూ అలా ఆలోచించ లేదు.” అన్నాడతను. ఆమె నవ్వి “మరో ప్రశ్న అడుగుతా, ఏమీ అనుకోవుగా.” అంది. “అనుకోనులే చెప్పు.” అన్నాడు. “నువ్వు ఎప్పుడైనా హస్తప్రయోగం చేసుకొన్నావా?” అంది ఆమె. అతను మళ్ళీ షాక్ అయ్యి, “హేయ్, ఊరుకో..” అన్నాడు సిగ్గుపడుతూ. “చెప్పొచ్చుగా..” అంది ఆమె గోముగా. “ఊఁ…” అన్నాడతను అలాగే సిగ్గుపడుతూ. ఆమె పకపకా నవ్వి, “మ్…అప్పుడు ఎవరిని ఊహించుకుంటావ్?” అంది. “ఎవరో ఒక సినిమా ఏక్టర్ ని.” అన్నాడు. “ ఇప్పటివరకూ ఎంతమందిని ఊహల్లో చేసి ఉంటావ్?” అడిగింది ఆమె. అతను కాస్త ఇబ్బందిగా చూస్తూ “టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్…అందరూ కలిపి సుమారు ఒక వందమంది ఉంటారు.” అన్నాడు. ఆమె ఫక్కున నవ్వి, “సో, నా శారీరక వ్యభిచారం కంటే, నీ మానసిక వ్యభిచారమే ఎక్కువన్నమాట.” అంది. అతనికి నోట మాటరావడం లేదు. ఉష చెప్పిన దానిప్రకారం చూస్తే, ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ ఏదోరకంగా వ్యభిచారులే అనిపించింది అతనికి. విచిత్రంగా అతనికి తెలియకుండానే అప్పటివరకూ వ్యభిచారంపై ఉన్న విముఖత తొలగిపోతుంది అతనికి. దానికి చిహ్నంగా, తన ఛాతీపై ఉన్న ఆమె చేతిపై, తన చేతిని వేసాడు. ఆమె కాస్త లేచి అతని గుండెలపై తల పెట్టుకుంది. అతని చేయి ఆమె భుజాల చుట్టూ బిగుసుకుంది. ఆమె చిన్నగా అతని ఛాతీపై ముద్దు పెట్టింది. బదులుగా అతను ఆమెని తనలోకి పొదువుకున్నాడు. ఆమె చిన్నగా నిట్టూర్చడంతో, ఆమె ఊపిరి అతని గుండెని కాల్చింది. బదులుగా అతను ఆమె తలపై ముద్దుపెట్టాడు. ఆమె తలఎత్తి అతని మొహంలోకి చూసింది. “నువ్వు శారీరక, మానసిక వ్యభిచారాల గురించి చెప్పావ్. నేను మరో విషయం గురించి అడగనా.” అన్నాడు. “ఊఁ…” అందామె. “వ్యభిచారం అంటే కాంక్షతో తప్పని తెలిసినా చేసేది. అది చేసినా, ఊహించుకున్నా వ్యభిచారమే. మరి మీరాభాయ్ కృష్ణుడితో చేసింది ఏమిటి?” అన్నాడు. ఆమెకి బుర్ర గిర్రున తిరిగింది. చప్పున అతన్ని వదిలి పక్కకి జరిగి కూర్చుంది. అతనూ లేచి కూర్చొని, నవ్వి “నేను ఆమెలా ప్రాపంచిక చింతనలేని ప్రేమని కోరుకోవడం లేదులే, కంగారు పడకు. లోకంలో కేవలం వ్యభిచారులు మాత్రమే లేరు అని చెబుతున్నా. ఇకపోతే, ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పనా.” అన్నాడు. “ఏ ప్రశ్న అది?” అంది ఆమె. “కొంతమంది ఆడపిల్లలు పెళ్ళి అయ్యేంతవరకూ ఎవరితోనూ సెక్స్ చేయరు. అసలు మగాళ్ళనే దగ్గరకి రానీయరు. కానీ ఊహల్లో మాత్రం ప్రభాస్ తోనో, మహేష్ తోనో కాపురం చేసేస్తుంటారు. వీళ్ళు శారీరక కన్యలు. కొంతమంది చాలామందితో పడుకుంటారు, నా లాగ. కానీ వాళ్ళ ఊహల్లో కనీసం ఒక్క మగాడితోనూ కాపురం చేయరు. వీళ్ళు మానసిక కన్యలు. నీకు ఏ రకమైన కన్య కావాలీ? అని అడిగావు కదా.” అన్నాడు. “ఊఁ..” అంది ఆమె. “నాకు నువ్వు కావాలి.” అన్నాడు. ఆమె జీవితంలో ఎప్పుడూ అంత షాక్ అవ్వలేదు. నిజానికి ఆమెకి ఆ ఆఫర్ కొత్తకాదు. చాలామంది విటులు కాస్త సుఖం పొందిన తరువాత రోటీన్ గా అదే అడుగుతారు, “నన్ను పెళ్ళి చేసుకుంటావా…లేదా…నాతో ఉండిపోతావా..” అని. కానీ అదంతా తాత్కాలిక ఉన్మాదంలో అడిగేవే. కానీ ఇతను ఒక స్థిర నిర్ణయంతో అడిగినట్టుగా ఉంది. అందుకే ఏం జవాబు చెప్పాలో అర్ధం గాక అలాగే ఉండిపోయింది.

(రెండవ కథ సమాప్తం.)

6 Comments

  1. Nice bro ninu edhi ninu shat filem thiyala bro

  2. What a story, extraordinary …. Excellent… Really awesome…

  3. What a story touched to the heart need these kind of stories

  4. I think this is the my fast comment really good story

Comments are closed.