పతి, పత్నీ! 2 1229

ఎదురుగా నిలబడి ఉంది ఒక పాతికేళ్ళ యువతి. ఆప్యాయంగా అతని భుజాన్ని నిమురుతూ “ఏమయ్యింది సోదరా?” అని అడిగింది. ఆమె తనకి సహాయం చేయగలదని ఆశ పుట్టింది రవికి. జరిగిన విషయం చెప్పాడు. ఆమె చిన్నగా నవ్వి, “నా కూడా రా.” అని, రవిని తన కూడా ఒక ఆశ్రమానికి తీసుకుపోయింది. చాలా ప్రశాంతంగా ఉంది అక్కడి వాతావరణం. దాన్ని పట్టించుకోకుండా, ఆత్రంగా చుట్టూ చూసాడు ఉష కనిపిస్తుందేమోనని. అది గమనించిన ఆ స్త్రీ, నలుగురు వ్యక్తులని పిలిచి, ఉష వివరాలు చెప్పి, వెదికి తెమ్మని పంపించేసింది. తరువాత రవితో “కూర్చో సోదరా, తప్పకుండా ఆమె దొరుకుతుంది.” అంది. రవి బేలగా చూసాడు ఆమెని. ఆమె ప్రశాంతంగా నవ్వుతూ “అంతగా తల్లడిల్లిపోతున్నావ్. ఇంతకూ ఆమె నీకేమవుతుంది?” అని అడిగింది. ఏదో జవాబు చెప్పబోయి ఆగిపోయాడు రవి. “అవును, ఆమె తనకి ఏమవుతుంతుంది?” అనిపించింది. అదే విషయం ఆమెకి చెప్పాడు. “సరే, ఆమె నీకేమవుతుందో నేనే చెబుతా. నీ గురించి, ఆమె గురించి పూర్తిగా చెప్పు.” అంది.

రవి చెప్పడం ప్రారంభించాడు. చెబుతూనే ఉన్నాడు. చివరకి మొత్తం చెప్పేసాడు. అంతా విన్న తరువాత ఆమె నవ్వుతూ “అదేంటి సోదరా, నీ గురించి చెప్పమంటే, అంతా ఆమె గురించే చెప్పావ్? ఆమె నీ జీవితంలో లేనప్పుడు చెప్పుకోదగ్గ జీవితమే లేదా నీకు?” అంది. బుర్ర గిర్రున తిరిగింది రవికి. “ఏంటీ, మొత్తం ఆమె గురించే చెప్పానా నేను? ఆమె లేనప్పుడు నేను లేనా?” అని అనుకోసాగాడు. అతని ఆలోచనల్ని చదివిన ఆమె “నీ ప్రశ్నలకు జవాబు దొరకాలంటే, ఒక కథ తెలియాలి. తెలుసుకుంటావా?” అంది. తెలుసుకోవాలన్న ఆత్రం రవికి కూడా కలగడంతో “చెప్పండి.” అన్నాడు. ఆమె ఆలోచిస్తూ, “ఇందులో రెండు ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. ఒక యువతి, ఒక యువకుడు. ఏం పేర్లు పెట్టాలబ్బా!!” అని, రవితో “ఏవో పేర్లు ఎందుకు? మీ పేర్లే పెడతా. రవి, ఉష.” అన్నది. ఆమె నోటి వెంట “ఉష” అన్న పేరు వినబడగానే, అతని మొహంలో నవ్వులు ఉదయించాయి. ఆమె చెప్పడం ప్రారంభించింది.

రెండవ కథః

రవి ఇరవై రెండేళ్ళ యువకుడు. డిగ్రీ పూర్తవగానే, స్నేహబృందం సరదాగా టూర్ చేయడానికి ప్లేన్ చేసింది. రవి కూడా సరేనని వాళ్ళతో బయలుదేరాడు. నలుగురు మిత్రులూ రవి, కిరణ్, శరత్, రాజు, రెండు కార్లలో బయలుదేరారు. “నలుగురు వెళ్ళడానికి ఒక కారు చాలుకదా? రెండు ఎందుకూ?” అన్నాడు రవి. మిత్రులు ముసిముసిగా నవ్వారే తప్ప, జవాబు చెప్పలేదు. అతని ప్రశ్నకు జవాబు ఊరి శివార్లకు వచ్చిన తరువాత దొరికింది. అక్కడ నలుగురు అమ్మాయిలు వీళ్ళకోసం వేచిఉన్నారు. వాళ్ళని చూడగానే రవి కంగారుగా “ఒరేయ్! వద్దు, నాకు ఇలాంటివి ఇష్టం లేదు.” అన్నాడు. అదివిన్న కిరణ్ “నీకు ఇష్టం లేకపోతే ఏమీ చెయ్యకు. వాటా కోసం మాత్రం ఒక అమ్మాయిని నీ పక్కన ఉంచుకో.” అని, మిగిలిన వాళ్ళతో “ఒరేయ్, ఎవరికి ఏ అమ్మాయి కావాలో సెలెక్ట్ చేసుకోండ్రా.” అన్నాడు. వాళ్ళ సెలెక్షన్ పూర్తి అయ్యేసరికి, ఒక అమ్మాయి మిగిలిపోయింది. ఆమె మిగిలిపోవడానికి కారణం, మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఆమె సాధారణంగా ఉండడమే. ఆమెని రవి వైపుకి తోసి, కిరణ్ అందరితో చెప్పాడు, “టూర్ అయ్యేవరకూ వీళ్ళే మన పెళ్ళాలు. మార్చుకోవడాలు లేవు.” అని. అందరూ సరే అనగానే, ఒక్కొక్కరూ తాము సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిల పేర్లు తెలుసుకోసాగారు. రవి కూడా తన వాటాకొచ్చిన అమ్మాయిని మొహమాటంగానే “నీ పేరేమిటీ?” అని అడిగాడు. “ఉష.” అని చెప్పిందామె.

6 Comments

  1. Nice bro ninu edhi ninu shat filem thiyala bro

  2. What a story, extraordinary …. Excellent… Really awesome…

  3. What a story touched to the heart need these kind of stories

  4. I think this is the my fast comment really good story

Comments are closed.