పతి, పత్నీ! 2 1230

“కథను చెప్పి, నువ్వు అడిగిన ప్రశ్నకు నువ్వే ఇచ్చిన జవాబు. దాని అర్ధం ఏమిటీ? నేను చెప్పింది కరెక్టా, కాదా?” అన్నాడు. ఆమె చిన్నగా నవ్వి “ఆ ప్రశ్నకి జవాబు మన మనసు మీదే ఆధార పడి ఉంటుంది.” అని, అదే కాగితంపైన ఏదో రాసి, మళ్ళీ అతని జేబులో ఉంచి, “ఈసారి, మళ్ళీ ఆలోచించి జవాబు చెప్పు. నేను రాసిన సమాధానం, నువ్వు రాసిన సమాధానం ఒకటే అయితే..” అని చిన్నగా నవ్వింది. అతను ఉత్సుకతతో “మ్..ఒకటే అయితే!?” అన్నాడు. ఆమె నవ్వుతూనే టెంట్ వైపు చూసింది. అతనికి అర్ధమై పోయింది. ఉత్సాహం వచ్చింది. దానితో పాటే కాస్త భయం కూడా. ఇద్దరి సమాధానం ఒక్కటి కాకపోతే ఎలా? సతమతమవుతూ ఆలోచించసాగాడు. తరచి తరచి ఆలోచిస్తే అతనికి ఒకటే సమాధానం తట్టింది. అదే ఆమె సమాధానం కూడానా? ఎక్కడో చిన్న అనుమానం. కానీ చెప్పి తీరాలి. ఇక ఆగలేక చెప్పేసాడు. ఆమె మొహంలో ఏ భావం లేకుండా అతన్నే చూస్తుంది. అతను అనుమానంగా, ఆమె తన జేబులో పెట్టిన చీటీని తెరిచాడు.

తను చెప్పిన సమాధానం వేశ్య (హేమంత) అని. ఆమె చీటీలో రాసిన సమాధానం కూడా అదే. అంతే కాదు, దానికింద మరొకటి రాసిఉంది. “భార్యాభర్తలు ఒకరి గురించి ఒకరు అలోచించడం సహజం. కానీ ఒక వేశ్య తన వైఫల్యాన్ని నిజాయితీగా ఒప్పుకొని, వెనక్కి వెళ్ళిపోయిందంటే ఆమే కదా గ్రేట్.” అని. ఎందుకో అతను దాన్ని అంగీకరించలేకపోయాడు. అది చదివిన తరువాత, ఆమె వైపు చూసి “మన ఇద్దరి జవాబూ ఒకటే, సో ఇక్కడితో నేను పూర్తిగా గెలిచినట్టేగా!?” అన్నాడు. “అంతే కదా.” అంది ఆమె చిరునవ్వుతో. “కానీ నేను గెలవలేదు. ఎందుకంటే, జవాబులు ఒకటే అయినా, విశ్లేషణలు వేరు.” అన్నాడతను. “మరి నీ విశ్లేషణ ఏమిటీ?” అంది ఆమె. అతను ఏదో కలలో తేలిపోతున్నట్టు చెప్పసాగాడు “ నీ కథలో ఒక సన్నివేశం గుర్తుంది నాకు. హేమంత రాజుని వదలి, శిరీష దగ్గర తన ఓటమిని ఒప్పుకోవడానికి ముందు సన్నివేశం. ఆమె అలాగే చూస్తూ ఉండిపోయింది చాలాసేపు. తరువాత నెమ్మదిగా లేచి, బెడ్ రూమ్ లోకి నడిచింది. అతను నిద్రపోతూ కనిపించాడు. రెండుక్షణాలు అతని మొహాన్ని చూసి, తన బేగ్ దగ్గరకి నడిచింది. దాన్ని తెరిచి, లోపలనుండి ఒక కవర్ తీసి, శిరీష షెల్ప్ లో పెట్టింది. తరువాత రాజు దగ్గరకి వచ్చి, అతనికి నిద్రాభంగం కలిగించకుండా నుదుటిపై ముద్దు పెట్టింది. ఆమె కళ్ళలో సన్నని నీటిపొర. ఆమె తన వృత్తి ధర్మం నిర్వర్తించలేక, అక్కడనుండి వెళ్ళిపోతే, ఆమె కంట్లో నీళ్ళు ఎందుకు తిరుగుతాయ్? అతన్ని అంత వరకూ రెచ్చగొట్టగలిగిన జాణకి, అతన్ని లొంగదీసుకోవాలని మనస్పూర్తిగా అనుకుంటే, మరొక్క రోజు చాలు కదా. నిజానికి ఆమె వెళ్ళిపోవడానికి కారణం, వృత్తిపరంగా తను ఓడిపోయానని కాదు. ఒక వ్యక్తిగా, అతన్ని ఓడించడం ఇష్టం లేక.” అని, అతను తలవంచుకొని నిలబడ్డాడు. ఆమె అతనికి దగ్గరగా వచ్చి చెప్పసాగింది. “నేనంటే నీకెంత ఇష్టమో, నీ వేదన ద్వారా తెలియజేసావు. ఈ విశ్లేషణ ద్వారా, నువ్వంటే నాకెంత ఇష్టమో చెప్పడానికి మాటల్లేకుండా చేసావ్. నువ్వు నిజంగా మగాడివి”. ఆమె మాటలు సగం మాత్రమే అర్ధమయ్యాయి అతనికి. మిగిలిన సగం అర్ధమయ్యేసరికి, ఆమె పెదవులు అతని పెదవుల్ని మూసేసాయి. ఒక కన్నెపిల్ల స్వచ్చందంగా ఇచ్చిన ముద్దు అది. అతను గెలిచాడు అన్నదానికి అంతకంటే నిదర్శనం ఏం కావాలి?

ఆమె వదులుతున్న ఊపిరి వెచ్చగా అతని ముక్కుకి పక్కన తాకి గిలిగింతలు పెడుతుంది. అంతవరకూ ఒద్దికగా ఉన్న ఆమె పెదవులు చెప్పలేనంత అల్లరి చేస్తున్నాయి. అంతటి శృంగార పురుషుడు, అమె పెదవి కాటుకి గిలగిలలాడిపోతున్నాడు. ఆమె మాత్రం, తన పెదవి కాటు ద్వారా, తన ప్రేమామృతాన్ని అతనికి పంచుతూనే ఉంది. అంతకు ముందు తన పంటి దెబ్బకు చిట్లిన అతని పెదవిని తన నాలుకతో పరామర్శించింది. అందుకు కృతజ్ఙతగా అతని నాలుక కొన, ఆమె నాలుకని స్పర్శించింది. రెండింటి మధ్యా స్నేహం కుదిరింది. వెన్నెలతో కూడిన మంచు ఇద్దరినీ అభిషేకిస్తుంది. ఇద్దరిలో మరింత వేడిని రగిలించడానికి, చల్లని గాలి వాళ్ళ శరీరాలని తాకుతుంది. సన్నని వణుకుని, తమకపు వేడితో కప్పేస్తూ, ఒకరిని ఒకరు హత్తుకున్నారు. తన స్తనద్వయం అతని ఛాతీకి హత్తుకోగానే ఎక్కడలేని సిగ్గూ ముంచుకు వచ్చింది ఆమెకు. చటుక్కున అతని నుండి దూరం జరుగుతూ, ఆ మాత్రం దూరమే విరహాన్ని పెంచగా, మళ్ళీ అతుక్కుపోయింది అతన్ని. ఆమె వెన్నుపై నెమ్మదిగా నిమురుతూ, ఆమెని స్వాంతన పరుస్తున్నాడతను. తన్మయత్వంగా అతని మెడవంపులో తల దాచుకుంది ఆమె. తనకు దక్కదూ అనుకున్నప్పుడు ఆత్రం గానీ, సొంతమయ్యాకా, అనుభవమే తప్పా, ఆత్రం ఉండదు కదా. ఆ అనుభవాన్ని తమ మనసులోకి వంపుకుంటూ అలాగే ఉండిపోయారు ఇద్దరూ. మళ్ళీ తూర్పున రవి ఉదయించి, తన ఉషా కాంతులతో పలకరించేంత వరకూ, ఈ లోకం అంటూ ఒకటి ఉందని గుర్తు రాలేదు వాళ్ళకి. ఆ కిరణాల వేడికి ఇద్దరూ విడివడి, ఒకరిని చూసి ఒకరు గుంభనంగా నవ్వుకొని, అక్కడనుండి బయలుదేరారు.

6 Comments

  1. Nice bro ninu edhi ninu shat filem thiyala bro

  2. What a story, extraordinary …. Excellent… Really awesome…

  3. What a story touched to the heart need these kind of stories

  4. I think this is the my fast comment really good story

Comments are closed.