పతి, పత్నీ! 2 1230

“మ్..కథంతా పూర్తిగా విన్నావుగా సోదరా!” అంది ఆమె రవితో. “అదేంటీ, పూర్తిగా చెప్పనే లేదుగా.” అన్నాడు రవి ఆశ్చర్యంగా. “ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి నువ్వు ఏ జవాబు చెబుతావో, అదే ఈ కథకు ముగింపు.” అంది ఆమె. అతను అలాగే చూస్తున్నాడు ఆమెను. “అడగనా?” అంది ఆమె. “అడగండి.” అన్నాడతను.

“కథలో రవి ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? అతని నిర్ణయానికి ఉష ఏం జవాబు చెప్పాలి? జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. ఈ సమాధానం లోనే నీ ఉష నీకు దొరుకుతుందో లేదో తెలుస్తుంది. కథలో ఉష చెప్పే జవాబు మరీ ముఖ్యం.” అంది ఆమె. అతను ఆలోచించసాగాడు. అతను ఆలోచనల్లో ఉండగానే, అతని తలపై ఎండ పడుతున్న ప్రదేశంలో నీడ వచ్చింది. అతను ఆ విషయాన్ని గమనించనంత ఆలోచనల్లో మునిగిపోయాడు.

అతను ఆత్రంగా ఏదో సమాధానం చెప్పబోయాడు గానీ, “ఈ సమాధానం లోనే నీ ఉష నీకు దొరుకుతుందో లేదో తెలుస్తుంది.” అన్న వాక్యం అతన్ని తొలిచేస్తుంది. ఒకవేళ తప్పు సమాధానం చెబితే ఉష తనకు దొరకదేమో! ఆ ఆలోచనకే అతను వణికిపోయాడు. “నాకు ఉష కావాలి. ఆమె హాయిగొలిపే చిరునవ్వు కావాలి. గిలిగింతలు పెట్టే ఆమె మోహనమైన కొనచూపు కావాలి. వేసవిలో మల్లెపూలలా మత్తుని జల్లే ఆమె మాటలు కావాలి. ఇంద్రధనుస్సులో మెరుపులని చమత్కారంగా ఇముడ్చుకున్న ఆమె మేనిమెరుపు కావాలి. శీతాకాలంలో వెచ్చదనాన్ని ఇచ్చే ఆమె సొగసులూ, వర్షాకాలంలో తడవనీయకుండా తనలోనే దాచుకొనే ఆమె నిండైన హృదయం కావాలి. నా ఉష నాకు కావాలి.”. అలా అనుకున్న తరవాత స్థిర నిశ్చయంతో ప్రశాంతంగా కూర్చొని ఆలోచించసాగాడు కథ లోని రవి, ఉషల గురించి.

రవికి ఉషలో కట్టిపడేసిన అంశాలు ఏమిటీ? కథను పూర్తిగా గుర్తు తెచ్చుకున్నాడు. ఉష గురించి మననం చేసుకున్నాడు. ఆమె ఒక వేశ్య. వచ్చిన అందరితో పోలిస్తే అందవిహీనంగా ఉంది. అందుకేగా అందరూ ఆమెని తిరస్కరిస్తే, రవి దగ్గరకు వచ్చిందీ. వాళ్ళు తిరస్కరించారే గానీ, ఆమె రవి దగ్గర చూపిన ప్రవర్తనలో ఎక్కడా ఆ న్యూనతా భావం(inferiority) కనబడలేదు. అసలు డబ్బులకోసం పడుకోడానికి వచ్చిందన్న భావనే లేదు ఆమెలో. తను చేస్తున్న పనిని చాలా సహజంగా, ఒక విశ్వాశం(conviction)తో చేసింది. అతనిపై చేయి వేసినప్పుడు గానీ, అతనితో మాట్లాడినప్పుడు గానీ, అతని పక్కన పడుకున్నప్పుడు గానీ…తను తప్పు చేస్తుందన్న భావనే ఆమెలో కనబడలేదు. తప్పు, ఒప్పు రెండూ మానసిక భావనలే కదా. ఆ భావనే లేనప్పుడు ఆమె తప్పు చేసినట్టు కాదు కదా. తప్పు చేయకపోతే అంతా స్వచ్చంగానే ఉంటుంది కదా. ఆ స్వచ్చతే కదా కన్నెతనం అంటే. ఆ కన్నెతనమే కదా రవికి కావలసింది. అతనికి కావలసింది దొరికినపుడు మరి ఎందుకు వదులుతాడు. అందుకే ఆమెతో “నాకు నువ్వు కావాలి.” అని అడిగాడు.

ఈ విధంగా విశ్లేషించిన తరువాత, అదే విషయాన్ని ఆవిడతో చెప్పాడు రవి. ఆమె చిరునవ్వు నవ్వింది. “మరి అతను అడిగిన దానికి ఉష సమాధానం ఏమిటీ?” అంది ఆమె. మళ్ళీ ఆలోచించసాగాడు రవి.

కథలో ఉషకి రవి “నువ్వు నాకు కావాలి.” అని చెప్పగానే, ఆమె ఏమంటుంది? అప్పటికే తన శరీరాన్ని చాలామందితో పంచుకుంది. రవి అంతవరకూ ఏ అమ్మాయినీ తాకలేదు. సాధారణంగా ఆ స్థితిలో ఉన్న ఏ అమ్మాయి అయినా, మొహమాటానికో, లేదా తను అతనికి తగననో, అతని ఆఫర్ ని వెంటనే తిరస్కరిస్తుంది. కానీ ఉష చాలా స్వచ్చమైంది. ఆమె ఇచ్చే సమాధానం రవి పైనే ఆధారపడి ఉంటుంది.

6 Comments

  1. Nice bro ninu edhi ninu shat filem thiyala bro

  2. What a story, extraordinary …. Excellent… Really awesome…

  3. What a story touched to the heart need these kind of stories

  4. I think this is the my fast comment really good story

Comments are closed.