ప్రాజెక్ట్ – Climax 137

మరో వైపు ఏపీ లో అన్ని పార్టీ లు తమ అభిప్రాయాల్ని చిత్రం గా చెప్పడం మొదలెట్టాయి జనానికి…మరో వైపు సీఎం ప్రకటించాడు “నేను డివిజన్ కి ఒప్పుకోను”అని..
మరో ఉద్యమ పార్టీ లు “పది జిల్లాలు కావాలి “అంటే
ప్రాంతీయ పార్టీ “రెండు సగాలు చేయాలి కర్నూలు ,అనంతపురం అటు ఉండాలి”అంటున్నాడు..
++++
“అసలు మొదటి నుండి చూసిన చిదంబర రహస్యం గారు సరిగా deal చేయలేదు అని నా ఫీలింగ్ “అన్నాడు పీఎం రామ్.
“నో నో నేను అందరినీ ఒప్పించాను అన్నారు చిదంబర రహస్యం గారు..
మళ్లీ “అక్కడ ఆత్మ హత్య లు చేసుకుంటే ఏమిటి స్థితి “అన్నారు చిదంబర రహస్యం గారు.
“తమిళ్ నాడు లో మనం ఎలాగూ లేము దీని దెబ్బకి తెలంగాణ ,ఆంధ్రాలో కూడా పోతమేమో”అన్నాడు పీఎం..
మీటింగ్ లో రజియా కూడా ఉంది “ఆపొద్దు పని కంటిన్యూ చేయండి “అంది.
చిదంబర రహస్యం “మాడం కి అర్ధం అయింది”అన్నాడు హ్యాపీగా.
“గొడవలు పెరుగుతాయి మాడం “అంది సౌందర్య…
“కాబినెట్ లో ఫైల్ కదపండి “అంది రజియా..
++++
ఎవరు తన మాట వినక పోవడం వల్ల రామ్ కాబినెట్ లో ok చేశాడు…
ఆంధ్ర ,రాయల సీమ భగ్గు మన్నాయి, ఏపీ లో సీఎం సపోర్ట్ తో ఉద్యోగులు ఉద్యమం మొదలెట్టారు…పార్టీ చిలిపోవడం మొదలు అయ్యింది..
++++
“ఈ రోజు ఎంపీ లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ను కలిశారు…ఇక పార్టీ ఆంధ్ర లో పోయినట్టే”అన్నాడు ఆ రాత్రి రామ్ సిగరెట్ వెలిగిస్తూ..
“పొరపాటు రామ్ తెలంగాణ లో కూడా పోతుంది,,ఉద్యమ నాయకుడు పార్టీ నీ కలపడు,,సో రెండు చోట్ల పోతుంది”అంది రజియా..
“నేను pm గ ఉండగా జరగడం నా దురదృష్టం..అక్కడి సీఎం కొత్త పార్టీ పెడుతున్నాడు,,,మరో వైపు యువ నాయకు డు గగన్ జనాన్ని తిప్పు కుంటున్నాడు తన వైపు ,, ఇక x సీఎం బాబు అయితే భారతీయ ప్రజా పార్టీ తో ఎలక్షన్ కి వెళ్తాడు…అయిపోయింది మన పార్టీ సర్వనాశనం “అన్నాడు పీఎం..
రజియా నవ్వేసింది ,”ఎందుకు నవ్వుతున్నావ్ “అడిగాడు అర్థం కాక..
“మీరు పార్టీ అధ్యక్షుడు చెప్పిన ప్రతి దానికి తల ఊపి తే ఇలాగే ఉంటుంది “అంది రజియా పడుకుంటూ.
“టూ మచ్ ,నువ్వు కూడా ఒప్పుకున్నావు”
“అవును ,నేను నో అన్నా చిదంబర రహస్యం గారు చెప్పినట్టు అధ్యక్షుడు వింటారు,,ఎందుకు అంటే చిదంబర రహస్యం గారు మేధావి అని అందరి నమ్మకం ,మీక్కూడా లేకపోతే ఆయనకి ఈ బాధ్యత ఎందుకు ఇచ్చారు….ఇక రాష్ట్రం లో అన్ని పార్టీ లు ,మన సీఎం అందరూ డ్రామా లో ఉన్నారు,,ఎవరి భవిశ్యతు వారికి ముఖ్యం,జనానికి డివిజన్ కావాలి ,,సో చిక్కు ముడి…..దెబ్బ మాత్రం మి పార్టీ కి,,పీఎం గా మీకు”అంది ..
రామ్ కుమార్ కూడా పడుకుంటూ “అవును దేశం లో ,బయట చాలా సమస్యలు “అన్నాడు కళ్ళు మూసుకుని…
+++++
రెండో రోజు కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ కి రజియా కూడా వెళ్ళింది….
వాళ్ళ ఫైల్ చూసి “ఇదేమిటి కొత్త స్టేట్ కి రాజధాని ఎక్కడో రాయలేదు…అప్పు అరవై వేల కోట్లు ఎవరికో చెప్పలేదు”అంది..
“అది కష్టం మాడం ,,అప్పు పంచడానికి ఇంకో కమిటీ వేద్దాం…ఇక కొత్త రాజధాని చెప్పకుండా ఇవ్వాలి అని పార్టీ అధ్యక్షుడు చెప్పారు”అన్నాడు రమేష్…మినిస్టర్ రమేశ్.
రామ్ కుమార్ విసుగ్గా “అదేమిటి రాజదాని చెప్పకుండా విభజన ఎలా”అన్నాడు..
“అప్పుడు అక్కడ కొత్తగా వచ్చే సీఎం జుట్టు పిక్కుంటాడు,,,రాయలసీమ లో కావాలని ఆంధ్ర లో కావాలని గొడవలు జరుగుతాయి”అన్నాడు పార్టీ అధ్యక్షుడు..

1 Comment

  1. There is no new updates since 11th onwards.

Comments are closed.