ప్రాజెక్ట్ – Climax 137

++(+
“ఈ సమస్య కి చిదంబర రహస్యం గారు చెప్పిందే పరిష్కారం అనుకున్నాను ,,ముందు పార్టీ నిలబడింది ,, జనానికి నా మీద గౌరవం పెరిగింది…మోసం చేద్దం అనుకున్న ఉద్యమ నాయకులు దెబ్బ తిన్నారు…నేను జరిగింది నమ్మలేక పోతున్నాను,,, థాంక్స్ విద్య ,, ఐ లవ్ యూ బంగారం”అంటూ ముద్దు పెట్టాడు పీఎం రామ్ కుమార్ రజియా కి….

కాశ్మీర్ లో ప్రెసిడెంట్ రుల్ ఉంది…పార్లమెంట్ సమావేశాలు ఇంకా కాలేదు….ఈలోగా అక్కడ మూక దాడులు మొదలు పెట్టారు అజాద్ కాశ్మీర్ అంటూ…
పార్లమెంట్ లో భారతీయ ప్రజా పార్టీ నాయకులు దీన్ని ప్రస్తావించారు…”మేము ఎప్పడినుండో చెప్తున్నాం ఆర్టికల్ 370 ను రద్దు చేయాలని…ఈ అజాద్ కాశ్మీర్ అనే వారికి అదే దెబ్బ…”అన్నాడు వాళ్ళ లీడర్..
రామ్ కుమార్ లేచి నిలబడ్డాడు..”అధ్యక్షా ,, మనం 370 రద్దు చేస్తే ,,పాకిస్తాన్ తన వద్ద ఉన్న అజాద్ కాశ్మీర్ ను కలిపేసుకుంటే అప్పుడు మనం ఏమి చేయాలి….మనం తీర్మానం చేసుకున్నాము మొత్తం కాశ్మీర్ మనదే అని”అని చెప్పారు…
+++++
అదే టైమ్ కి పాక్ పీఎం ప్రకటించాడు “నేను త్వరలో ఇండియా పీఎం తో శిఖరాగ్ర సమావేశం జరపబోతున్నాను….యుద్దానికి మేము సిద్దం”అన్నాడు….
(++++
ఆ సాయంత్రం సౌందర్య పీఎం ఇంటికి వచ్చింది మినిస్టర్ తో కలిసి..
పార్టీ వారు,మినిస్టర్ లు కూడా ఉన్నారు మీటింగ్ లో…
సుమతి లేనపుడు అడిగింది రజియా “ఏమంటోంది విద్య మాడం”…
సౌందర్య “మీకు తెలుసు అని నాకు తెలుసు,,ఆవిడ పీఎం కి చెడ్డ పేరు రాకుండా రీప్లేస్ అవ్వలనుకుంటోంది…”అంది..
రజియా “నేను చాలా కోట్లు సంపాదించాను,, హవాలా వ్యాపారులతో మాట్లాడుతున్నాను.,,నేను తప్పు కుంటాను…”అంది
సౌందర్య “సో రజియా సుల్తానా కథ అయిపోయింది…అంతేగా”అంది..
“అవును కానీ వెళ్ళే ముందు ఇండియా , పాక్ రెండిటికీ మంచి చేస్తాను “అంది రజియా…
సౌందర్య కి అర్థం కాలేదు…
వెళ్లి మీటింగ్ లో కూర్చున్నారు ఇద్దరు…
“భారతీయ ప్రజా పార్టీ ను కట్టడి చేయాలి “అన్నాడు పార్టీ అధ్యక్షుడు…
“మీకు ఆర్టికల్ 370 రద్దు చేయడానికి ఏమిటి ప్రాబ్లెమ్ “అడిగింది రజియా..
పార్టీ వాళ్ళు చిరాగ్గా చూశారు ,,ఎప్పుడు ప్రచారానికి విద్య ను వాడుకోవడం తప్ప ఇలా సలహాలు ఇస్తే చిరాకు వస్తుంది వారికి..
“పార్లమెంట్ లో చెప్పాను కదా ,,అజాద్ కాశ్మీర్ ను పాక్ లో కలిపెస్తారు “అన్నాడు రామ్..
“మీకేమి పాక్ లో కలుపుకుంటే “అంది రజియా..
“అదేమిటి అది మనదే “అన్నాడు పార్టీ సెక్రెటరీ..
“ఎలా”
“స్వతంత్రం వచ్చాక రాజ హరి సింగ్ జమ్ము కాశ్మీర్ మన దేశం లో కలుపుతూ ఒప్పందం చేసుకున్నారు…అప్పటికే పాక్ కొంత కబ్జా చేసుకుంది , అదే అజాద్ కాశ్మీర్ ,,దానికి ప్రెసిడెంట్,పీఎం ఉంటారు…ఆర్మీ పాక్ ది.. మనం ప్రత్యేక స్థితి ఇచ్చాము..అదే 370…అక్కడ ఎవరు బయట వారు వ్యాపారం చేయరాదు,,భూమి కొనరాదు..ఇలా చాలా ఉన్నాయి…ఐపిసి కూడా ఉండదు..”అన్నాడు పీఎం రామ్..
రజియా టీ తాగుతూ “అయితే ఎవరికి ఉపయోగం”అంది…
ఎవరు మాట్లాడలేదు,,చిరాగ్గా చూశారు..

1 Comment

  1. There is no new updates since 11th onwards.

Comments are closed.