ప్రేమ బాధ సెక్స్ – 3 90

ఆ తర్వాత ప్రియాంక కాఫీ తీసుకొని వచ్చింది

ప్రతాప్ : మా అమ్మాయి ప్రియాంక అని పరిచయం చేశాడు

వినయ్ : హలో అని చెప్పాడు

ప్రియాంక : హయ్ అని చెప్పింది

వినయ్ : సారీ ఇందాక జరిగిన విషయానికి

ప్రియాంక : పర్లేదు అని కాఫీ ఇచ్చింది

ఆ తర్వాత ప్రియాంక తన రూమ్ లోకి వెళ్లింది తన బుక్ లో మళ్లీ జరిగిన విషయం నీ కవితలా రాయడం మొదలు పెట్టింది.

“కలలు పొంగాయి నా నిద్ర లో
పదాలు రాళ్లాయి నా పెదవి నుంచి
నా గుండె అదుపు తప్పింది నీ ప్రేమ తో నిండి
నువ్వు రంగువ
నువ్వు నా రెక్కలవా
నా కళ్లకు రహదారి వా”

ఆ తర్వాత వినయ్, ప్రతాప్, అస్లాం అంతా బ్రేక్ ఫాస్ట్ కోసం కూర్చున్నారు అప్పుడే ప్రియాంక కూడా వచ్చి వాళ్ల తో కూర్చుంది” సార్ నేను ఇది కచ్చితంగా చెప్పాలి మామూలుగా సిటీ లో ఉండే అమ్మాయి లు మోడర్న్ గా ఉండడానికి ట్రై చేస్తారు కానీ మీ అమ్మాయికి మన ట్రేడిషన్స్ మీద ప్రేమ అనుకుంటా చాలా పద్ధతి గా డ్రస్సింగ్ ఉంది” అని పోగిడాడు వినయ్ దాంతో కొంచెం సిగ్గు పడింది ప్రియాంక.

(ఇది ఇలా ఉంటే అక్కడ సాహితీ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం)

ఆ రోజు రాత్రి వినయ్ వచ్చి గొడవ చేసిన తరువాత సాహితీ వాళ్ల నాన్న సాహితీ ఫోన్ తీసుకొని పొగల కొట్టి అప్పటికి అప్పుడు తన ఫ్రెండ్ ట్రావెలింగ్ ఏజెన్సీ తో మాట్లాడి హైదరాబాద్ కీ కార్ మాట్లాడి అక్కడి నుంచి ఢిల్లీ కీ ఫ్లయిట్ లో వెళ్లి పోయారు, అక్కడ తన ఫ్రెండ్ విష్ణు ప్రసాద్ శర్మ ఇంటికి వెళ్లారు ఆయన ఢిల్లీ లోని ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ కీ యజమాని ఆయన కు ఉన్న ఒక కూతురు చిన్నప్పుడే చనిపోవడంతో ఆయన కిరణ్ నీ చూసి తన కొడుకు గా దత్తత తీసుకొని తన కంపెనీ అధికారాన్ని కిరణ్ చేతికి అందించాడు, అలా కిరణ్ తనకు ఎలాంటి అడ్డు ఉండదు అని నిర్ణయం తీసుకొని ఆ కంపెనీ MD గా ఉన్నాడు.

సాహితీ ప్రేమ విషయం తెలుసుకున్న విష్ణు ప్రసాద్ తన కొడుకు సాహితీ కీ పెళ్లి చేద్దాం అని రామకృష్ణ తో చెప్పాడు, దానికి సాహితీ అమ్మ నాన్న కీ చాలా సంతోషం కలిగి వెంటనే ఒప్పుకున్నారు.

వినయ్ ఆర్మీ లో చేరిన సందర్భంగా ప్రతాప్ పార్టీ ఇచ్చాడు అలా అందరూ ఎంజాయ్ చేస్తూన్న, వినయ్ మాత్రం తన గ్లాస్ లోని డ్రింక్ తాగుతూ బయటకు వెళ్లి శ్రీ కీ ఫోన్ చేశాడు.

శ్రీ : మామ చెప్పు రా

వినయ్ : ఏమైనా తెలిసిందా

శ్రీ : లేదు రా నేను ట్రై చేస్తున్నా మేఘన, డేవిడ్ కీ కూడా సాహితీ గురించి ఏమీ తెలియదు అన్నారు వాళ్ల చెల్లి ఫ్రెండ్స్ నీ కూడా అడిగాను వాళ్లకు కూడా ఏమీ తెలియదు

వినయ్ : సరే ఏమైనా తెలిస్తే చెప్పు

శ్రీ : సరే రా నువ్వు జాగ్రత అని చెప్పి ఫోన్ పెట్టేసాడు

Updated: December 18, 2022 — 9:48 am