బంగ్లా – Part 2 140

కానీ వాళ్ళకి భవిష్యత్తే లేకుండా చేస్తారని అర్థం కాలేదు వాళ్ళకి. ఆ రోజు రాత్రే వారికి ఆఖరి రాత్రి అని తెలియని ఆ అమాయకులు కడుపు నిండా సుష్టుగా భోజనం చేసి ఆదమరచి నిద్రపోతున్నారు. కళావతి కూడా గోపన్న కోసం చూసి చూసి అలాగే కూర్చుని నిద్రపోయింది. రాత్రి 12 అవుతుండగా వచ్చాడు గోపన్న నిండా మందు మత్తులో చేతిలో బారెడు కత్తితో..
మెల్లిగా తూలుతూ నడుస్తూ భార్య దగ్గరకి వచ్చాడు.
“కళా..” అని పిలిచాడు.
ఆ శబ్ధానికి మెలకువ వచ్చిన కళావతి హా అంటూ పూర్తిగా కళ్ళు కూడా తెరవలేదు. మొగుడు ఏం చేస్తున్నాడో అర్థం అయ్యేలోపు కత్తి కంఠాన్ని రెండు తునకలు చేసేసింది… కూతుర్ని కూడా అదే కత్తికి బలి చేసి పొలం వెళ్ళి తన తనువు కూడా చాలించేసాడు.
మూర్ఖత్వం, పశు ప్రవృత్తి గల గోపన్న తనతో పాటు తన కుటుంబాన్ని కూడా మురికి గుంత లాంటి సమస్యల్లోకి నెట్టాడు

1 Comment

  1. Endhi bro last ki intha sad ending ichav? but anyway story super undhi…

Comments are closed.