బంగ్లా – Part 2 140

అలా ఆ రాత్రి వాళ్ళకి మర్చిపోలేని మధుర రాత్రయ్యింది ఇంకో రెండు షోలతో..

గోపన్న తన మామగారింట్లో 4నెలలు ఉన్నాడు. భార్యని ప్రేమగా చూసుకోవడం, కొడుకుతో ఆడుకోవడం, మామగారితో ముచ్చట్లు, ఇంకా తనకి తెలిసిన నలుగురిని పలకరించడం ఇలా ఆనందంగా గడిచిపోయాయి ఆ 4నెలలు. ఈ లోపు కళావతి మళ్ళీ నెలతప్పింది. అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది.
ఎప్పుడైనా తాగాలని అనిపిస్తే భార్యకి చెప్పేవాడు. భార్య వెళ్ళమని చెప్పేది. అప్పుడు కూడా ఒక గంటలో వెనక్కు వచ్చేసి భోజనం చేసి మౌనంగా తన గదికి వెళ్లిపోయేవాడు.
4నెలల తర్వాత తన ఊరికి వెళ్ళాలని అనిపించింది గోపన్నకి.
మర్రోజు పొద్దున్నే భార్యకి తన నిర్ణయం తెలిపాడు. అత్తమామలు కూడా సరే అన్నారు. తర్వాతి రోజే సొంత ఊరికి భార్యా పిల్లలతో కలిసి ఊరికి బయలుదేరి ఇంటికి చేరాడు.
ఎప్పుడో తర్వాతి రోజు పెళ్లి పెట్టుకుని ఊరు వదలి వెళ్ళిపోయిన తర్వాత గోపన్న ఇంటికి రావడం ఇదే మొదటిసారి. అది కూడా పాత పెళ్ళాన్ని వెంటేసుకుని రావడం వల్ల అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు గోపన్నని. వాళ్లలో ఆశ్చర్యం కన్నా ఏం జరిగిందో అన్న కుతూహలమే ఎక్కువగా ఉంది.
రెండు రోజుల వరకు బయట గోపన్న జాడ లేదు. తర్వాత రోజు కల్లు దుకాణం దగ్గర కనిపించాడు.
అందరూ గోపన్న చుట్టూ చేరారు. అందులో గోపన్నకి బాబాయ్ వరసయ్యే వెంకయ్య గోపన్న పక్కన కూర్చున్నాడు. గోపన్న 2ముంతలు పుచుకున్నాక వెంకయ్య మెల్లిగా అడిగాడు.
“ఏరా అబ్బాయ్ ఎక్కడికెళ్లిపోయావ్ ఇన్ని రోజులు?”
“మీ కోడలింటికి పోయినా బాబాయ్”
“అదేంట్రా వదిలేసావ్ గా?”
“లేదు బాబాయ్ పాపం మంచిది.. మర్చిపోలేక పోయిన”
“పోన్లేరా అయ్యా.. సుఖంగా ఉంటే అంతే చాలు”
మాటలు మరిక పొడిగించలేదు వెంకయ్య.
గోపన్న మరొక 3ముంతలు తర్వాత ఇంట్లో ఉన్నాడు.
భోజనం చేసి పెళ్ళాం జతలో వెచ్చగా పడుకున్నాడు.
కాలం ఇలా సాఫీగా సాగిపోతే మనం చెప్పుకోడానికి ఏముంది. గోపన్నలో క్రమక్రమంగా విషపు ఛాయలు అలుముకున్నాయి. దానికి తోడు తల్లి తన పెళ్ళాం మీద వేసే నిందలు కూడా తొడయ్యాయి.
మళ్ళీ పెళ్ళాంతో విభేదాలు చోటు చేసుకున్నాయి. కళావతి అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుందని మౌనంగానే ఉండసాగింది. కాలక్రమేణా గోపన్న వేధింపులు భరించలేక మరల పుట్టింటికి చేరుకుంది నిండు గర్భంతో.. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ భర్త దగ్గరికి వెళ్లకూడదని ఇంట్లో అందరూ గట్టిగా అనుకున్నారు.
గోపన్న కూడా అది పోవడమే మంచిది అనే నిర్ణయానికి వచ్చేశాడు. కానీ తన వంటి సుఖానికి కూడా ఒక ఆడది కావాలి కదా.
కానీ వరలక్ష్మీ ఉదంతం గోపన్నకి బాగానే గుణపాఠాలు నేర్పింది. అందుకే తెలిసిన వాళ్ళలో సంబంధం చూడమని తల్లికి పురమాయించాడు. తల్లి ఆ పనుల్లో ఉండగానే పని రీత్యా పొరుగూరు వెళ్ళవలసి వచ్చింది.
4రోజులు ఆ కొండల మధ్యనే గడిచిపోయింది.

1 Comment

  1. Endhi bro last ki intha sad ending ichav? but anyway story super undhi…

Comments are closed.