బంగ్లా – Part 2 141

పోచమ్మను చూడగానే ఏదో తెలియని మనఃశాంతిగా ఉంది గోపన్నకి. ఆమె కళ్ళలోకి చూసాడు. కళ్ళు ఉబ్బి ఉన్నాయి.
“ఏమైంది?” అని అడిగాడు
“రాత్రి మనం చేసింది అంతా అమ్మ చూసిందంట. నన్ను పొద్దున్న బాగా కొట్టింది. నాన్నకి తెలిస్తే చంపేస్తాడు అని ఏమీ మాట్లాడలేదు కానీ లేకపోతే స్కూల్ కి కూడా పంపేది కాదు” వెక్కి వెక్కి ఏడుస్తూ జరిగిందంతా చెప్పేసింది గోపన్నకి.
“మరి ఏం చేద్దాం ఇప్పుడు?” అని అడిగాడు గోపన్న.
“నేను నీతో వచ్చేస్తా మవయ్యా. నన్ను తీసుకెళ్లిపో.” అనేసింది.
గోపన్న కూడా అదే నిర్ణయంతో ఉండటం వల్ల వెంటనే ఆ ఊరి గుడిలో పెళ్ళి చేసేసుకున్నారు.
అలాగే మెడలో తాళి బొట్టుతో పోచమ్మ ఇంటికి వెళ్ళగానే అక్కడ పెద్ద గొడవ అయ్యింది. ఆఖరుగా వాళ్ళు “నువ్వు నాకు పుట్టలేదు. ఇక నీకు మాకు సంబంధం లేదు ” అని తెగతెంపులు చేసేసుకున్నారు.
పోచమ్మని అలాగే తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు గోపన్న. కొన్నాళ్ళ కాపురం తర్వాత వాళ్ళ ఊరిలో ఒక లోకల్ లీడర్ పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం చేసాడు గోపన్న. అంటే ఆ లీడర్ కోసం కాదు. వాళ్ళిచ్చే డబ్బు, మందు, బిర్యానీ కోసం.
రెండు రోజుల తర్వాత గోపన్న ఫోన్ కి ఒక కాల్ వచ్చింది.
ఎత్తి అవతలి వ్యక్తి చెప్పిన మాటలకి కుప్పకూలిపోయాడు.
ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఆ పక్క ఊరి గవర్నమెంట్ డాక్టర్. గోపన్న ఇచ్చిన రక్తం శాంపిల్ పరీక్షించిన ఆయన గోపన్నకి AIDS ఉందని నిర్దారణ చేసి ఆ బ్లడ్ బాటిల్ మీద ఉన్న గోపన్న నెంబర్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ రోజు రాత్రి వరకు తాగుతూనే ఉన్నాడు గోపన్న. అసలు ఏమీ అర్థం కావడం లేదు.
బాగా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు.
తర్వాతి రోజు పోచమ్మని తీసుకుని వేరే ఊరు వెళ్తున్నాం అని చెప్పి ఒక నిర్మానుష్య ప్రదేశంలో తల మీద పెద్ద రాయితో మోది శవాన్ని గొయ్యి తీసి కప్పెట్టేసి వచ్చేసాడు. తర్వాత కొన్ని రోజులకు కళావతి ఇంటికి వెళ్ళాడు.
మొదట్లో అందరూ వెళ్లిపోమన్నారు. కానీ కళావతి, ఆమె తల్లితండ్రులు పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించి గోపన్నతో పంపేశారు భార్యా పిల్లల్ని.

1 Comment

  1. Endhi bro last ki intha sad ending ichav? but anyway story super undhi…

Comments are closed.