బంగ్లా – Part 2 140

తర్వాతి రోజు రాత్రి తోటి పనివారితో కూర్చుని నాటుకోడి కాల్చుకుంటూ కల్లు తాగుతున్నాడు. సంద కల్లు బాగా పులిసిపోయిందేమో బాగా మత్తెక్కిపోయారు ఒక్కొక్కరు. గోపన్న ఆ మత్తులో తూలుతూ నడుచుకుంటూ వచ్చి ఊర్లో ఒక చోట పడి నిద్రపోయాడు. పొద్దున్నే కళ్ళు తెరిచి చూసే సరికి మంచం మీద ఉన్నాడు. ఏవో మాటలు వినిపిస్తున్నాయి. లేచి నిలబడి బయటకి వచ్చి చూసాడు. తన ఎదురుగా పరికిణీ వేసుకున్న లేడి పిల్ల ఒకటి చెంగు చెంగున గెంతుతూ వచ్చి తనని చూసి బ్రేక్ వేసినట్టు ఆగిపోయింది.
ఆ కళ్ళు చూస్తుంటే అసలు కళ్ళలా లేవు. సరస్వతీ దేవినడిగి తెచ్చిన రెండు తెల్ల కలువ రేకుల్ని దిష్టి తగలకుండా దిష్టి చుక్క పెట్టి అక్కడ అమర్చారేమో అన్నట్టు విశాలంగా ఉన్నాయి ఆ కళ్ళు.
ఆ కళ్ళని అలాగే చూస్తూ ఉండిపోయాడు గోపన్న.
ఆమె కను రెప్పల్ని రెపరెపలాడించింది. ఆమె రెప్పలు అలా కొడుతుంటే రామ చిలుక రెక్కలాడించినట్టు అనిపించింది గోపన్నకి.
కాలుడికన్నా నల్లగా ఉన్న ఆమె కంటి కాటుక ఆమె కనులకి మరింత శోభను చేకూర్చింది.
కొంచెం కిందకి చూస్తే నునుపైన ఆమె ముక్కు సన్నగా, కోలగా పదును తేలి ఉంది. దానికి కుడి వైపున ఉన్న చిన్న ముత్యపు ముక్కుపుడక ఆమె నాసికా సౌందర్యాన్ని నాసిక్ లో గోదావరి అంత అందంగా మార్చేసింది.
కొన్ని క్షణాలు ముత్యం వల్ల ముక్కుకు అందం వచ్చిందో ఆమె ముక్కును చేరడం వల్ల ముత్యానికి అందం వచ్చిందో తేల్చుకోలేకపోయాడు.
అసలు ముత్యాలు పుట్టేది ముత్యపు చిప్పల్లోనా ఆమె ముక్కులోనా అనే సందేహం కలుగుతోంది.
ఇక ఆమె పెదాలు చూస్తే ముద్దు పెట్టాలనే కాంక్ష తప్ప అతనిలో భావుకుడికి పెద్దగా పని పెట్టలేదు గోపన్న.
పైన అంతా బాగానే ఉంది. ఇక అసలు ఆస్తుల వివరాలను సేకరించడానికి కిందకి చూసాడు.
అబ్బా.. పట్టు పరికిణీలో పట్టు పట్టాలనిపించే అందాలు.
ఆమెను అలా చూస్తుంటే ముగ్గడానికి ముందే కోసిన బంగినపల్లి మామిడి కాయను సన్నని ముక్కలుగా కోసి ఉప్పూకారం అద్ది పెట్టినట్టు నోరూరిపోతుంది.
గోపన్న ఎప్పుడైతే తన చూపులు కింద ఫ్లోర్ కి షిఫ్ట్ చేసాడో ఆ అమ్మాయి “అమ్మా.. మావయ్య లేచాడే” అని అరుస్తూ తుర్రుమంది.
గోపన్న అలాగే అరుగు మీద కూర్చున్నాడు. తనకి ఎవరైనా టీ ఇస్తే బాగుంటుందని అనిపించింది.
అలా అనుకున్నాడో లేదో ఇలా గోపన్న ముందుకు టీ గ్లాసు ప్రత్యక్షమయ్యింది.
తల ఎత్తి చూసాడు.
ఎదురుగా ఎవరో ఒకావిడ నిలబడి ఉంది టీ గ్లాసుతో.
ఆమె ఎవరా అని గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. ఠక్కున ఒక చోట అతని ఆలోచనలకు తెరపడింది.
ఆమె తన పెద్దమ్మ కూతురు. ఎప్పుడో ఒకసారి చూసాడు. మళ్ళీ ఇదే కలవడం. తమ ఇళ్ల మధ్య పెద్దగా రాకపోకలు లేవు.
“బాగున్నావా తమ్ముడూ?” నవ్వుతూ పలకరించింది.
“బాగున్నాను అక్కా.. మీరు ఎలా ఉన్నారు? బావెక్కడ?” టీ గ్లాసు అందుకుంటూ అడిగాడు.
“పొద్దున్నే నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టి ఆయన పొలం వెళ్లిపోయారు. ఇంతకీ ఆయనెక్కడ తగిలారు నీకు?” అంటూ అక్క అడిగిన ప్రశ్నకు టీ గొంతులో పొలమారింది.

1 Comment

  1. Endhi bro last ki intha sad ending ichav? but anyway story super undhi…

Comments are closed.