బార్బిరకుడిని 377

ఆయన నన్ను ఎక్కడికి పయనం అని అడిగారు .
నేను కురుక్షేత్ర యుద్ధానికి అని చెప్పారు . ఎవరి తరుపున పోరాడతావు అన్నారు .
పాండవులకు ఆరు అక్షయుహిణి ల సైన్యం ఉంది, కౌరవులకు పదకొండు బలం ఉంది.కాబట్టి పాండవుల అదే మా తాతయ్య భీమసేనులవారు తరుపున పోరాడుతానని చెప్పాను.
ఎంతసేపటిలో యుద్ధాన్ని ముగించగలవు బాలక అని ముసలాయన నన్ను అడిగారు.
అప్పుడు నేను కామాక్షిదేవి కి ప్రార్ధించి ..ఆర్యా నా వద్ద మూడు బాణాలు ఉన్నాయి. ఒకటి ప్రయోగించగానే ఎవరి చంపాలో గుర్తిస్తుంది ,ఇంకొకటి ఎవరిని కాపాడాలో గుర్తిస్తుంది.మూడవది శత్రుసంహారం గావిస్తుంది,నాకు యుద్ధం ముగించడానికి ఒక ఘడియ చాలు అని చెప్పాను .
అబ్బురపడిన వృద్ధుడు ఒక సారి ఈ రవి చెట్టు ఆకులను కొట్టి చూపించగలవా అని అడిగారు.
వెంటనే బాణం సంధించాను .బాణం అన్ని ఆకులని కొట్టివేసి వృద్ధుని కాలికి గుచ్చుకుంది .కాలు ఎత్తిచూస్తే కాలికింద ఒక అకు వుంది.
ఆ బాణం తీసి నొప్పిగావుందేమో అని ఆయన ముఖము చూసాను.
ముఖము లో ఏ భాధ లేని ఆయనను చూసి ఈయన మాములు వ్యక్తి కాదు దేవుడు అని స్ఫురించి, ఆ దివ్యపురుషునిని గుర్తించాను .
శ్రీకృష్ణ మహాప్రభో ..మిమ్ములను గుర్తించలేకపోయాను .క్షమింపుడి అని అన్నాను.
అప్పుడు భగవానుడు తన రూపం లోకి వచ్చారు.
ఆ దివ్యమంగళ స్వరూపాన్ని కాంచి పరమానందభరితుడయ్యాను.
శ్రీకృష్ణుని నావద్ద నీకు అర్పించడానికి ఏమి లేవు, ఏమివ్వగలనని చింతించుచు అడుగగా పరమాత్ముడు కురుక్షేత్ర యుద్ధానికి ఒక మహావీరుని బలి ఇవ్వాలని. ..ఆ బలిదేవుడు నేనేనని చెప్పారు.
అప్పుడు పరమాత్ముని నీ విశ్వరూపం, కురుక్షేత్ర యుద్ధం చూడాలని నా అంతిమ కోరిక అని కాళ్లుపట్టుకున్నాను. శరాఘాతం వల్ల ఇంకా రక్తం వస్తుంది. అది చూసి ఏమిటిది స్వామి మీకు గాయమా అని అడిగాను. దుర్వాసుని శాపం వల్ల నా పాదము శక్తిహీనం అయింది.వాలి ఈ జన్మలో జరుడికింద పుట్టి తన బాణం తో ఈ గాయం మీదే కొట్టి నా అవతారం చాలించేలా చేస్తాడు అని నాకు విశ్వరూపం చూపించారు భగవానుడు.
ఆ సమ్మోహన నారాయణ స్వరూపం చూసినతర్వాత నాకు ఏమి చూడబుద్ది కాలేదు .
కానీ నా కళ్ళముందు నా పూర్వజన్మ కనపడింది.
నేనొక యక్షుడను. విష్ణుమూర్తిని సేవించుచుండగా బ్రహ్మ తదితరులు వచ్చి భూలోకం లో అధర్మం పెట్రేగిపోయింది, ధర్మం కాపాడుటకు మీరు భువిపై అవతరించే సమయం ఐంది అని విషుమూర్తిని దేవతలు విన్నవించుకున్నారు. దానికి నేను నవ్వి ఈ స్వల్పకార్యానికి అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు దేనికి, నేను వెళ్లి భూలోకం లో అధర్మం రూపుమాపి ధర్మం ప్రజ్వరిల్లేలా చూస్తాను అని అవహేళనగా బ్రహ్మ దేవుడికి చెప్పాను. నా వ్యర్ధ ప్రసంగానికి కోపోద్రిక్తుడైన చతుర్ముఖుడు ,నీవు భూలోకం లో పుట్టి విష్ణువు వలన సంహరింపబడి పాపవిమోచనం పొందెదవు అని శపించారు. ……..
శ్రీకృష్ణుని లీల నాకు అర్ధమైంది ………
నా బలిదానం మిగిలింది.

1 Comment

  1. Since,4 days no new postings. For Pinki sex story you received 15 comments to continue but what is the use. I think you don’t bother/consider readers anxious about comments then why you are seeking comments.

Comments are closed.