బార్బిరకుడిని 377

రెండవ రోజు యుద్ధం మొదలైంది ..మొదటి రోజు ఓటమి** ఎదుర్కొన్న పాండవులు ఎదురు దాడి మొదలుపెట్టారు. మా తాత భీమసేనుడు ధాటికి శత్రు సైన్యం కకావికలు అయ్యింది.భీష్మఁ వ్యూహ*ం బెడిసి కొట్టింది.క్రౌంఛ వ్యూహం తో పాండవులు ఎదురుదాడి చేసారు.మా తాత భీముడు చాకచక్యం తో అటు గదా యుద్ధం, విల్లు తో కూడా పరా క్రమం చూపించారు. కౌరవులకు వెన్ను దన్ను గా ఉన్న కళింగ మహాసేన భీముడు ధాటికి ఊచకోత కోయబడ్డారు.
రెండవ రోజు ధృష్టద్యుమ్నుడు పాండవ సైన్యాధిపతి అయ్యారు.
పాండవ సైన్యం విజయధ్వానాలు మిన్ను మింటాయి.
భీష్మ పితామహుడు తన శక్తి యుక్తులు ప్రదర్శన చెయ్యటం లేదని దుర్యోధనుడి అభిప్రాయం.
ఆ రోజు యుధ్ధం ముగిసింది.
ఆంజనేయుల వారు నా దగ్గరకు వచ్చారు.
నాకు కర్మ యోగం ఉపదేశించారు.
ఆయన నాతో ఒక విషయం చెప్పారు. యుద్ద విరామం లో కర్ణుడి గురించి కృష్ణ భగవానుడు ఇలా వివరించారు…
ఒక సారి కృష్ణుడు కర్ణుని వద్దకు వెళ్లారు… అప్పుడు తైలం వెండి గిన్నె లో వేసుకుని కర్ణుడు కుడి చేతి తో తనవంటికి లేపనం చేస్తున్నారు.
కృష్ణుడు ఆ వెండి గిన్నె తనకు కావాలని అడిగారు.వెంటనే ఆ గిన్నె ను ఎడమచేతి తో ఇచ్చారు.
కృష్ణుడు ఎడమ చేతి తో ఇవ్వడం అపరాధం కదా అని అడిగారు.
అప్పుడు కర్ణుడు ఇలా అన్నారు..కృష్ణా మీరు అడిగిన తరువాత నేను కుడి చేతి ని శుభ్రపరచి ఇవ్వవచ్చు… కానీ ఈలోగా నా మనసు మారవచ్చు..నాకేమన్న జరుగవచ్చు.. అప్పుడు నీకు ఇవ్వకపోవడం నాకు అపరాధం కదా అందుకే ఎడమ చేతి తో ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పారు.
ఆ మహా పురుషుడి ని ఎప్పుడు చూస్తానా అనిపిస్తుంది…

మూడవ రోజు యుధ్ధం మొదలైంది.
భిష్ముఢు గరుడ వ్యూహం తో ఎదురుదాడి మొదలుపెట్టారు.ధృష్టద్యుమ్నుడు పాండవుల రక్షణ కోసం అర్ధ చంద్ర వ్యూహం నిర్మించారు.అర్జునుడు అన్ని రకాలశస్త్రాలు ప్రయోగించి కౌరవులను పారిపోయే పరిస్థితి కల్పించాడు.
ఇది చూసిన సుయోధనుడు భిశ్మునితో ఇంద్రాది యోధుల సమానమైన నా సైన్యం ఎందుకు పలాయనం చిత్త గింఛ వలసి వచ్చింది అన్నాడు.
అప్పుడు సైన్యాన్ని ఉద్దేశించి భిష్ముఢు సుయోఃధన ఇప్పుడే నీకు నా పరాక్రమం చూపిoచేద అని రధాన్ని ముందుకు ఉఱికించి శరవేగంగా బాణాలను వదిలారు. పాండవుల చుట్టూ వృత్త కారంలో తిరుగుతూ రెప్ప పాటులో వీరులను నేలమట్టం చేసారు.క్షణ క్షణానికి దిక్కులు మారుతూ ఎటుచూసినా తానై ప్రళయ తాండవం చేస్తున్న భిశ్ముని ఆపడానికి అర్జున బలం సరిపోలేదు.అర్జున రధం ముందుకు వెళ్లకుండా బాణాల కోట నిర్మించారు భిష్ముఢు.భిశ్ముని ఘోరకలి ఆపడానికి శ్రీకృష్ణుడు రధం దూకి సుదర్శన చక్రాన్ని భిశ్ముని వైపు ప్రయోగిస్తుంఢగా
అర్జునుఢు కృష్ణుని కాళ్ళు పట్టుకొని నిలువరించి ఆయుధం తాకను అన్న కృష్ణుని ప్రతిజ్ఞ గుర్తు చేసాడు.శ్రీమన్నారాయణుడు చేతిలో చావు కోసం ఆయుధం విడిచి భిష్ముఢు చేతులు చాచి మోకాళ్ల మీద నిలబడ్డారు .
శ్రీకృష్ణుడు శాంతించి అర్జునుని యుధ్ధం కొనసాగిoచమన్నారు.
కోపం తో అర్జునుడు మహేంద్ర అస్త్రం ప్రయోగించారు.ఆ అస్త్రం ధాటికి కౌరవులు చెల్లా చె దురు అయ్యారు.సూర్యాస్తమయం అయ్యింది.రోజు మగి సిం ది.

నాల్గవ రోజు ఒక కాంతి పుంజం తన తో పాటు మూడు రోజుల నుండి యుద్దభూమి లో కనిపిస్తుందని హనుమంతుని తో చెప్పాను .అప్పుడు ఆయన అది సంజయుని దివ్యదృష్టి అని చెప్పి ,ధ్రుతరాష్టునికి సంజయుడు యుద్ధం గురించి చెబుతున్నారని చెప్పారు.ఈ రోజు యుద్ధం పాపం ధృతరాష్టునికి గర్భశోకం మిగిల్చింది. భీముని చేతిలో ఎనిమిది మంది కౌరవులు హతులయ్యారు. నాకు అభిమన్యుని తెగువ చుస్తే ముచ్చటేసింది. అశ్వథామ, భూరిశ్రవ, చిత్రసేన, శల్య పుత్రుని తో ఒక్కసారిగా మా పినతండ్రి పంజా విప్పిన కొదమసింహం లా విరుచుకుపడ్డాడు.వారు సుభద్రాపుత్రుని ధాటికి బాంబేలెత్తిపోయి యుద్ధభూమి నుండి నిష్క్రమించారు. అది చూసిన దుర్యోధనుడు త్రిగర్త సైన్యాన్ని అభిమన్యుడి మీదకు పంపాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు అభిమన్యుడిని రక్షణగా వచ్చాడు .ధృష్టద్యుమ్నుడు గదతో శాలుడు అర్ధచంద్రాకారంలో ఉన్న భారీఖడ్గం తో ద్వంద యుద్ధం చేసారు.ఫలితం ఎంతకూ తేలకపోవడం తో మా తాత భీమసేనులు వచ్చారు. కానీ తాతను సుయోధనుడు నిలువరించడానికి ప్రయత్నించాడు. అప్పుడు మా తాత విశ్వరూపం చూసాను. దుర్యోధనుడు తన మత్త మగధ గజాలను తాత మీదకు వదిలాడు. వాటి ధాటికి భూమి కంపించింది. వృకోదరుడైన తాత బెబ్బులి లా గాండ్రించి ఏనుగుల కుంభస్థలం పై ముళ్ళ గద తో మోదాడు. మాద్రి పుత్రులు భీమునికి రక్షణ కవచం ఏర్పరిచారు. మగధ మహారాజు ఐరావతం లాంటి ఏనుగు తో నేల మీద ఉన్న భీముని మీద విరుచుకు పడ్డాడు. ఆ గజం ముందు రెండు కాళ్ళు గాల్లో లేపి హుంకురించింది.

1 Comment

  1. Since,4 days no new postings. For Pinki sex story you received 15 comments to continue but what is the use. I think you don’t bother/consider readers anxious about comments then why you are seeking comments.

Comments are closed.