బార్బిరకుడిని 377

అప్పుడు నేను అన్నాను ,హనుమా నా తండ్రి ఒకసారి నన్ను శ్రీ కృష్ణుని వద్దకు తీసుకువెళ్లారు. అప్పుడు నేను శ్రీకృష్ణుల వారిని ముక్తికి మార్గం చెప్పమని అడిగాను .అప్పుడు నాకు ఆయన కర్మ యోగం ఉపదేశించారు. ఆయన మహీసాగర సంగమం వద్ద నలువైపులా ఉన్న నవదుర్గలకు ఉపాసన చెయ్యమన్నారు .వారు నా భక్తి కి మెచ్చి నాకు దివ్యాస్త్రాలు ప్రసాదించారు. వారు నన్ను విజయుడు అనే గురువు వద్ద శిష్యరికం చెయ్యమన్నారు.మగధ వెళ్లి నేను విజయుడి వద్ద ధర్మసూక్ష్మాలు తెలుసుకున్నాను.అక్కడ ఒక బిచ్చగాడు విజయుడి వద్దకు వచ్చాడు, అతనికి బిక్ష ఇవ్వబోతుండగా …..బిచ్చగాని నోటి లో అగ్ని కనపడింది.వెంటనే అతన్ని మూర్ఛపోయేలా గుద్దాను.అతను నా ఘాతానికి ఒక గుహలోకి పారిపోయాడు.అక్కడ లోపల చాలా మంది బందీలై ఉన్నారు. వెంటనే బిచ్చగాడు పెద్ద రాక్షసుడిలా మారాడు.అతని తో కొన్ని రోజులు పాటు యుద్ధం చేసి అతన్ని ఓడించాడు. ఇంతలో అక్కడ వాసుకి (నాగరాజు , బాషాక్ నాగు) ప్రత్యక్షమై నాయనా ,నీవు నా మునిమనవడవు,నీ వల్ల నాగలోక వాసులకు ఈ పలాషుడు అనే రాకాసి నుండి విముక్తి కలిగింది అని నాగశాస్త్రం బోధించారు, నాకు,విజయుడికి.
నేను మహిసాగర సంగమం లో ఉన్న గుప్తక్షేత్రం లో ఉండగా అక్కడకు అయిదు మంది వచ్చారు .నేను అమ్మవారికి పూజ కోసం నీరుతెచ్చే కొలను లో ఎవరో స్నానం చేయబోతున్నారు ,నేను మురికిగా ఉన్న వారి పాదాలను చూసి వారించాను. కొలను అపవిత్రం అవుతుంది అని చెప్పాను .వారిలో బలవంతుడు ఒకాయన వచ్చి నాతో ఘర్షణ కు దిగారు.ఆ వీరుణ్ణి ఎత్తి సాగరం లో విసరబోయాను. అప్పుడు ఆకాశం లోంచి అశరీరవాణి ఇలా పలికింది. .నాయనా ,ఆయన మీ తాత భీమసేనుడు ,కాబట్టి ఆయనను వదిలి పెట్టి పూజించు “.ఆ విషయం తెలుసుకున్న నేను నా అపరాధానికి మన్నించమని భీమసేను వారిని కోరుకొని ప్రాణ త్యాగం చేయబోయాను,ఇంతలో అశరీరవాణి మళ్ళి నాయన నీవు ఒక మహత్కార్యం చేయవలసి ఉంది కావున…నీవు నీ తప్పు తెలుసుకొని పాండవులను శరణు వేడు అని పలికింది. భీమసేనుల వారు నన్ను మెచ్చుకొని అరణ్యవాసం గురించి చెప్పి భవిష్యత్తు లో నీ సాయం మాకు తప్పక కావాలి అని చెప్పి వెళ్లి పోయారు.
అప్పుడు ధర్మరాజులవారు దేవిఁఉపాసన చేసారు. మా తాత భీముడు ఒక ఆడువారి స్తోత్రం పఠించడం చూసి ధర్మరాజునులవారిని తూలనాడారు.
వెంటనే ఆ పాపానికి భీమసేనులవారి కంటిచూపు కోల్పోయారు.చేసిన తప్పు గుర్తించి నవదుర్గను వేడుకోవడం తో కంటిచూపు మళ్లీ పొందారు.
ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణులవారు నన్ను సహృదయ అని పిలిచేవారు.

ఈ విషయాలు తెలిసిన శ్రీకృష్ణులవారు నన్ను సహృదయ అని పిలిచేవారు.
నేను హనుమంతులవారిని ఒక సందేహం అడిగాను “మీరు బ్రహ్మజ్ఞాని ,మీరు అర్జనుని రధాన్ని అధిరోహించడం ఎలా తటస్థిoచింది ,వివరించగలరు అన్నాను. ”
అప్పుడు హనుమంతులవారు నాయనా ,నేను హిమాలయాల్లో తపస్సు చేసుకుంటుండగా భీముడు అక్కడకు వచ్చి నేనెవరినో తెలియక అడ్డుగా ఉన్న నా తోకను పక్కకుజరపలేక శతవిధాలాప్రయత్నించి చివరకు నేనెవరినో తెలుసుకుని నాకు నమస్కరించాడు.నేను అతనికి సమయం వచ్చినపుడు సహాయం చేస్తానని మాటఇచ్చాను .
కొంత సేపటికి అర్జనుడు ఆ దారిలో వచ్చి నేను చేస్తున్న రామజపాన్ని చూసి నవ్వి, నాతో విప్రవర్యా,రాముడు అంత ధనుర్ధారి అయితే బాణాలతో లంకకు వంతెన కట్టివుండొచ్చు కదా అన్నాడు. నేనప్పుడు నాయనా వనరుల బలం ముందు బాణాలవంతెన కూలిపోతుంది అన్నాను. అప్పుడు అర్జనుడు నవ్వి వట్టి మాటలు,నేను బాణాలతో వంతెన నిర్మిస్తే ఎవ్వరూ కూల్చలేరు అని చెప్పాడు. వెంటనే నేను నా వజ్రకాయ రూపాన్ని ధరించి చూద్దాం అన్నాను. ఆశ్చర్యపోయిన అర్జునుడు నాకు నమస్కరించి ,స్వామీ! నేను ఈ పరీక్షలో ఓడిపోతే ప్రాణత్యాగం చేస్తాను అన్నారు. అప్పుడు నేను “మా తల్లి అంజనాదేవి ని స్మరించి ,రామస్తుతి గావించి నాయనా ,నీవు అమాయకుడవు, ఒకవేళ నీవు నిర్మించినవంతెన నన్నుతట్టుకున్నట్లైతే నేను నీ రధం యొక్క ధ్వజాన్నై నిన్ను కాపాడతాను “అన్నాను.
అర్జనుడు సరస్సుపై బాణాలతో వంతెన కట్టాడు ,నేను ఒక్క ఉదుటున దూకేసరికి వంతెన చిన్నాభిన్నం అయిపోయింది. గర్వభంగం ఐన అర్జనుడు ప్రాణత్యాగం చేయబోగా నేను వారించాను. ఇంతలో శ్రీకృష్ణులవారు వచ్చి అర్జునా ,క్రుంగిపోకు ఇంకొక సారి ప్రయత్నించు అని అన్నారు. శ్రీకృష్ణుని ఆసిస్సులు తీసుకుని మళ్ళీ ప్రయత్నించాడు అర్జనుడు.
ఈ సారి నేను ఎన్ని సార్లు దూకినా వంతెనకు ఏమి కాలేదు .నేను వంతెన
కిందకు చూసాను ఒక ఎర్ర ధార నీటిపై ఉంది ,నీటి లో దూకి చూస్తే ఒక పెద్ద కూర్మము(తాబేలు) వంతెన కు దన్నుగా ఉంది,కూర్మము కుడి నాసిక నుండి రక్తం కారుతున్నది .కూర్మావతారుడైన శ్రీమన్నారాయణునికి నమస్కరించి పైకి వచ్చాను .ఇంతలో శ్రీకృష్ణుని చూసి ఆనందం తో అర్జనుడు పాదాభివందనం చేసాడు. నేను ప్రమాణం చేసినట్టుగా అర్జనుని ధ్వజమై కాపాడుతానని ప్రమాణం చేశాను. నేను అప్పుడు శ్రీకృష్ణుని నాసికలోంచి కారుతున్న రక్తాన్ని నా చేతితో తుడిచాను ,త్రివిక్రముని త్రిఅవతారాలు చూసిన ఆనందం తో ,నా రాముణ్ణి గాయపరిచానన్న దుఃఖం కలగలిసి కన్నీరు కారుస్తూ అని హనుమంతుడు ముగించారు.

1 Comment

  1. Since,4 days no new postings. For Pinki sex story you received 15 comments to continue but what is the use. I think you don’t bother/consider readers anxious about comments then why you are seeking comments.

Comments are closed.