బార్బిరకుడిని 377

నా నీలమేఘ వర్ణరంజితమైన అశ్వాన్ని అధిరోహిస్తూ శ్రీకృష్ణుని పాదాలమీద బాణం సంధించాను.బాణం నుండి గంగ ఉప్పొంగి దేవదేవుని పాదాలకు అభిషేకము చేసినది. గాయం నుండి రక్తస్రావం ఆగినది. వెంటనే సూర్యుని తేజస్సు కలిగిన తన సుదర్శన చక్రం తో నా శిరస్సును దక్షిణ గా తీసుకుని. …ఈ యుద్ధం అయ్యే వరకు నీ శిరస్సు లో ప్రాణం ఉంటుంది అని ఖటు పర్వతం మీద నా శిరస్సు ఉంచి నాకు తోడుగా ఒక దివ్యజ్ఞాని ని పంపుతానని చెప్పి అదృశ్యమైనారు భగవంతుడు.
యుద్ధాన్ని చూస్తున్నాను ఇంకా మొదలవ లేదు ,ఒక పండుముసలి వారు అటువైపువస్తున్నారు. ఆయనను చూసి ఎవరో దివ్యపురుషుడిలా అనిపించారు.

యుద్ధo కోసం చూస్తున్నాను ఈరోజు ఇంకా మొదలవ లేదు ,ఒక పండుముసలి వారు అటువైపువస్తున్నారు. ఆయనను చూసి ఎవరో దివ్యపురుషుడిలా అనిపించారు.
అయన నా వైపు ఆర్ద్రం గా చూసి నాయనా నేను నీ గురించి ,నీ త్యాగం గురించి తెలుసుకున్నాను .నిన్ను కలసి వెళదామని వచ్చాను.
అయన నుండి వస్తున్న తేజస్సు చూసి ,మహానుభావా మీరెవరో సెలవివ్వండి అని అడిగాను.
అప్పుడు ఆయన నేను హనుమంతుడిని అని చెప్పారు .
నీవు ఎన్నో ధర్మసందేహాలతో ఉన్నావని వాటిని తీర్చమని శ్రీకృష్ణుడు నన్ను ఇక్కడికి పంపారు .
మీ వంటి బ్రహ్మజ్ఞానిని కలుసుకోవడం నా అదృష్టం అని చెప్పాను హనుమంతులవారితో ……
నాయనా నాకు తెలిసింది ,అర్జనుని రధం మీద ఉండగా కృష్ణుని గీతామృతం విని ఆకళింపు చేసుకున్నది నీకు చెబుతాను అని హనుమంతులవారు అన్నారు.
ఇప్పటివరకు యుద్ధం ఏమి జరిగింది అని అడిగాను .నాకు ఇంకో సందేహం ఋగ్వేదం లో దశ రాజ్ఞా (పది రాజుల యుద్ధం ) అని చదివాను ,ఆ విషయాన్ని విపులీకరించండి.ఇప్పుడున్న వారిలో మహాయోధుడు ఎవరు ……మీరు చూసిన వారిలో బలమైన ప్రత్యర్థి ఎవరు అని కళ్ళతో నమస్కారం పెట్టాను.
నేను యుద్ధరంగం లో తలపడిన వారిలో రావణుని పుత్రుడు మేఘనాధుడు బలమైన ప్రత్యర్థి .
త్రిమూర్తులకు మహామహారధి అని బిరుదు ఉంది, శివ పుత్రులకి కూడా ……
తరువాత స్థాయి అతిమహారధి ……మేఘనాధుడు, పరశురామునికి దక్కింది …………..
త్రిమూర్తుల అంశ లేకుండా ఉన్నది ఒక్క మేఘనాదుడే …..బలమైన ప్రత్యర్థి ….అని చెప్పారు.
కానీ పరశురామునితో ఒక యోధుడు సరిసమానం గా 23 రోజులు యుద్ధం చేసి సమఉజ్జిగా నిలిచిన వీరాధివీరుడు ఒకరున్నారు ఆయనే ఇప్పుడున్న యుద్ధవీరుల్లో అగ్రగణ్యుడు ……….
ఎవరాయన అని అడిగాను ………
ప్రభాసుడు అని సమాధానం వచ్చింది.

ప్రభాసుడు అని సమాధానం వచ్చింది. ప్రభాసుడు పూర్వజన్మ లో అష్టవసుల్లో ఒకరు. కామధేనువు వసిష్ఠుని దగ్గరనుండి దొంగిలించినందుకు గాను భూలోకం లో చాల కాలం జీవించమని శాపం పొందారు.
అతనే దేవవ్రతుడు (భీష్ముడు) .
ఇవ్వాళ యుద్ధం మొదటి రోజు …కౌరవుల సర్వసేనాని ఆయనే …అయన గురించి యుద్ధవిరామం లో చెపుతాను అని హనుమంతుల వారు అర్జనుని రధం వైపు వెళ్లారు .
పాండవుల సర్వసేనాని విరాట యువరాజు శ్వేత.
పాండవుల వ్యూహాన్ని ధర్మరాజు రచించారు. తక్కువ సైన్యం వాళ్ళ ఒక్కో వీరుడు సాధ్యమైనంత ఎక్కువ మంది శత్రువులతో తలపడాలని వజ్రవ్యూహం పన్నారు.
మగద దేశం నుండి వచ్చిన 1౦౦౦౦ ఏనుగులు కౌరవులకు రక్షణ వలయం గ ఉన్నాయి .
భీష్మాచార్యుల ధాటి కి పాండవులు నిలువలేక పోయారు. భీముని రక్షణ మిగిలిన వారినుండి రక్షణ మాత్రమే ఇచ్చింది .కర్ణుడు యుద్ధం చేయకుండా వికర్ణుని యుద్ధవ్యూహం చెపుతున్నాడు. భీష్ముని యుద్ధతంత్రాని కి పాండవ సర్వసేనాని శ్వేత మరణించాడు.
విరాటరాజు ఇంకాకొక పుత్రుడు ఉత్తరకుమారుడు శల్యుని చేతి లో మరణించాడు.
పాండవులు ఓటమిభారం తో వెనుదిరిగే సమయానికి అభిమన్యుడు భీష్ముని మీద విరుచుకుపడ్డాడు.కానీ పితామహుని ధాటి కి తట్టుకోలేక వెనుదిరిగాడు.
సూర్యుడు అస్తమించాడు. ……కౌరవులి శిబిరం లో విజయధ్వానాలు మిన్నుమింటాయి.
బార్బిరకుని వద్దకు హనుమంతుడు వచ్చారు. అప్పుడు హనుమంతుడు నాయనా అర్జనునికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసారు .దానికి ప్రత్యక్ష సాక్షి నేనే .గీత సారం మొత్తం ఒక ఘడియ కన్నా తక్కువ సమయం లో భగవానుడు చెప్పారు. ఈ ధర్మక్షేత్రం కురుక్షేత్రం లో ఉపనిషత్తుల సారాన్ని భవిషత్తు తరాలకు ఉపయోగ పడేలా గీతాసారాన్ని నేనువిన్నాను, తరించాను.త్రేతాయుగం లో అష్టావక్ర గీత జనకుల ద్వారా, వసిష్ఠ గీత రాముని ద్వారా విన్నాను. ఇవ్వాళ భగవంతుని గీత నేను విన్నాను, వర్ణించలేనంత రమణీయం గా ఉంది అని విషాద యోగం గురించి చెప్పారు.

1 Comment

  1. Since,4 days no new postings. For Pinki sex story you received 15 comments to continue but what is the use. I think you don’t bother/consider readers anxious about comments then why you are seeking comments.

Comments are closed.