బార్బిరకుడిని 376

నేను బార్బిరకుడిని .నా తండ్రి ఘటోత్కచుడు .నేను కురుక్షేత్ర యుద్ధం చూడటానికి ఈ కొండ మీద ఉన్నాను ఒంటరిగా .ఎవరన్నా తోడు ఉంటారని చూస్తున్నాను …ఎవ్వరు రావటం లేదు. అయినా మొండెం లేకుండా ఉండడం కష్టమే ……
నా మొండెం ఏమైందో తెలియాలంటే నా గురించి చెప్పాలి …….

మహాభారతం ఓ జీవసాగరం. ఒకటా రెండా… అందులో వందలాది పాత్రలు. ప్రతీ పాత్రకీ ఏదో ఒక ప్రత్యేకత. అలాంటి ఒక పాత్రే బర్బరీకుడు. బర్బరీకుడు ఎవరో కాదు! ఘటోత్కచుని కుమారుడే. అతని తల్లి పేరు మౌర్వి. బర్బరీకుడు చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలో అపార ప్రతిభను కనబరిచేవాడు. అస్త్రశస్త్రాల మీద అతనికి ఉన్న పట్టుని చూసిన దేవతలు ముచ్చటపడి అతనికి మూడు బాణాలను అందించారు. ఆ మూడు బాణాలతో అతనికి ముల్లోకాలలోనూ తిరుగులేదంటూ వరాన్ని అందించారు.
ఒకపక్క బర్బరీకుడు పెరుగుతుండగానే, కురుక్షేత్రం సంగ్రామం మొదలయ్యే సమయం ఆసన్నం అయ్యింది. భరతఖండంలోని ప్రతి వీరుడు ఏదో ఒక పక్షాన నిలబడాల్సిన తరుణం వచ్చేసింది. అలాంటి యుద్ధంలో బర్బరీకుడు కూడా పాలు పంచుకోవాలని అనుకోవడం వింతేమీ కాదు కదా! బర్బరీకుని బలమెరిగిన అతని తల్లి, ఏ పక్షమైతే బలహీనంగా ఉందో, నీ సాయాన్ని వారికి అందించమని కోరుతుంది. సంఖ్యాపరంగా చూస్తే పాండవుల పక్షం బలహీనంగా కనిపిస్తోంది కాబట్టి, పాండవుల పక్షాన నిలిచి పోరు సలిపేందుకు బయల్దేరతాడు బర్బరీకుడు. కానీ బర్బరీకుడులాంటి యోధుడు యుద్ధరంగాన నిలిస్తే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు. అందుకే బర్బరీకుని వారించేందుకు, ఒక బ్రాహ్మణుని రూపంలో అతనికి ఎదురుపడతాడు.
‘మూడంటే మూడు బాణాలను తీసుకుని ఏ యుద్ధానికి బయల్దేరుతున్నావు’ అంటూ బర్బరీకుని ఎగతాళిగా అడుగుతాడు కృష్ణుడు.
‘యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ మూడు బాణాలే చాలు. నా మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది. నా రెండో బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది. నా మూడో బాణం శిక్షను అమలుపరుస్తుంది!’ అని బదులిస్తాడు బర్బరీకుడు.
‘నీ మాటలు నమ్మబుద్ధిగా లేవు. నువ్వు చెప్పేదే నిజమైతే ఈ చెట్టు మీద ఉన్న రావి ఆకుల మీద నీ తొలి బాణాన్ని ప్రయాగించు’ అంటూ బర్బరీకుని రెచ్చగొడతాడు శ్రీ కృష్ణుడు.
మహాభారతం ఓ జీవసాగరం. ఒకటా రెండా… అందులో వందలాది పాత్రలు. ప్రతీ పాత్రకీ ఏదో ఒక ప్రత్యేకత. అలాంటి ఒక పాత్రే బర్బరీకుడు. బర్బరీకుడు ఎవరో కాదు! ఘటోత్కచుని కుమారుడే. అతని తల్లి పేరు మౌర్వి. బర్బరీకుడు చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలో అపార ప్రతిభను కనబరిచేవాడు. అస్త్రశస్త్రాల మీద అతనికి ఉన్న పట్టుని చూసిన దేవతలు ముచ్చటపడి అతనికి మూడు బాణాలను అందించారు. ఆ మూడు బాణాలతో అతనికి ముల్లోకాలలోనూ తిరుగులేదంటూ వరాన్ని అందించారు. ఒకపక్క బర్బరీకుడు పెరుగుతుండగానే, కురుక్షేత్రం సంగ్రామం మొదలయ్యే సమయం ఆసన్నం అయ్యింది.

1 Comment

  1. Since,4 days no new postings. For Pinki sex story you received 15 comments to continue but what is the use. I think you don’t bother/consider readers anxious about comments then why you are seeking comments.

Comments are closed.