బార్బిరకుడిని 377

భీముడు నిశ్చేస్టుడయ్యాడు .మగధ రాజు వెంటనే బళ్ళెం భీముని పై విసరబోయాడు. ఇంతలో అభిమన్యుడు ఒకేసారి వదిలిన రెండు దివ్యాస్త్రాలు మత్తగజాన్ని ,మగధ రాజును ఒక్క వేటుతో నేల కరిపించాయి .తేరుకున్న భీముడు చుట్టూవున్న గజాలను కొండలను పిప్పి చేసినట్టుగా ఊచకోత కోశాడు. చుట్టూతా నేలకొరిగిన గజలే .రక్తం ఏరులై పారింది. యమధర్మరాజు అంశతో పుట్టిన మా తాత కౌరవులకు పాశం విసిరే యముడి లా గోచరిస్తున్నాడు. భీష్ముడు భీమునికి ఎదురొచ్చాడు. ఇంతలో సాత్యకి భీష్ముని తో తలపడ్డాడు. కౌరవ పుత్రులందరు మా తాత పై విరుచుకుపడ్డారు. వారందరి ని చూసి ఆకలిగొన్న తోడేలు లా విజృభించారు మా తాత. అడ్డువచ్చిన అష్ట కౌరవులను సంహరించాడు భీములవారు. ప్రగ్యోక్తిసాపురాధీశుడైన భగదత్తుడు తన శ్వేత గజం సుప్రతీక మీద నుండి భయంకర అస్త్రాలను భీముని మీదకు వదిలాడు. స్పృహ కోల్పోయిన తాతను సారధి విశోకుడు యుద్ధరంగం నుండి తీసుకుపోయాడు.
ఆ గజాన్ని చూసి అందరూ బెదిరిపోయారు. ఇంతలో ఆకాశం లో మెరుపులు, ఉరుములు. వాటి మధ్య చండ్రనిప్పుల్లా ఉన్న కన్నులతో ఉన్న మా తండ్రి ఘటోత్కచుడు ప్రత్యక్షమయ్యాడు .నాలుగు దంతాలతో ,ఒళ్ళంతా పొడవాటి వెంట్రుకలతో ఉన్న హిమాలయ గజం మీద ఉన్న మా తండ్రి తన స్నేహితుల తో భగదత్తుని మీద దాడి చేసి సుప్రతీకను చంపేశారు.భగదత్తుడు పలాయనం చిత్తగించాడు. హుతాశులైన కౌరవ గణం పారిపోయింది మా తండ్రి ప్రకోపం గాంచి.
చీకటి పడింది.
శిబిరం లో భీష్ముని వద్దకు సుయోధనుడు వచ్చి ఏమి పాలుపోవడం లేదు, మీరు అపరాజితులు కదా, మరి నేనెందుకు రోజు యుద్ధం నుండి పారిపోతున్నాను ,సెలవియ్యండి అన్నాడు.

శిబిరం లో భీష్ముని వద్దకు సుయోధనుడు వచ్చి ఏమి పాలుపోవడం లేదు, మీరు అపరాజితులు కదా, మరి నేనెందుకు రోజు యుద్ధం నుండి పారిపోతున్నాను ,సెలవియ్యండి అన్నాడు.
అప్పుడు భీష్ముడు నాయన నేను ఎన్నో సార్లు చెప్పి చూసాను ,కానీ నువ్వు వినలేదు ,కృష్ణార్జనులు నరనారాయణ స్వరూపులని, వారు ఓటమి ఎరుగరని, నా పేరుని సార్ధకం చేసుకోడానికి హస్తినాపురాధీశుని రక్షణకు భీష్మించుకు కూర్చోవలసి వచ్చింది.నా ప్రాణం ఉన్నంతవరకు నీకు రక్షణగా ఉండెద అని అన్నారు.
ఐదవ రోజు కౌరవులు మకర వ్యూహం పన్నారు. ధృష్టద్యుమ్నుడు ప్రతిగా స్యేన వ్యూహం (డేగ ) నిర్మించారు.ఇరు వర్గాల మధ్య భీకర పోరు నడిచింది .దిక్కులు ప్రిక్కటిల్లేలా ఏనుగుల హుంకారాలు, అశ్వనాదాలు ,శంఖారావాలు హోరెత్తాయి. పోట్లగిత్తల్లా ద్వంద్వయుద్ధాలలో వీరులు పోరుసల్పుతున్నారు. ఛిద్ర అవయవాలు రణమరుభూమిలో చెల్లాచెదురయ్యాయి. వేగంగా కదులుతున్న సైన్యం వాళ్ళ రేగిన ధూళి కరుమబ్బులా కమ్ముకుంది. వీరుల దివ్యాస్త్రాలు ఒకదానొకటి ఢీకొని మెరుపులా స్ఫురించింది .అప్పుడు ఆ కరుమబ్బులోంచి రక్తం వర్షమై వచ్చిందా అన్నట్టు నేల మీద రక్తం ఏరులయ్యింది.
ఏనుగులు తమ దంతాలతో రాధాలలో ఉన్న వీరులను బయటకు లాగి, రాధాల్ని తునాతునకలు గావించాయి.
అర్జునుడు,అశ్వద్ధామ ఒకరినొకరు ఎదురుపడి భీకర పోరు సల్పారు .ఆఖరుకు అశ్వద్ధామ కవచాన్ని అర్జునుడు ఛిద్రం చేసి గురుపుత్రుని వొదిలేసాడు.
చిచ్చరపిడుగైన అభిమన్యుడు కార్చిచ్చు లా కౌరవ సమూహాన్ని దహించి వేస్తున్నాడు.అర్జున కుమారుని దుర్యోధనుడు సుతుడైన లక్ష్మణుడు ఎదురు నిలిచాడు. అభిమన్యుడు లక్ష్మణుని సారధిని, రథాశ్వాలను సంహరించాడు. కోపోద్రిక్తుడైన లక్ష్మణుడు ఈటెను బలం గా అభిమన్యుడి మీదకు విసిరాడు. బాణాలతో ఈటెను ధ్వంసం చేసాడు అర్జనుడు. ఏకాకిగా మిగిలిన లక్ష్మణుని కృపాచార్యుడు తన రధం లో తోడ్కొని వెళ్ళాడు.
ఒకవైపు భీష్ముడు తన ప్రతాపం చూపిస్తుండగా, మరోవైపు కృష్ణుని సోదరుడు సాత్యకి కౌరవుల భరతం పట్టాడు . సాత్యకి కి తన పదిమంది కుమారులు సాయం గా వచ్చారు. సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు సాత్యకిని నిలువరించారు. సాత్యకి అస్త్రాలకు సరైన సమాధానం ఇచ్చిన భూరిశ్రవుడు క్షణ కాలం లో పది బాణాలు సంధించి సాత్యకి కుమారులను సంహరించాడు .దెబ్బతిన్న బెబ్బులిలా సాత్యకి వేటకొడవలి తో భూరిశ్రవుడి మీద విరుచుకు పడ్డాడు. ఇంతలో పుత్రశోకం లో ఉన్న సాత్యకిని కోల్పోయే ప్రమాదం ఉందని భీముడు రధం తో వచ్చి సాత్యకి ని ఎత్తుకుపోయారు.
ఇలా ఇరువైపులా జరిగిన ఘోరకలితో సూర్యుడు ఎర్రబడి అస్తమించాడు.

ఆరవ రోజు దృష్టద్యుమ్నుడు పాండవులను మకర వ్యూహం లో సమీకరించాడు. కౌరవులు క్రుంచ వ్యూహంలో ముందుకొచ్చారు.

సూర్యుడి లేలేత కిరణాల తాకిడి కి సైనికుల కవచాలు మెరుస్తున్నాయి. మళ్ళీ మా తాత భీమసేనుని ధాటికి కురుసైన్యం విలవిలలాడింది. ఒంటరిగా రధం దిగి భీములవారు తన గదతో శత్రుసైన్యం పై విరుచుకుపడ్డారు. దృష్టద్యుమ్నుడు భీముని వెనుక వెళ్లి చూసే సరికి గుట్టలు గా పడిఉన్న శవాల మధ్యలోంచి సుడిగాలి లా భీముడు వచ్చారు. దృష్టద్యుమ్నుడు వెంటనే వెళ్లి రక్తంతో నిండిన భీముని రధం పైనుండి లాక్కొని వెళ్ళిపోయాడు. కానీ కౌరవులు చుట్టుముట్టారు. వెంటనే దృష్టద్యుమ్నుడు ప్రమోహన అస్త్రాన్ని సంధించి శత్రువులను వివశులు గావించాడు. సైన్యం మొద్దుబారిపోవడం చూసి ద్రోణాచార్యులు ప్రజ్ఞ అస్త్రాన్ని ప్రయోగించి సైన్యం లో ఉత్తేజం నింపారు. మళ్ళీ కౌరవులు చుట్టుముట్టారు.ఇరుక్కుపోయిన వారిని రక్షించడానికి అభిమన్యుడు ద్రౌపది కుమారులతో కలిసి సూచి(సూది)వ్యూహం తో కౌరవ సమూహం లోకి దూసుకెళ్ళారు.

అభిమన్యుని రక్షణ లో భీముడు,ధృష్టద్యుమ్నుడు రక్షింపబడ్డారు. కానీ ద్రోణుని తో ధృష్టద్యుమ్నుడు హోరా హోరి తలపడ్డారు .

1 Comment

  1. Since,4 days no new postings. For Pinki sex story you received 15 comments to continue but what is the use. I think you don’t bother/consider readers anxious about comments then why you are seeking comments.

Comments are closed.