యవ్వనం 375

ఈ రోజు నేను చాలా లక్కీ అనుకున్నాను. ఆమె కూర్చోవడంతో ఆమె స్కర్ట్ కొంచెం మోకాలికి పైన వచ్చింది. నా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది. ఎంత అందమైన కాళ్ళు అనుకున్నాను. ఆమె నావైపు ఒక్కసారిగా చూసింది. నేను కంగారుగా నా చూపు తిప్పి ఆమె మొహం వైపు చూసాను. ఆమె చిరునవ్వు నవ్వి హై అని చిన్నగా అంటూ చేతి వెళ్ళుతో గ్రీట్ చేసింది. నేను కూడా నవ్వి గ్రీట్ చేసాను. “ఐ యాం కావ్య” అంది. నేను నవ్వి “అవును. క్లాసులో వస్తూ చెప్పారు కదా. ఐ యమ హరి” అన్నాను. “నైస్ టు మీట్ యూ” అంది. నేను నవ్వి ఊరుకున్నాను. అబ్బాయాలలో నేనే అందరికన్నా మేన్లీగా అందంగా కూడా ఉంటాను అన్న విషయం తెలుసు. మేము మా ఆ ఊరిలో అందరికన్నా స్థితిమంతులం కావడంతో ఆ చాయలు నా డ్రస్ సెన్స్ లోనూ, నా మేనరిజమ్స్ లోనూ కనబడుతుంటుంది. మా తాతలు ఆ ప్రాంతానికి జమీన్దారులుగా ఉండేవారు. మా ఇల్లు ఇప్పటికీ ఆ రాజసం ఉట్టిపడుతూ ఉంటుంది. మా ఊరి అమ్మాయలు నాతో మాట్లాడాలని కోరికగా ఉన్నా మేమంటే ఉన్న భయం, గౌరవం కారణంగా నన్ను కొంచెం వేరుగానే ఉంచేవారు. ఇంతలో సర్ క్లాస్ ని విడచిపెట్టేసారు. మొదటిరోజు కావడంతో కేవలం పరిచయాలు మాత్రమె అయ్యాయి. ఇంకా ఇద్దరు లెక్చరర్స్ వచ్చి మళ్ళీ రోల్ కాల్ పిలిచి వెళ్ళిపోయారు. ఈ లోగా నేను, కావ్య కొంచెం పరిచయస్తుల్లా మారాము. క్లాసులో ఉన్న అబ్బాయలందరూ అసూయగా నా వైపు ఆరాధనాగా కావ్య వైపు చూస్తున్నారు. “మిమ్మల్ని ఇంతవరకూ ఈ ఊరిలో చూడలేదు” అన్నాను నేను. “మేము నిన్ననే ఈ ఊరు వచ్చాము. మా నాన్నగారు డాక్టర్. ఇంకో విషయం చెప్పనా?”అడిగింది. ఏమిటన్నట్టు ఆమె వైపు చూసాను. “మేము మీ ఇంటికి దగ్గరగానే ఉంటున్నాము. మీ వీధి చివరి ఇంట్లోనే మేము దిగాము” అంటూ నవ్వింది. నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. అంటే ఈమె నన్ను నిన్ననే చూసిన్దన్నమాట. అంతకంటే చాలా ఆనందంగా ఉంది. ఆమె మా ఇంటికి దగ్గరగా ఉండడం, అంతే కాకుండా ఆమె నన్ను గుర్తిన్చండం. అంటే నేను ఆమెను మరింత ఎక్కువగా కలసుకొనే అవకాశం ఉందన్నమాట.

ఆ రోజు మొదటి రోజు కావడంతో మధ్యాహ్నం క్లాసులు సస్పెండ్ చేసారు. మేము ఇద్దరమూ బయటకు వచ్చాము. నాకు ఒక స్కూటరెట్ ఉంది. అది మా కజిన్ ది. ఆమె హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం హైదరాబాద్ వెళ్తూ ఆ స్కూటరెట్ ని నాకు ఇచ్చేసింది. నేను ఇంకా చిన్న పిల్లవాడినే మా ఇంట్లో. అందువల్ల నాకు బైక్ కొనివ్వలేదు ఇంకా. ఆమె నాతో పాటు నా వెహికిల్ దగ్గరకు వచ్చి“ నవ్వులానే నీ వెహికిల్ కూడా ఉంది. ఇది అమ్మాయల వెహికిల్” అంటూ పెద్దగా నవ్వింది. నాకు ఒక్కసారి ఇబ్బందిగా అనిపించింది. అవకాశం ఇస్తే నా మగతనమేమిటో ఆమెకి తప్పక చూపించాల్సిందే అనుకున్నాను. అయితే ఆ అవకాశం చాలా తొందరగానే వస్తుందని నాకు అప్పటికి తెలీదు. “ఇది అమ్మాయల వెహికిల్ కాబట్టి అమ్మాయిలే డ్రైవ్ చెయ్యాలి అంటూ చనువుగా నా చేతిలో ఉన్న కీస్ తీసుసుకుని దాని మీద కూర్చుని స్టార్ట్ చేసింది. “కూర్చో. మొహమాట పడకులే. నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేద్దువు గానీ.”అన్నది. నేను నవ్వుతూ ఆమె వెనక కూర్చున్నాను. ఆమె స్కర్ట్ ని కొంచెం సర్దుకొని స్కూటరెట్ ని ముందుకు ఉరికించింది. ఆ ఊరిలో రోడ్లు అంత బాగా ఉండవు. దేశంలోని మిగిలిన రోడ్లకన్నా ఇక్కడ చాలా అధ్వాన్నమని నా అభిప్రాయం. ఆమె వెహికిల్ ని చాలా వేగంగా నడుపుతోంది. నాకు వెనక బెలన్స్ గా కూర్చోవడం కష్టంగా ఉంది. “భయమైతే నన్ను పట్టుకో” ఆమె నవ్వుతూ అంది.“పర్లేదు” బింకంగా అన్నాను.

7 Comments

  1. Super story bro continue madyalo apoddu plz

  2. సూపర్ గా ఉంది బ్రో నీ స్టొరీ

  3. Great writing

  4. Bro emo anukunna kani nijam ga bagundhi e story madhylo appodhu andarila complete chyndi

  5. Good litarature

  6. Super u r very intelligent boy

Comments are closed.